ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల
Sakshi Education
జేఈఈ-మెయిన్, జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లకు ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో సీట్ల కేటాయింపు కోసం ఉమ్మడి కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది. జోసాగా పేర్కొనే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా)-2017కు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది.
జోసా ఇలా:
జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ విధానం ప్రకారం- సీట్ల కేటాయింపు మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లు ఇందుకోసం జోసా వెబ్‌సైట్‌లో తమ లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ ఆసక్తి మేరకు ప్రాథమ్యాలు పేర్కొనాలి. ఇలా అభ్యర్థులు పేర్కొన్న ప్రాథ్యమాలు, వారికి లభించిన ర్యాంకు, అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకొని సాఫ్ట్‌వేర్ ఆధారితంగా రౌండ్ల వారీగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.
ఏడు రౌండ్లలో సీట్ల కేటాయింపు :
జోసా-2017లో మొత్తం ఏడు రౌండ్లలో సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. వాస్తవానికి గతేడాది ఆరు రౌండ్లలో ఈ ప్రక్రియ చేపట్టినా... ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సైతం సీట్లు మిగిలిపోవడంతో.. ఈ ఏడాది సీట్ల కేటాయింపు రౌండ్ల సంఖ్యను ఏడుకు పెంచారు.
తదుపరి రౌండ్లకు హాజరుకావచ్చు :
జోసా ద్వారా ఆన్‌లైన్ విధానంలో తమ ప్రాథమ్యాలను పేర్కొన్న విద్యార్థులు సంబంధిత రౌండ్‌లో తమకు నచ్చిన సీటు రాకపోయినా లేదా మెచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లో సీటు లభించకపోయినా.. తదుపరి రౌండ్లలో తమ పేర్లను జోసా వర్గాలు పరిగణించేందుకు అవకాశం కల్పించేలా సదుపాయం అందుబాటులో ఉంది. ఈ క్రమంలో విద్యార్థులకు.. సీటు కేటాయింపు ప్రక్రియ తర్వాత ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనే ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
ఫ్రీజ్ :
తొలి దశలోనే సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్, ప్రోగ్రామ్‌తో సంతృప్తి చెందితే ఫ్రీజ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో తదుపరి రౌండ్లకు విద్యార్థుల చాయిస్‌లను పరిగణనలోకి తీసుకోరు. తొలిదశలో సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌లోనే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఫ్లోటింగ్ :
తొలి దశలో వచ్చిన సీటుతో సంతృప్తి చెందక ఇంకా మంచి ఇన్‌స్టిట్యూట్ లేదా బ్రాంచ్ కోసం ఆసక్తి చూపితే ఫ్లోటింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఫలితంగా ఆ విద్యార్థి ప్రాథమ్యాలను తదుపరి రౌండ్లకు పరిగణనలోకి తీసుకుంటారు.
స్లైడింగ్ :
తొలి దశలోనే ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఒక బ్రాంచ్‌లో సీటు వచ్చిన విద్యార్థి.. అదే ఇన్‌స్టిట్యూట్‌లో మరో బ్రాంచ్‌లో సీటు కోరుకుంటే స్లైడింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.ఇలా ఫ్లోటింగ్, స్లైడింగ్ ఆప్షన్‌లు పేర్కొనడం వల్ల అభ్యర్థులకు చివరగా కేటాయించిన సీట్లే ఖరారవుతాయి. తొలి దశలో లేదా అంతకుముందు దశల్లో వచ్చిన సీట్లు రద్దవుతాయి.
మాక్ సీట్ అలాట్‌మెంట్ :
జోసా ద్వారా అభ్యర్థులకు లభించే మరో సదుపాయం.. మాక్ సీట్ అలాట్‌మెంట్. దీని ప్రకారం.. విద్యార్థులు పేర్కొన్న ప్రాథమ్యాల ఆధారంగా వారికి సీటు వచ్చే అవకాశం ఉన్న ఇన్‌స్టిట్యూట్, బ్రాంచ్‌ల వివరాలను మాక్ సీట్ అలాట్‌మెంట్ పేరుతో తెలియజేస్తారు. దీని ద్వారా అభ్యర్థులు తమ ప్రాథమ్యాలను మార్చుకునే వీలుంది.
ప్రవేశాల షెడ్యూల్...
జూన్ 15-19: ఆప్షన్ల నమోదు
జూన్ 28: తొలి విడత సీట్ల కేటాయింపు.
జూలై 4: రెండో విడత సీట్ల కేటాయింపు.
జూలై 7: మూడో విడత.
జూలై 10: నాలుగో విడత.
జూలై 13: ఐదో విడత.
జూలై 15: ఆరో విడత.
జూలై 18: ఏడో విడత.
జూలై 19: రిపోర్టు చేయాలి.
జోసా 2017లో పాల్పంచుకునే ఇన్‌స్టిట్యూట్స్ 97
23 ఐఐటీల్లో మొత్తం సీట్లు 10, 572
31 నిట్‌లలో.. సీట్ల సంఖ్య 18,013
20 ట్రిపుల్ ఐటీల్లో సీట్లు 2,526
18 జీఎఫ్‌టీఐల్లో సీట్ల సంఖ్య 3,783

Published date : 09 Jun 2017 03:41PM