Skip to main content

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్ష ఫీజు గడువు నవంబర్ 15 వరకు పొడిగింపు

సాక్షి, అమరావతి: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.
ఇంటర్ ప్రిపరేషన్ కొరకు క్లిక్ చేయండి

ఎలాంటి అపరాధ రుసుము లేకుండా 15 వరకు చెల్లించవచ్చని నవంబర్5 ఓ ప్రకటనలో వెల్లడించారు. రూ.120 అపరాధ రుసుముతో నవంబర్22 వరకు, రూ.500తో డిసెంబర్ 4 వరకు, రూ.1000తో డిసెంబర్ 16 వరకు, రూ.2000తో డిసెంబర్ 30 వరకు, రూ.3 వేలతో జనవరి 9 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో జనవరి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Published date : 06 Nov 2019 04:46PM

Photo Stories