Skip to main content

ఆంధ్రప్రదేశ్లో ‘స్కిల్’ వర్సిటీ!

సాక్షి, అమరావతి : జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శి డాక్టర్ కేపీ కృష్ణన్‌ను రాష్ట్ర సాధారణ పరిపాలనా (రాజకీయ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ కలిసిన సమయంలో ఈ విషయమై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆయనతో చెప్పారు. కేపీ కృష్ణన్ ఈ విషయమై స్పందిస్తూ జర్మన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనంతరాముకు సమాచారం ఇచ్చారు.   
Published date : 03 Dec 2019 02:03PM

Photo Stories