ప్రభుత్వ సంస్థలు
1. అటార్నీ జనరల్‌కు పార్లమెంట్లో సభ్యత్వం లేకపోయినా చర్చలు, సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఓటువేసే అధికారం ఉండదని తెలిపే అధికరణ?
ఎ) అధికరణ 76
బి) అధికరణ 88
సి) అధికరణ 165
డి) అధికరణ 72
- View Answer
- సమాధానం: బి
2. అటార్నీ జనరల్ పదవీకాలం?
ఎ) అయిదేళ్లు
బి) ఆరేళ్లు
సి) ఆరేళ్లు లేదా 65 ఏళ్లు నిండే వరకు
డి) రాష్ర్టపతి విశ్వాసం చూరగొన్నంత వరకు
- View Answer
- సమాధానం: డి
3. అటార్నీ జనరల్ ఏ న్యాయస్థానంలో తన వాదనలను వినిపించొచ్చు?
ఎ) సుప్రీంకోర్టు, హైకోర్టు
బి) సుప్రీంకోర్టులో మాత్రమే
సి) హైకోర్టులో మాత్రమే
డి) దేశంలోని ఏ కోర్టులోనైనా
- View Answer
- సమాధానం: డి
4. అడ్వొకేట్ జనరల్‌కు సంబంధించి సరైంది?
ఎ) ఆర్టికల్ 165 ఇతడి గురించి తెలియజేస్తుంది
బి) గవర్నర్ విశ్వాసం మేరకు పదవిలో కొనసాగుతారు
సి) ఇతడికి హైకోర్టు న్యాయమూర్తి హోదా ఉంటుంది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
5. భారతదేశ మొదటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్?
ఎ) నరహరిరావు
బి) సుకుమార్ సేన్
సి) శశికాంత్ శర్మ
డి) కె.సి. నియోగి
- View Answer
- సమాధానం: ఎ
6. కాగ్ ఈ కింది ఏ సంస్థకు ‘కళ్లు, చెవులు, చేతులుగా’ వ్యవహరిస్తారు?
ఎ) పార్లమెంటరీ వ్యవహారాల సంఘం
బి) అంచనాల సంఘం
సి) ప్రభుత్వ ఖాతాల సంఘం
డి) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
- View Answer
- సమాధానం: సి
7. రాజ్యాంగం ఏర్పాటు చేసిన పదవులన్నింటిలో ఉన్నత పదవిగా అంబేడ్కర్ దేన్ని పేర్కొన్నారు?
ఎ) ప్రధాన ఎన్నికల కమిషనర్
బి) కాగ్
సి) అటార్నీ జనరల్
డి) ఆర్థిక సంఘం చైర్మన్
- View Answer
- సమాధానం: బి
8. ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్?
ఎ) హెచ్.జె. కృపలానీ
బి) రజని రజ్దాని
సి) దీపక్ గుప్తా
డి) ముకుల్ రోహత్గి
- View Answer
- సమాధానం: సి
9. అఖిల భారత సర్వీసుల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) అంబేడ్కర్
సి) సర్దార్ పటేల్
డి) మహాత్మాగాంధీ
- View Answer
- సమాధానం: సి
10. రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి సరైంది?
1) చైర్మన్, సభ్యులను నియమించేది, తొలగించేది గవర్నర్
2) చైర్మన్, సభ్యులను నియమించేది గవర్నర్, తొలగించేది రాష్ర్టపతి
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) రెండూ సరైనవే
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
11. కేంద్ర ఎన్నికల సంఘం తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
ఎ) పార్లమెంట్
బి) రాష్ర్టపతి
సి) మంత్రిమండలి
డి) ఎవరికీ సమర్పించదు
- View Answer
- సమాధానం: డి
12. రాష్ర్ట ఎన్నికల సంఘాన్ని నియమించేది?
ఎ) రాష్ర్టపతి
బి) కేంద్ర ఎన్నికల సంఘం
సి) గవర్నర్
డి) ఏవరూకాదు
- View Answer
- సమాధానం: సి
13. ఈ కింది వాటిలో రాజ్యాంగ ప్రకరణ ప్రకారం ఏర్పాటైన కమిషన్?
ఎ) సెంట్రల్ విజిలెన్స్ కమిషన్
బి) ఎలక్షన్ కమిషన్
సి) జాతీయ మానవ హక్కుల కమిషన్
డి) విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్
- View Answer
- సమాధానం: బి
14.ప్రణాళిక సంఘం తొలి అధ్యక్షుడు?
ఎ) జి.ఎల్.నందా
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) కె.సి. నియోగి
డి) కె.సి. పంత్
- View Answer
- సమాధానం: బి
15.కేంద్ర నిఘా సంఘాన్ని 1964 ఏర్పాటు చేశారు. ఇందులో చైర్మన్‌తోపాటు ఎంత మంది సభ్యులు ఉంటారు?
ఎ) రెండు
బి) మూడు
సి) నాలుగు
డి) అయిదు
- View Answer
- సమాధానం: ఎ
16. కేంద్ర నిఘా సంఘం చైర్మన్, సభ్యుల పదవీకాలం?
ఎ) మూడేళ్లు
బి) నాలుగేళ్లు
సి) అయిదేళ్లు
డి) ఆరేళ్లు
- View Answer
- సమాధానం: బి
17.మహిళా సాధికారిత కోసం తీసుకున్న ముఖ్య చర్య?
ఎ) స్వయం సహాయక గ్రూపుల ఏర్పాటు
బి) జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు
సి) మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టడం
డి) స్థానిక సంస్థల్లో 50 శాతం స్థానాలను కేటాయించడం
- View Answer
- సమాధానం: డి
18. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా పనిచేయనివారు?
ఎ) రేణుకా చౌదరి
బి) జయంతి పట్నాయక్
సి) పూర్ణిమా అద్వానీ
డి) లలిత కుమార మంగళం
- View Answer
- సమాధానం: ఎ
19. జాతీయ మహిళా కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1990
బి) 1992
సి) 1993
డి) 1995
- View Answer
- సమాధానం: బి
20. మహిళా కమిషన్ చైర్పర్సన్, సభ్యులను ఎవరు నియమిస్తారు?
ఎ) భారత రాష్ర్టపతి
బి) కేంద్ర ప్రభుత్వం
సి) కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
21. జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్నియామకానికి ఉండాల్సిన అర్హత?
ఎ) రాష్ర్టపతి దృష్టిలో ఉన్నత వ్యక్తి అయి ఉండాలి
బి) మానవ హక్కుల రంగంలో ప్రావీణ్యం ఉన్న వారై ఉండాలి
సి) సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
22. జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పదవీ రీత్యా (ఎక్స్-అఫీషియో) సభ్యుడు కానివారు?
ఎ) బీసీ కమిషన్ చైర్మన్
బి) ఎస్సీ కమిషన్ చైర్మన్
సి) ఎస్టీ కమిషన్ చైర్మన్
డి) మహిళా కమిషన్ చైర్పర్సన్
- View Answer
- సమాధానం: ఎ
23. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఎంత?
ఎ) మూడేళ్లు
బి) నాలుగేళ్లు
సి) అయిదేళ్లు
డి) ఆరేళ్లు
- View Answer
- సమాధానం: సి
24. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేసింది?
ఎ) జస్టిస్ రాజేంద్రబాబు
బి) జస్టిస్ భగవతి
సి) జస్టిస్ సిక్రీ
డి) జస్టిస్ ఖన్నా
- View Answer
- సమాధానం: ఎ
25. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్?
ఎ) జస్టిస్ సీతారాంరెడ్డి
బి) జస్టిస్ సుభాషణ్ రెడ్డి
సి) జస్టిస్ సింఘ్వీ
డి) జస్టిస్ నిషార్ అహ్మద్ కక్రూ
- View Answer
- సమాధానం: బి
26. రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ విరమణ వయసు?
ఎ) 60 ఏళ్లు
బి) 62 ఏళ్లు
సి) 65 ఏళ్లు
డి) 70 ఏళ్లు
- View Answer
- సమాధానం: డి
27. 2000లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి నియమించిన రాజ్యాంగ సమీక్ష సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు కొనసాగారు?
ఎ) జస్టిస్ రంగనాథ్ మిశ్రా
బి) జస్టిస్ వెంకటాచలయ్య
సి) జస్టిస్ జీవన్‌రెడ్డి
డి) జస్టిస్ సర్కారియా
- View Answer
- సమాధానం: బి
28. 1978లో జనతా ప్రభుత్వం నియమించిన రెండో బలహీన వర్గాల కమిషన్ అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు?
ఎ) కాకా కలేకర్
బి) బి.పి. మండల్
సి) పొన్నుస్వామి
డి) ఇంద్రసహానీ
- View Answer
- సమాధానం: బి
29. సుప్రీంకోర్టు ఏ కేసు తీర్పు ద్వారా బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది?
ఎ) ఇంద్రా సహానీ v/s భారత ప్రభుత్వం
బి) నవీన్ జిందాల్ v/s కర్ణాటక
సి) భరత్ కుమార్ v/s కేరళ
డి) ఉన్నికృష్ణన్ v/s ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: ఎ
30. 1998లో ఏర్పాటు చేసిన రాష్ర్ట మహిళా కమిషన్ మొదటి అధ్యక్షురాలు?
ఎ) చెరకు సుశీలాదేవి
బి) జయసుధ
సి) త్రిపురాన వెంకటరత్నం
డి) గంగాభవానీ
- View Answer
- సమాధానం: ఎ
31. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మొదటి చైర్మన్?
ఎ) కె. పున్నయ్య
బి) ఎం.నాగార్జున
సి) కె. పుట్టుస్వామి
డి) మందకృష్ణ
- View Answer
- సమాధానం: ఎ
32.కిందివాటిలో సరైంది?
ఎ) రాష్ర్ట బీసీ కమిషన్ మొదటి చైర్మన్ - కె. పుట్టుస్వామి
బి) రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ మొదటి చైర్మన్ - కె. పున్నయ్య
సి) రాష్ర్ట మానవహక్కుల కమిషన్ మొదటి చైర్మన్ - జస్టిస్ సుభాషణ్ రెడ్డి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
33. కిందివాటిలో సరికానిది?
ఎ) రాష్ర్ట మానవహక్కుల కమిషన్ 2005లో ఏర్పాటైంది
బి) రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ 1994లో ఏర్పాటైంది
సి) రాష్ర్ట బీసీ కమిషన్ 1994లోఏర్పాటైంది
డి) రాష్ర్ట మహిళా కమిషన్ 1993లో ఏర్పాటైంది
- View Answer
- సమాధానం: డి
34. జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది?
ఎ) 1986
బి) 1987
సి) 1988
డి) 1989
- View Answer
- సమాధానం: సి
35. జాతీయ స్థాయిలో స్త్రీ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఎప్పుడు గుర్తించారు?
ఎ) 1953
బి) 1985
సి) 1992
డి) 1998
- View Answer
- సమాధానం: బి
36. ప్రణాళిక సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 31-12-2014
బి) 1-1-2015
సి) 15-8-2015
డి) 26-1-2015
- View Answer
- సమాధానం: బి
37. ప్రణాళిక సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 31-12-2014
బి) 1-1-2015
సి) 15-8-2015
డి) 26-1-2015
- View Answer
- సమాధానం: డి
38. ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు?
ఎ) అరవింద్ పనగరియా
బి) అరుణ్‌జైట్లీ
సి) నరేంద్రమోదీ
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
39. ప్రాంతీయ మండళ్లకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) రాష్ర్టపతి
బి) ప్రధానమంత్రి
సి) సీనియర్ మంత్రి
డి) కేంద్ర హోంమంత్రి
- View Answer
- సమాధానం: డి
40. ఈశాన్య మండల ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) అగర్తల
బి) గువాహటి
సి) షిల్లాంగ్
డి) కోహిమా
- View Answer
- సమాధానం: సి
41. ఏ కమిటీ సిఫారసు మేరకు ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేశారు?
ఎ) రాష్ట్రాల పునర్విభజన కమిటీ
బి) సర్కారియా కమిటీ
సి) రాజమన్నార్ కమిటీ
డి) రంగరాజన్ కమిటీ
- View Answer
- సమాధానం: ఎ
42.ఏ ప్రధాని కాలంలో అంతర్రాష్ర్ట మండలి ఏర్పాటైంది?
ఎ) రాజీవ్‌గాంధీ
బి) చంద్రశేఖర్
సి) విశ్వనాథ్ ప్రతాప్ సింగ్
డి) పి.వి.నరసింహారావు
- View Answer
- సమాధానం: సి
43. ఆర్టికల్ 263 ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఎవరు ఏర్పాటు చేయాలి?
ఎ) పార్లమెంట్
బి) రాష్ర్టపతి
సి) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
డి) ప్రధానమంత్రి
- View Answer
- సమాధానం: బి
44. జాతీయ సమైక్యతా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1952
బి) 1961
సి) 1971
డి) 1985
- View Answer
- సమాధానం: బి
45.మానవ హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ) జనవరి 3
బి) డిసెంబర్ 10
సి) అక్టోబర్ 2
డి) జనవరి 26
- View Answer
- సమాధానం: బి
46.ప్రాంతీయ మండళ్లను బలోపేతం చేయాలని సిఫారసు చేసిన కమిటీ?
ఎ) సర్కారియా కమిటీ
బి) రాజమన్నార్ కమిటీ
సి) పరిపాలన సంస్కరణల సంఘం
డి) సంతానం కమిటీ
- View Answer
- సమాధానం: ఎ
47. 1998లో వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా మండలి మొదటి అధ్యక్షుడు?
ఎ) శివ శంకర్ మీనన్
బి) బ్రిజేష్ మిశ్రా
సి) దుగ్గల్
డి) మణిశంకర్ అయ్యర్
- View Answer
- సమాధానం: బి
48. ప్రణాళిక సంఘం ఏర్పాటు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎవరు వ్యాఖ్యానించారు?
ఎ) జయప్రకాశ్ నారాయణ్
బి) గోపాలస్వామి అయ్యంగార్
సి) కృష్ణస్వామి అయ్యర్
డి) కె. సంతానం
- View Answer
- సమాధానం: డి
49. ఆర్టికల్ 243(1) ప్రకారం 1994లో గవర్నర్ ఏర్పాటు చేసిన ఆర్థిక సంఘం మొదటి అధ్యక్షుడు?
ఎ) ప్రొఫెసర్ లక్ష్మణస్వామి
బి) కాశీపాండ్యన్
సి) కె.సి. నియోగి
డి) ప్రొఫెసర్ ఎన్. సత్యనారాయణరావు
- View Answer
- సమాధానం: ఎ
50.తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషనర్?
ఎ) రమాకాంత్‌రెడ్డి
బి) జనార్దన్‌రెడ్డి
సి) సుభాషణ్ రెడ్డి
డి) నాగిరెడ్డి
- View Answer
- సమాధానం: డి