రాజ్యాంగ అవలోకనం, ముఖ్య లక్షణాలు, ప్రవేశిక
1. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం కార్య నిర్వహణ అధికారం ఎవరికి ఉండేది?
ఎ) బ్రిటిష్ రాణి / రాజు
బి) ఇంగ్లండ్ పార్లమెంట్
సి) సమాఖ్య శాసనసభ
డి) కౌన్సిల్‌లోని గవర్నర్ జనరల్
- View Answer
- సమాధానం: డి
2. బ్రిటిషర్లు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1776
బి) 1775
సి) 1777
డి) 1774
- View Answer
- సమాధానం: డి
3. 1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఎలా వ్యవహరిస్తారు?
ఎ) చార్టర్ చట్టాలు
బి) కౌన్సిల్ చట్టాలు
సి) క్రౌన్ చట్టాలు
డి) ఏవీకాదు
- View Answer
- సమాధానం: ఎ
4. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి?
ఎ) 2
బి) 3
సి) 5
డి) 6
- View Answer
- సమాధానం: బి
5. భారత్‌లో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?
ఎ) వాట్సన్
బి) రాబర్ట్ క్లైవ్
సి) డూప్లెక్స్
డి) వారెన్ హేస్టింగ్స్
- View Answer
- సమాధానం: బి
6. భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధాన అంశం / అంశాలు?
ఎ) రాష్ట్రాల కార్య నిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం
బి) కేంద్ర రాష్ర్ట ప్రభుత్వ అధికారాలను నిర్వచించడం
సి) కేంద్ర, రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించింది?
ఎ) ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1861
బి) ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1862
సి) ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1909
డి) గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం, 1919
- View Answer
- సమాధానం: ఎ
8. ‘గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం’ అని నెహ్రూ దేన్ని పేర్కొన్నారు?
ఎ) కేబినెట్ ప్లాన్
బి) మౌంట్‌బాటన్ ప్లాన్
సి) వేవెల్ ప్లాన్
డి) 1935 భారత ప్రభుత్వ చట్టం
- View Answer
- సమాధానం: డి
9. మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) లార్డ్ మింటో
బి) లార్డ్ బెంటింక్
సి) వారెన్ హేస్టింగ్స్
డి) రాబర్ట్ క్లైవ్
- View Answer
- సమాధానం: ఎ
10. భారతదేశంలో ఏ చట్టం ద్వారా తొలి అధికారిక శాసనసభను ఏర్పాటు చేశారు?
ఎ) చార్టర్ చట్టం, 1833
బి) చార్టర్ చట్టం, 1853
సి) ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1861
డి) ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1892
- View Answer
- సమాధానం: బి
11. మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం?
ఎ) సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం
బి) రాజ్యాంగ సభ ద్వారా భారత రాజ్యాంగ రూపకల్పనకు మార్గదర్శకాలు ఇవ్వడం
సి) బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి
డి) ఆ కాలంలో చెలరేగిన మతకల్లోలాలను నివారించడానికి ప్రణాళిక
- View Answer
- సమాధానం: సి
12. ద్వంద్వ పరిపాలనను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఎ) ఇండియన్ కౌన్సిల్ చట్టం - 1892
బి) భారత ప్రభుత్వ చట్టం - 1909
సి) భారత ప్రభుత్వ చట్టం - 1919
డి) గాంధీ-ఇర్విన్ ఒప్పందం
- View Answer
- సమాధానం: సి
13. రాజ్యాంగ వాదాన్ని మొదటిసారి శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త?
ఎ) అరిస్టాటిల్
బి) రూసో
సి) చార్లెస్ డార్విన్
డి) ప్లేటో
- View Answer
- సమాధానం: ఎ
14. కింది వాటిలో ఏ చట్టాన్ని మొదటి లిఖిత రాజ్యాంగంగా అభివర్ణిస్తారు?
ఎ) పిట్ ఇండియా చట్టం - 1784
బి) రెగ్యులేటింగ్ చట్టం - 1773
సి) చార్టర్ చట్టం - 1313
డి) చార్టర్ చట్టం - 1853
- View Answer
- సమాధానం: బి
15. మొదటిసారిగా మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజక గణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం?
ఎ) 1909
బి) 1919
సి) 1935
డి) ఏవీకాదు
- View Answer
- సమాధానం:ఎ
16. రాష్ట్రాల్లో ద్విసభా పద్ధతికి అవకాశం కల్పించిన చట్టం?
ఎ) 1935
బి) 1919
సి) 1909
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
17. కింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం - 1935లో సరికాని అంశం?
ఎ) ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు
బి) సమాఖ్య వ్యవస్థ ప్రతిపాదన
సి) ఆర్.బి.ఐ. ఏర్పాటు
డి) సార్వజనీన ఓటుహక్కు
- View Answer
- సమాధానం: డి
18. కింది వాటిలో ఏ చట్టం ద్వారా ‘గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్’ పదవిని ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’గా మార్చారు?
ఎ) 1833
బి) 1813
సి) 1861
డి) 1858
- View Answer
- సమాధానం: ఎ
19. సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం?
ఎ) 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించడం
బి) రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించడం
సి) డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
20. కింది వాటిలో ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల మాగ్నా కార్టాగా పేర్కొంటారు?
ఎ) వేవెల్ ప్రతిపాదన
బి) క్రిప్స్ ప్రతిపాదన
సి) కేబినెట్ రాయబార ప్రతిపాదన
డి) విక్టోరియా రాణి ప్రకటన
- View Answer
- సమాధానం: డి
21. మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం?
ఎ) మొదటి రౌండ్ టేబుల్ సమావేశం
బి) రెండో రౌండ్ టేబుల్ సమావేశం
సి) మూడో రౌండ్ టేబుల్ సమావేశం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
22. భారత ప్రభుత్వ చట్టం - 1935ను బానిసత్వానికి నూతన పత్రంగా పేర్కొన్నవారు?
ఎ) కె.టి. షా
బి) జవహర్ లాల్ నెహ్రూ
సి) మహాత్మాగాంధీ
డి) సర్దార్ పటేల్
- View Answer
- సమాధానం: బి
23. కింది వాటిలో ఏ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటయ్యింది?
ఎ) కేబినెట్ ప్రతిపాదనలు
బి) మౌంట్ బాటన్ ప్రతిపాదనలు
సి) క్రిప్స్ ప్రతిపాదనలు
డి) ఏవీకాదు
- View Answer
- సమాధానం: ఎ
24. భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు?
ఎ) 1946 సెప్టెంబర్ 2
బి) 1946 అక్టోబర్ 2
సి) 1946 నవంబర్ 1
డి) 1947 నవంబర్ 1
- View Answer
- సమాధానం: ఎ
25. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం?
ఎ) అమెరికా రాజ్యాంగం
బి) బ్రిటిష్ రాజ్యాంగం
సి) ఐరిష్ రాజ్యాంగం
డి) భారత ప్రభుత్వ చట్టం
- View Answer
- సమాధానం: డి
26. జతపరచండి.
1. పోర్ట పోలియో పద్ధతి ఎ. లార్డ్ మెకాలే
2. సివిల్ సర్వీస్ సులభతరం బి. లార్డ్ కార్నవాలిస్
3. మత నియోజక వర్గాలు సి. లార్డ్ కానింగ్
4. భారత న్యాయ సంస్కరణలు డి. లార్డ్ మింటో
ఎ) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
బి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
సి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
- View Answer
- సమాధానం: ఎ
27.కింది వాటిని ప్రవేశపెట్టిన కాలానుగుణంగా క్రమంలో రాయండి.
1. ప్రత్యేక నియోజకవర్గాలు
2. శాసన అధికారాల బదలాయింపు
3. ద్విసభా విధానం
4. డొమినియన్ ప్రతిపత్తి
ఎ) 1, 2, 3, 4
బి) 2, 1, 3, 4
సి) 3, 2, 1, 4
డి) 3, 4, 1, 2
- View Answer
- సమాధానం: ఎ
28. రాజ్యాంగ వికాసానికి సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి.
ఎ) మాగ్నాకార్టా, యు.ఎస్. రాజ్యాంగం,బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్మెంట్ చట్టం
బి) మాగ్నాకార్టా, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్మెంట్ చట్టం, యు.ఎస్. రాజ్యాంగం
సి) బిల్ ఆఫ్ రైట్స్, మాగ్నాకార్టా, సెటిల్మెంట్ చట్టం, యు.ఎస్. రాజ్యాంగం
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
29. ప్రభుత్వానికి ఉండే అధికారం కింది వాటిలో దేనికి ఉదాహరణ?
ఎ) సంప్రదాయ అధికారం
బి) సమ్మోహన అధికారం
సి) చట్టబద్ధ - హేతుబద్ధ అధికారం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
30. కింది వాటిలో భారత రాజ్యాంగానికి ఏ లక్షణాన్ని ఆపాదించలేం?
ఎ) శాసన శాఖ ఆధిక్యత
బి) న్యాయ శాఖ ఆధిక్యత
సి) కార్య నిర్వాహక శాఖ ఆధిక్యత
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
31. భారత సమాఖ్య స్వభావం?
ఎ) సిద్ధాంత సమాఖ్య
బి) అర్ధ సమాఖ్య
సి) విశిష్ట సమాఖ్య
డి) బేరసారాల సమాఖ్య
- View Answer
- సమాధానం: సి
32. పార్లమెంటరీ వ్యవస్థకు మరో పేరు?
ఎ) కేబినెట్ ప్రభుత్వం
బి) ప్రధానమంత్రి ప్రభుత్వం
సి) పై రెండూ
డి) ఏవీ కాదు
- View Answer
- సమాధానం: సి
33. ‘భారత రాజ్యాంగం సుదీర్ఘమైంది’ కారణం?
ఎ) ఇతర రాజ్యాంగాల ప్రభావం
బి) భారతదేశ వైవిధ్యం
సి) రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు లేకపోవడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
34. కింది వారిలో ఎవరి జీతభత్యాలను రెండో షెడ్యూల్లో పేర్కొనలేదు?
ఎ) పార్లమెంట్ సభ్యులు
బి) స్పీకర్, డిప్యూటీ స్పీకర్
సి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
డి) గవర్నర్
- View Answer
- సమాధానం: ఎ
35. కింది వారిలో ఎవరి జీతభత్యాలను రెండో షెడ్యూల్లో పేర్కొనలేదు?
ఎ) పార్లమెంట్ సభ్యులు
బి) స్పీకర్, డిప్యూటీ స్పీకర్
సి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
డి) గవర్నర్
- View Answer
- సమాధానం: డి
36. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం?
ఎ) రాజ్యాంగం
బి) పార్లమెంట్
సి) ప్రజలు
డి) రాష్ర్టపతి
- View Answer
- సమాధానం: సి
37. భారత రాజ్యాంగ పీఠికలో ఉండే పదాల క్రమం?
ఎ) సార్వభౌమాధికార, ప్రజాస్వామిక, సామ్యవాద, గణతంత్రరాజ్యం
బి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యం
సి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక
డి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం
- View Answer
- సమాధానం: డి
38. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే?
ఎ) రాజ్యాంగ లక్షణాలు చాలా ముఖ్యమైనవి. వాటిని సవరించడానికి వీలులేదు
బి) ప్రాథమిక హక్కులను కుదించడం గానీ, తొలగించడం గానీ కుదరదు
సి) 368 ప్రకరణ ప్రకారం తప్ప రాజ్యాంగాన్ని సవరించడానికి వీలులేదు
డి) కొన్ని అంశాలను సవరించడానికి పార్లమెంట్‌కు అధికారం ఉండదు
- View Answer
- సమాధానం: డి
39. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా వర్ణించినవారు?
ఎ) మహాత్మాగాంధీ
బి) అంబేద్కర్
సి) వల్లభ్‌భాయ్ పటేల్
డి) ఠాకూర్‌దాస్ భార్గవ
- View Answer
- సమాధానం: డి
40. రాజ్యాంగ ప్రవేశిక?
ఎ) సూచనాత్మకమైంది
బి) విషయసూచిక లాంటిది
సి) పై రెండూ
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
41.ప్రవేశిక నుంచి ఏయే అంశాలు తెలుసుకోవచ్చు?
ఎ) రాజ్యాంగ ఆమోద తేది
బి) రాజ్యాంగ ఆధారాలు
సి) రాజ్యాంగ ఆశయాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
42. ‘సమగ్రత’ (ఇంటిగ్రిటీ) అనే పదాన్ని 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. దీని ఉద్దేశం?
ఎ) వేర్పాటువాద శక్తులను అరికట్టడం
బి) భౌగోళిక సామీప్యతను సాధించడం
సి) మతకలహాలను నియంత్రించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
43. భారత ‘సామ్యవాదం’ (సోషలిస్ట్) అనే భావజాలం ఎవరి భావాలను ప్రతిబింబిస్తుంది?
ఎ) మార్క్స, మహాత్మాగాంధీ
బి) గాంధీ, నెహ్రూ
సి) మార్క్స, మావో
డి) మార్క్స, వినోభా బావే
- View Answer
- సమాధానం: ఎ
44.కింది వాటిలో ప్రవేశికకు సంబంధించి సరైంది?
ఎ) రాజ్యాంగంలోని ప్రకరణలతో సంబంధం ఉంటుంది
బి) ప్రత్యేకంగా ప్రవేశికకు ఉనికి ఉండదు
సి) సవరణకు అతీతం కాదు
డి) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: డి
45. కింది వాటిలో ఏయే అంశాలను వ్యాఖ్యానించడానికి ప్రవేశికను ఆధారంగా తీసుకోవచ్చు?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) ఆదేశిక సూత్రాలు
సి) ప్రభుత్వ అధికారాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
46. ప్రవేశికలో పేర్కొన్న ‘సమానత్వం’ కింది వాటిలో దేనికి హామీ ఇస్తుంది?
ఎ) హోదా
బి) అవకాశాలు
సి) ఉపాధి
డి) ఎ, బి
- View Answer
- సమాధానం: డి
47. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ప్రవేశిక అధికారానికి ఆధారం, పరిమితి కాదు
బి) ప్రవేశిక సవరణకు అతీతం కాదు
సి) ప్రవేశికను రాజ్యాంగ రచన తర్వాత చేర్చారు. ఆఖరున ఆమోదించారు
డి) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: డి
48. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) అత్యంత దృఢ రాజ్యాంగం - అమెరికా
బి) పరిమాణాత్మక రాజ్యాంగం - ఇంగ్లండ్
సి) చట్టీకృత రాజ్యాంగం - ఇండియా
డి) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: డి
49. రాజ్యాంగ వాదన అంటే?
ఎ) పరిమిత అధికారాలతో కూడిన పరిపాలన
బి) పరిమిత ప్రభుత్వ వ్యవస్థ
సి) రాజ్యాంగ వికాస దశ
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
50. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేర్చిన అంశాలు?
ఎ) ప్రాథమిక విధులు
బి) ట్రైబ్యునల్
సి) సహకార సంస్థలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి