రాష్ట్ర గవర్నర్ నియామకం, అధికారాలు, విధులు
1. మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ ఆర్డినెన్సుల జారీ ఏ రకమైన అధికారం?
1) శాసన అధికారం
2) కార్య నిర్వహణ అధికారం
3) విచక్షణ అధికారం
4) అత్యవసర అధికారం
- View Answer
- సమాధానం: 1
2. భారత రాజ్యాంగంలోని 156వ ప్రకరణం గవర్నర్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు పదవిలో ఉంటారు అని చెబుతోంది. దీని నుంచి ఏ అర్థాలను గ్రహించొచ్చు?
1) ఏ గవర్నరునూ అతని పదవీ కాలం పూర్తయ్యే వరకు తొలగించలేరు
2) ఏ గవర్నరూ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేడు
1) 1 మాత్రమే 2) 2 మాత్రమే
3) 1, 2 4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
3. రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సభ్యులను ఎవరు నియమిస్తారు? ఎవరు తొలగిస్తారు?
1) నియమించేది, తొలగించేది గవర్నర్
2) నియమించేది గవర్నర్, తొలగించేది రాష్ర్ట శాసనసభ సిఫార్సు మేరకు గవర్నర్
3) నియమించేది గవర్నర్, తొలగించేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
4) నియమించేది గవర్నర్, తొలగించేది రాష్ర్టపతి
- View Answer
- సమాధానం: 4
4. కేంద్రం, రాష్ట్రాల అధికార విభజన వివాదాలు పరిష్కరించడానికి ఉపయోగించే సూత్రాలు?
ఎ) డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్
బి) డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లైడ్ పవర్స
సి) డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
5. ప్రభుత్వ విత్తంపై పార్లమెంటు నియంత్రణ చేసే పద్ధతి?
ఎ) బడ్జెట్
బి) ఆర్థిక బిల్లు
సి) అనుమతి ఉపక్రమణ బిల్లు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
6. కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన చేయాలి?
ఎ) రాష్ర్టపతి
బి) పార్లమెంటు
సి) కేంద్ర ఆర్థిక మంత్రి
డి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
- View Answer
- సమాధానం: బి
7. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపైన ఆధారపడతాయి?
1) రాజ్యాంగ ప్రకరణలు
2) సంప్రదాయాలు, వాడుకలు
3) న్యాయస్థానాల వ్యాఖ్యానాలు
4) సంప్రదింపులు, చర్చలు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 3, 4
డి) 1, 3, 4
- View Answer
- సమాధానం: ఎ
8. కింది ఏ కమిషన్ కేంద్రం, రాష్ట్రాల సంబంధాలను సమీక్ష చేయలేదు?
ఎ) ఎం.ఎన్. పుంచీ
బి) రాజమన్నార్
సి) సర్కారియా
డి) దంత్వాలా
- View Answer
- సమాధానం: డి
9. కింది ఏ అంశాలు రాష్ర్ట జాబితాలోకి రావు?
ఎ) శాంతి భద్రతలు
బి) మైనింగ్
సి) జైళ్లు
డి) క్రిమినల్ ప్రోసీజర్లు
- View Answer
- సమాధానం: డి
10. కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం కానిది?
ఎ) గవర్నర్ల నియామకం
బి) రాష్ర్టపతి పాలన
సి) గ్రాంట్ల మంజూరు
డి) అఖిల భారత సర్వీసులు
- View Answer
- సమాధానం: డి
11. సహకార సమాఖ్య అంటే ఏమిటి?
ఎ) రాష్ట్రాల ప్రాధాన్యతలు గుర్తించడం
బి) కేంద్రంపై ఆధారపడడం
సి) రాష్ట్రాలు అడిగిన సహాయాన్ని కేంద్రం అందించడం
డి) పరస్పర ఆధార, ప్రాధాన్యతలు
- View Answer
- సమాధానం: డి
12. సహకార సమాఖ్యను పెంపొందించే ప్రకరణలు?
ఎ) ప్రకరణ 252
బి) ప్రకరణ 258
సి) ప్రకరణ 258ఎ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
13. కేంద్ర బడ్జెట్ను లోక్సభ తిరస్కరిస్తే....?
ఎ) బడ్జెట్ను మార్పు చేసి తిరిగి ప్రవేశపెడతారు
బి) కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తారు
సి) ప్రధానమంత్రి, మంత్రి మండలి రాజీనామా చేస్తుంది
డి) రాష్ర్టపతి నిర్ణయం మేరకు పరిస్థితి ఉంటుంది
- View Answer
- సమాధానం: సి
14. రాజ్యాంగంలో ప్రస్తావించకుండా ఆ తర్వా త కాలంలో అమల్లోకి వచ్చిన పన్నులు?
ఎ) కార్పొరేట్ ట్యాక్స్
బి) గిఫ్ట్ ట్యాక్స్
సి) సర్వీసు ట్యాక్స్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
15. రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు?
ఎ) గవర్నర్
బి) ముఖ్యమంత్రి
సి) భారత రాష్ర్టపతి
డి) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
- View Answer
- సమాధానం: ఎ