ఆంధ్రప్రదేశ్‌లో 13న ఇంటర్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈనెల 13న విడుదల కానున్నాయి.
విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. 1,445 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 10,31,285 మంది హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్ 20న ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయగా, ఈసారి అంతకన్నా వారం రోజుల ముందుగా విడుదల చేస్తున్నారు. విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలను www.sakshieducation.com లో చూసుకోవచ్చు.
Published date : 13 Apr 2017 10:17AM