ఆక్టోబర్15లోగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలఫీజు చెల్లించాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రైవేటు అభ్యర్థులు రూ. 500 హాజరు మినహాయింపు ఫీజును అక్టోబరు 15 లోగా చెల్లించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి సెప్టెంబర్ 17ఒక ప్రకటనలో తెలిపారు.
ఫీజు చెల్లించడం కుదరని పక్షంలో ఆలస్య రుసుముతో అక్టోబరు 30 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఫీజును ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని, వివరాలకు tsbie.cgg.gov.inను సంప్రదించాలని సూచించారు.
Published date : 17 Sep 2019 01:50PM