ఆన్‌లైన్‌లో సమాచార సవరణకు ఇంటర్ విద్యార్థులకు నవంబర్ 30 వరకు అవకాశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ వివరాలను అపరాధ రుసుము రూ.300 (ఒక విద్యార్థికి) చెల్లించి నవంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో సరిదిద్దుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ నవంబర్23న ఓ ప్రకటనలో తెలిపారు.
విద్యార్థుల అడ్మిషన్ డేటా, నామినల్ రోల్స్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు వస్తాయని, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ వెంటనే ఆన్‌లైన్‌లో విద్యార్థుల వివరాలను సరిచూసుకోవాలన్నారు. అలాగే ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే ప్రైవేటు విద్యార్థులు (ఆర్‌ట్స లేదా హ్యుమానిటీస్ కలయికతో) అటెండెన్స్ ఫీజు రూ. 1000 ఈ నెల 30లోగా చెల్లించి పరీక్షలకు హాజరుకావచ్చని వెల్లడించారు.
Published date : 25 Nov 2019 03:08PM