రాజ్యాంగ పరిషత్, ప్రవేశిక
1. రాజ్యాంగ పీఠికలో భారతదేశాన్ని ఏ రకమైన రాజ్యంగా పేర్కొన్నారు?
ఎ) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
బి) సామ్యవాద, సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
సి) ప్రజాస్వామ్య, సామ్యవాద, సార్వభౌమ, గణతంత్ర రాజ్యం
డి) లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద, ఏక కేంద్ర, సార్వభౌమ, గణతంత్ర రాజ్యం
- View Answer
- సమాధానం: ఎ
2. భారత రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న పౌర రక్షణలు ఏవి?
ఎ) న్యాయం, స్వేచ్ఛ, సంక్షేమం, సమానత్వం
బి) న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం
సి) న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
డి) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సంక్షేమం
- View Answer
- సమాధానం: సి
3. రాజ్యాంగ పీఠికకు సంబంధించిన తొలి సవరణ ఏది?
ఎ) 1వ సవరణ
బి) 24వ సవరణ
సి) 42వ సవరణ
డి) 44వ సవరణ
- View Answer
- సమాధానం: సి
4. భారత రాజ్యాంగ పీఠిక అనేది..?
ఎ) రాజ్యాంగ వ్యూహ రచన గురించి తెలుపుతుంది
బి) పౌర హక్కుల రక్షణ గురించి మాత్రమే తెలుపుతుంది
సి) ప్రభుత్వ నిర్మాణం గురించి తెలుపుతుంది
డి) భారత రాజ్యాంగ తత్వాన్ని తెలుపుతుంది
- View Answer
- సమాధానం: డి
5. భారత రాజ్యాంగ పీఠిక ఏ వాక్యాలతో ప్రారంభమవుతుంది?
ఎ) ‘భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులమైన మేము..’
బి) ‘భారత ప్రజాప్రతినిధులమైన మేము..’
సి) ‘భారత ప్రజలమైన మేము..’
డి) ‘భారతదేశ నాయకులమైన మేము..’
- View Answer
- సమాధానం: సి
6.42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పీఠికకు చేర్చిన పదాలేవి?
ఎ) సామ్యవాద, లౌకిక, సమాఖ్య
బి) సామ్యవాద, లౌకిక, సమగ్రత
సి) సామ్యవాద, సమాఖ్య, సమగ్రత
డి) సామ్యవాద, లౌకిక, జాతీయ ఐక్యత
- View Answer
- సమాధానం: బి
7. భారత రాజ్యాంగ పీఠిక రచనకు ఆధారం ఏది?
ఎ) నెహ్రూ నివేదిక
బి) నెహ్రూ ప్రవేశ పెట్టిన ఆశయాలు-లక్ష్యాల తీర్మానం
సి) అమెరికా రాజ్యాంగ పీఠిక
డి) ఐక్యరాజ్య సమితి చార్టర్ పీఠిక
- View Answer
- సమాధానం: బి
8. ఇప్పటి వరకు పీఠికకు ఎన్నిసార్లు సవరణ చేశారు?
ఎ) ఒకసారి
బి) రెండుసార్లు
సి) మూడుసార్లు
డి) నాలుగుసార్లు
- View Answer
- సమాధానం: ఎ
9. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తీసుకునే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
ఎ) కెనడా
బి) ఐర్లాండ్
సి) ఆస్ట్రేలియా
డి) అమెరికా
- View Answer
- సమాధానం: ఎ
10.రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) ఐర్లాండ్
బి) కెనడా
సి) అమెరికా
డి) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: డి
11. ‘కేబినెట్’ అనే పదాన్ని ఎన్నో అధికరణలో ప్రస్తావించారు?
ఎ) 74(1)
బి) 75(2)
సి) 352(1)
డి) 352(3)
- View Answer
- సమాధానం: డి
12. దిగుసభ (లోక్‌సభ) ఆధిక్యత గురించి తెలిపే అధికరణ ఏది?
ఎ) 75(1)
బి) 75(2)
సి) 75(3)
డి) 80(1)
- View Answer
- సమాధానం: సి
13.రాజ్యాంగ ప్రవేశికలో ‘సౌభ్రాతృత్వం’ అనే పదాన్ని చేర్చాలని ప్రతిపాదించింది ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
సి) కె.ఎం. మున్షీ
డి) కె.టి. షా
- View Answer
- సమాధానం: బి
14. ‘సామ్యవాదం అంటే.. ప్రజల ఆర్థిక, సాంఘిక జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
ఎ) డి.ఎస్. నకారా V/s యూనియన్ ఆఫ్ ఇండియా (1982)
బి) Excel Wear V/s యూనియన్ ఆఫ్ ఇండియా (1978)
సి) ఎస్.ఆర్. బొమ్మైకేసు 1994
డి) సుఖదేవ్‌సింగ్ V/s భగత్రామ్ కేసు (1975)
- View Answer
- సమాధానం: ఎ
15.‘ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ లాంటిది’ అని పేర్కొన్నది ఎవరు?
ఎ) ఎం.ఎ. నానీపాల్కీవాలా
బి) కె.ఎం. మున్షీ
సి) ముథోల్కర్
డి) అంబేడ్కర్
- View Answer
- సమాధానం: డి
16. భారత్‌లో ఏ రకమైన సామ్యవాదం ఉంది?
ఎ) కమ్యూనిస్టు సామ్యవాదం
బి) ప్రజాస్వామ్య సామ్యవాదం
సి) పెట్టుబడిదారీ సామ్యవాదం
డి) శ్రామిక సంఘ సామ్యవాదం
- View Answer
- సమాధానం: బి
17. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాలని తెలిపే అధికరణ ఏది?
ఎ) 38
బి) 39
సి) 41
డి) 43
- View Answer
- సమాధానం: ఎ
18. భారత్‌లో ఏ రకమైన ప్రజాస్వామ్యం ఉంది?
ఎ) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
బి) పరోక్ష ప్రజాస్వామ్యం
సి) అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం
డి) కులీన ప్రజాస్వామ్యం
- View Answer
- సమాధానం: బి
19. ప్రవేశికలో ప్రస్తావించిన ‘ఆర్థిక న్యాయం’ గురించి రాజ్యాంగంలో ఎందులో పేర్కొన్నారు?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) ఆదేశిక సూత్రాలు
సి) ప్రాథమిక విధులు
డి) 7వ షెడ్యూల్
- View Answer
- సమాధానం: బి
20. ప్రవేశికను సవరించవచ్చని సుప్రీంకోర్టు తొలిసారిగా ఏ కేసులో తీర్పు చెప్పింది?
ఎ) బెరుబారి కేసు
బి) కేశవానంద భారతి కేసు
సి) ఎస్.ఆర్. బొమ్మైకేసు
డి) మినర్వా మిల్స్ కేసు
- View Answer
- సమాధానం: బి
21. భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించిన ‘లౌకిక’ పదం గురించి ఎన్నో అధికరణలో పేర్కొన్నారు?
ఎ) 25
బి) 19
సి) 21
డి) 20
- View Answer
- సమాధానం: ఎ
22. ‘ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు’ అని పేర్కొన్నవారెవరు?
ఎ) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
బి) మహావీర్ త్యాగి
సి) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
డి) జవహర్లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: బి
23. ‘ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం’ అని పేర్కొన్నవారెవరు?
ఎ) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
బి) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
సి) కె.టి. షా
డి) కె.ఎం. మున్షీ
- View Answer
- సమాధానం: బి
24.‘ప్రవేశిక రాజ్యాంగానికి కీ నోట్’ అని పేర్కొన్నది ఎవరు?
ఎ) ఎర్నెస్ట్ బార్కర్
బి) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
సి) కె.టి. షా
డి) కె.ఎం. మున్షీ
- View Answer
- సమాధానం: ఎ
25. ‘ప్రవేశిక’తో రాజ్యాంగాన్ని ప్రారంభించిన మొదటి దేశం ఏది?
ఎ) బ్రిటన్
బి) అమెరికా
సి) భారత్
డి) ఐర్లాండ్
- View Answer
- సమాధానం: బి
26. ‘సార్వభౌమాధికారం’ అనేది ఏ పదం నుంచి ఆవిర్భవించింది?
ఎ) డెమోస్
బి) క్రోషియో
సి) సుపరానాస్
డి) ఫోడస్
- View Answer
- సమాధానం:సి
27. ‘భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం’గా పేర్కొన్నది ఎవరు?
ఎ) ఐవర్ జెన్నింగ్స్
బి) ఆస్టిన్
సి) ఒ.పి. గోయల్
డి) కె.టి. షా
- View Answer
- సమాధానం: ఎ
28. భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1946 ఆగస్టు 24
బి) 1946 సెప్టెంబర్ 2
సి) 1946 అక్టోబర్ 29
డి) 1946 డిసెంబర్ 9
- View Answer
- సమాధానం: బి
29. మౌంట్ బాటన్ పథకాన్ని ఏ తేదీన ప్రకటించారు?
ఎ) 1948 జూన్ 3
బి) 1947 జూన్ 3
సి) 1946 జూన్ 4
డి) 1948 జూన్ 20
- View Answer
- సమాధానం: బి
30. రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించిన కమిటీలన్నింటిలో పెద్దది ఏది?
ఎ) సలహా సంఘం
బి) రూల్స్ కమిటీ
సి) ముసాయిదా కమిటీ
డి) సభా కమిటీ
- View Answer
- సమాధానం: ఎ
31. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశాన్ని ఏ తేదీన నిర్వహించారు?
ఎ) 1950 జనవరి 26
బి) 1950 జనవరి 24
సి) 1950 జనవరి 22
డి) 1950 జనవరి 29
- View Answer
- సమాధానం: బి
32.మద్రాస్ ప్రావిన్సీ నుంచి రాజ్యాంగ పరిషత్‌కు ఎంత మంది సభ్యులు ఎన్నికయ్యారు?
ఎ) 55
బి) 49
సి) 19
డి) 36
- View Answer
- సమాధానం: బి
33. ముసాయిదా రాజ్యాంగాన్ని పరీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ ఎవరు?
ఎ) కె.ఎం. మున్షీ
బి) కె.టి. షా
సి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
డి) పైన పేర్కొన్నవారెవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
34.రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం సభ్యుల సంఖ్య?
ఎ) 389
బి) 299
సి) 292
డి) 296
- View Answer
- సమాధానం: ఎ
35. కేంద్రం.. రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) కెనడా
బి) అమెరికా
సి) ఐర్లాండ్
డి) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: ఎ
36. కింద పేర్కొన్న వారిలో చిత్తు రాజ్యాంగాన్ని రాసినవారెవరు?
ఎ) బి.ఎన్. రావు
బి) మోతీలాల్ నెహ్రూ
సి) సచ్చిదానంద సిన్హా
డి) హెచ్.సి. ముఖర్జీ
- View Answer
- సమాధానం: ఎ
37. అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు, షెడ్యూళ్లు ఉన్నాయి?
ఎ) 315 అధికరణలు, 8 షెడ్యూళ్లు
బి) 321 అధికరణలు, 10 షెడ్యూళ్లు
సి) 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు
డి) 240 అధికరణలు, 13 షెడ్యూళ్లు
- View Answer
- సమాధానం: ఎ
38. భారత రాజ్యాంగాన్ని ‘ఐరావతం’గా ఎవరు పేర్కొన్నారు?
ఎ) హెచ్.వి.ఆర్. అయ్యంగార్
బి) ఎర్నెస్ట్ బార్కర్
సి) హెచ్.వి. కామత్
డి) హెచ్.సి. ముఖర్జీ
- View Answer
- సమాధానం:సి
39. కింది వాటిలో రాజ్యాంగ పరిషత్‌పై చేసిన విమర్శలకు సంబంధించనిది ఏది?
ఎ) ప్రాతినిధ్యం లేని సంస్థ
బి) కాంగ్రెస్ ఆధిపత్యం
సి) న్యాయవాదుల ఆధిపత్యం
డి) రాజ్యాంగాన్ని రాయడానికి తక్కువ సమయం తీసుకుంది
- View Answer
- సమాధానం: డి
40. ‘భారత రాజ్యాంగ పరిషత్ ఒకే పార్టీకి చెందిన సంస్థ, రాజ్యాంగ పరిషత్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే భారతదేశం’ అని ఎవరు అన్నారు?
ఎ) విన్స్టన్ చర్చిల్
బి) గ్రాన్ విల్లీ ఆస్టిన్
సి) లార్డ విస్కాంట్ సైమన్
డి) ఒ.పి. గోయల్
- View Answer
- సమాధానం: బి
41. ‘ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్’ పుస్తక రచయిత ఎవరు?
ఎ) గ్రాన్ విల్లీ ఆస్టన్
బి) ఒ.పి. గోయల్
సి) ఎం.వి. ఫైలీ
డి) విస్కాంట్ సైమన్
- View Answer
- సమాధానం: బి
42. పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ సభ్యులు వెళ్లిపోయిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్‌లో స్వదేశీ సంస్థానాల నుంచి ఎంత మంది సభ్యులు ప్రాతినిధ్యం వహించారు?
ఎ) 284
బి) 299
సి) 289
డి) 70
- View Answer
- సమాధానం: డి
43. రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన అంశాలు, తేదీలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1) జాతీయ పతాకం: 1947 జనవరి 22
2) జాతీయ ముద్ర: 1950 జనవరి 26
3) జాతీయ గేయం: 1950 జనవరి 26
4) జాతీయ గీతం: 1950 జనవరి 24
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 4
సి) 3, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: బి
44. ‘రాజ్యాంగం’ అనే భావన తొలిసారిగా ఏ దేశాల్లో ఏర్పడింది?
ఎ) కమ్యూనిస్టు దేశాలు
బి) పాశ్చాత్య దేశాలు
సి) తూర్పు దేశాలు
డి) మూడో ప్రపంచ దేశాలు
- View Answer
- సమాధానం: బి
45. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల శాసనసభల్లో ఎప్పుడు డిమాండ్ చేసింది?
ఎ) 1935
బి) 1937
సి) 1939
డి) 1945
- View Answer
- సమాధానం: బి
46. పార్టీలవారీగా రాజ్యాంగ పరిషత్తు సభ్యులకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఎ) కాంగ్రెస్ పార్టీ - 202 స్థానాలు
బి) ముస్లింలీగ్ - 73 స్థానాలు
సి) కమ్యూనిస్టులు - 1 స్థానం
డి) జన సంఘ్ పార్టీ - 5 స్థానాలు
- View Answer
- సమాధానం: డి
47. కుల, మత, వర్గ ప్రాతిపదికన మొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశానికి హాజరైన హిందువుల సంఖ్య ఎంత?
ఎ) 145
బి) 155
సి) 165
డి) 211
- View Answer
- సమాధానం: బి
48. అంబేడ్కర్ మొదట ఏ ప్రాంతం నుంచి రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ఉన్నారు?
ఎ) బొంబాయి
బి) బెంగాల్
సి) యునెటైడ్ ప్రావిన్స్
డి) మధ్య ప్రావిన్స్
- View Answer
- సమాధానం: బి
49. 1947 స్వాతంత్య్ర చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 1947 జూలై18న బ్రిటిష్ రాణి సంతకం చేశారు
2) దీని ప్రకారం రాజ్యాంగ పరిషత్ ‘శాసన నిర్మాణ శాఖ’గా మారింది
3) రాజ్యాంగ పరిషత్ సార్వభౌమాధికార సంస్థగా రూపుదాల్చింది
4) 1947 జూలై 4న బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు
ఎ) 1, 2, 3
బి) 1, 2, 3, 4
సి) 2, 3, 4
డి) 2, 3
- View Answer
- సమాధానం: బి
50. రాజ్యాంగ పరిషత్ రెండో పర్యాయం సమావేశాలను ప్రారంభించిన తేది?
ఎ) 1946 డిసెంబర్ 13
బి) 1946 డిసెంబర్ 11
సి) 1946 నవంబర్ 11
డి) 1947 జనవరి 20
- View Answer
- సమాధానం: డి