19న ఇంటర్ పరీక్షలు యథాతథం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 19న జరగాల్సిన ఇంటర్మీడియెట్ పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంతకుముందు మహబూబ్‌నగర్- హైదరాబాద్-రంగారెడ్డి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగానే 9న జరగాల్సిన పరీక్షలను 19వ తేదీకి వాయిదా వేశామని పేర్కొంది. కానీ ఇప్పుడు ఆ పోలింగ్ రద్దుకావడంతో 19వ తేదీన రీపోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారని తెలిపింది. అయితే తాము మాత్రం ఆ రోజు (19వ తేదీన) పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించింది.
Published date : 10 Mar 2017 03:54PM