15 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 15 నుంచి 23 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 872 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 4,78,270 మంది అభ్యర్థులు హాజరుకానుండగా... వీరిలో మొదటి సంవత్సరానికి సంబంధించి 3,26,632 మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 1,51,648 మంది ఉన్నారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు...
విద్యార్థులను 15 నిమిషాల ముందే పరీక్ష హాలులోకి అనుమతిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ మీడియాకు వివరించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని చెప్పారు. హైటెక్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు జీపీఆర్‌ఎస్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రశ్నపత్రాన్ని సీసీ కెమెరాల ముందే తీసి పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్

తేదీ | ఫస్టియర్(ఉ.9:00- మ12:00) | సెకండియర్(మ.2:30- సా.5.30) |
15-05-2017 | సెకండ్ లాంగ్వేజీ | సెకండ్ లాంగ్వేజీ |
16-05-2017 | ఇంగ్లిష్-1 | ఇంగ్లిష్-2 |
17-05-2017 | గణితం-1ఏ, బోటనీ-1 | గణితం-2ఏ, బోటనీ-2 |
సివిక్స్-1, సైకాలజీ-1 | సివిక్స్-2, సైకాలజీ-2 | |
18-05-2017 | గణితం-1బీ, జువాలజీ-1 | గణితం-2బీ, జువాలజీ-2 |
హిస్టరీ-1 | హిస్టరీ-2 | |
19-05-2017 | ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1 | ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2 |
క్లాసికల్ లాంగ్వేజీ-1 | క్లాసికల్ లాంగ్వేజీ-2 | |
20-05-2017 | కెమిస్ట్రీ-1, కామర్స్-1 | కెమిస్ట్రీ-2, కామర్స్-2 |
సోషియాలజీ-1, ఫైన్‌ఆర్‌ట్స, మ్యూజిక్-1 | సోషియాలజీ-2, ఫైన్‌ఆర్‌ట్స-2, మ్యూజిక్-2 | |
22-05-2017 | జియాలజీ-1, హోమ్‌సైన్స్-1 | జియాలజీ-2, హోమ్‌సైన్స్-2 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, లాజిక్-1 | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్-2 | |
బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-1(బైపీసీ) | బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-2(బైపీసీ) | |
23-05-2017 | మోడ్రన్ లాంగ్వేజీ-1, జియోగ్రఫీ-1 | మోడ్రన్ లాంగ్వేజీ-2, జియోగ్రఫీ-2 |
Published date : 15 May 2017 03:08PM