పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కింది వాటిలో కారణం కానిది ఏది?
1. పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కింది వాటిలో కారణం కానిది ఏది?
1) లాభదాయక పదవుల్లో ఉండటం
2) విదేశాలకు విధేయత చూపడం
3) ద్వంద్వ సభ్యత్వం
4) పన్ను బకాయిపడటం
- View Answer
- సమాధానం: 4
2. కింది వాటిలో లోక్‌సభ స్థానాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
1) 31వ సవరణ
2) 42వ సవరణ
3) 84వ సవరణ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
3. రాజ్యసభలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
1) మల్లికార్జున ఖర్గే
2) వెంకయ్యనాయుడు
3) జైరాం రమేష్
4) గులాంనబీ ఆజాద్
- View Answer
- సమాధానం: 4
4. జిల్లా ప్రణాళికా కమిటీ అనేది ఒక..?
1) రాజ్యాంగపరమైన సంస్థ
2) చట్టపరమైన సంస్థ
3) రాజ్యాంగేతర సంస్థ
4) సలహా సంస్థ
- View Answer
- సమాధానం: 1
5. కింది వాటిలో జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను సూచించింది ఏది?
1) బి.పి.ఆర్. విఠల్ కమిటీ
2) జలగం వెంగళరావ్ కమిటీ
3) డి.కె. సమరసింహారెడ్డి కమిటీ
4) హనుమంతరావు కమిటీ
- View Answer
- సమాధానం: 2
6. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
1) 2002
2) 1996
3) 2004
4) 2006
- View Answer
- సమాధానం: 4
7. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కంపల్సరీ ఓటింగ్’ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏది?
1) గుజరాత్
2) ఆంధ్రప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం:1
8. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడం, జిల్లా పరిషత్‌కు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించడం, బ్యూరోక్రసి పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ ఏది?
1) దంత్వాలా కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) సి.హెచ్. హనుమంతరావు కమిటీ
4) జి.వి.కె. రావ్ కమిటీ
- View Answer
- సమాధానం: 4
9. ‘స్థానిక సంస్థలు అనేవి విఫలమైన భగవంతుడు కాదు’ అని పేర్కొన్న కమిటీ ఏది?
1) అశోక్ మెహతా కమిటీ
2) జి.వి.కె. రావ్ కమిటీ
3) ఎల్.ఎం. సింగ్వి కమిటీ
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 1
10.ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా 21(ఎ) నిబంధనలో చేర్చారు?
1) 86వ రాజ్యాంగ సవరణ, 2000
2) 85వ రాజ్యాంగ సవరణ, 2002
3) 86వ రాజ్యాంగ సవరణ, 2002
4) 86వ రాజ్యాంగ సవరణ, 2010
- View Answer
- సమాధానం: 3
11. కింది వాటిలో పంచాయతీ విధి కానిది?
1) పారిశుధ్యం
2) శ్మశానాల నిర్వహణ
3) విద్యుచ్ఛక్తి
4) పర్యావరణ పరిరక్షణ
- View Answer
- సమాధానం:3
12. కింది వారిలో ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు?
1) సర్పంచ్
2) ఉప సర్పంచ్
3) మండల ఉపాధ్యక్షుడు
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 1
13. ప్రధానమంత్రులు - వారి నినాదాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) బికారీ హఠావో - రాజీవ్‌గాంధీ
2) గరీబీ హఠావో - ఇందిరాగాంధీ
3) జై విజ్ఞాన్ - అటల్ బిహారీ వాజ్పాయ్
4) బోండ్సీ బచావో - చంద్రశేఖర్
- View Answer
- సమాధానం: 4
14.గవర్నర్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) పదవీ భద్రత లేదు
2) అభిశంసన చేయడానికి వీలు లేదు
3) మంత్రిమండలి సలహాను పాటించాలి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
15. డీ ఫాక్టో, డీ జ్యూర్ అధిపతులు అనే భావన ఎందులో ఉంటుంది?
1) పార్లమెంటరీ వ్యవస్థ
2) అధ్యక్ష వ్యవస్థ
3) సమాఖ్య వ్యవస్థ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
16. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఏ విషయంలో పోలికలున్నాయి?
1) తొలగింపు
2) రాజీనామా
3) స్వతంత్ర ప్రతిపత్తి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
17.కింది వాటిలో భారతదేశంలో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న అంశం ఏది?
1) అఖిల భారత సర్వీసులు
2) పంచాయతీరాజ్ వ్యవస్థ
3) రక్షిత వివక్ష
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
18. జతపరచండి.
1) i-ఎ, ii-బి, iii-సి, iv-డి జాబితా-1 జాబితా-2 i) 1960 ఎ) బెరూబారి కేసు ii) 1973 బి) కేశవానంద భారతి కేసు iii) 1975 సి) ఇందిరాగాంధీ - రాజ్‌నారాయణ కేసు iv) 1980 డి) మినర్వామిల్స్ కేసు
2) i-బి, ii-ఎ, iii-డి, iv-సి
3) i-సి, ii-ఎ, iii-డి, iv-బి
4) i-ఎ, ii-బి, iii-డి, iv-సి
- View Answer
- సమాధానం: 1
19. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైందా, కాదా అని విచారించడానికి అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం (రిట్) ఏది?
1) హెబీయస్ కార్పస్
2) సెర్షియోరరీ
3) మాండమస్
4) కోవారెంటో
- View Answer
- సమాధానం: 1
20. కింది వాటిలో పంచాయతీ వ్యవస్థ ఉద్దేశం కానిది ఏది?
1) ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
2) భాగస్వామ్య ప్రజాస్వామ్యం
3) స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడటం
4) సామాజిక న్యాయాన్ని అందించడం
- View Answer
- సమాధానం: 4
21. గ్రామ సభకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) నిర్ణీత కోరం ఉండదు
2) సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి
3) గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
22. న్యాయ సమీక్షాధికారం ఎవరికి ఉంది?
1) సుప్రీంకోర్టు
2) హైకోర్టు
3) రాష్ట్రపతి
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
23. అత్యంత ముఖ్యమైన కేబినెట్ కమిటీ ఏది?
1) రాజకీయ వ్యవహారాల కమిటీ
2) నియామకాల కమిటీ
3) ఆర్థిక కమిటీ
4) పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ
- View Answer
- సమాధానం: 1
24. మంత్రులకు పోర్ట్ ఫోలియోను కేటాయించేది ఎవరు?
1) ముఖ్యమంత్రి
2) గవర్నర్
3) ముఖ్య కార్యదర్శి
4) పైవారెవరూ కాదు
- View Answer
- సమాధానం: 1
25. రాష్ట్రంలో పరిపాలనా యూనిట్ ఏది?
1) జిల్లా
2) రెవెన్యూ డివిజన్
3) మండలం
4) రెవెన్యూ గ్రామం
- View Answer
- సమాధానం: 1
26. రాజ్యాంగ ప్రకరణలు - వివరించే అంశాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) ప్రకరణ 168 - రాష్ట్ర శాసనసభ
2) ప్రకరణ 201-గవర్నర్ ఆర్థిక అధికారాలు
3) ప్రకరణ 163 - రాష్ట్ర మంత్రిమండలి
4) ప్రకరణ 166 - పరిపాలనా ఆదేశాలు
- View Answer
- సమాధానం: 2
27.న్యాయ సమీక్షాధికారం గురించి ప్రత్యక్షంగా ఎన్నో నిబంధనలో పేర్కొన్నారు?
1) 12
2) 13
3) 14
4) 15
- View Answer
- సమాధానం: 2
28. లోక్‌సభ రద్దు అయితే బిల్లులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
1) లోక్‌సభ పరిగణనలో ఉన్న బిల్లులు రద్దవుతాయి
2) లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభ పరిగణనలో ఉన్న బిల్లులు రద్దవుతాయి
3) రాజ్యసభ పరిగణనలో ఉండి, లోక్‌సభ ఆమోదానికి రాక బిల్లులు రద్దు కావు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
29. పార్లమెంట్ సార్వభౌమాధికార సంస్థ కాదు. కారణం ఏమిటి?
1) లిఖిత రాజ్యాంగం
2) సమాఖ్య వ్యవస్థ
3) న్యాయ సమీక్షాధికారం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30.నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే విషయంలో అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది?
1) రాష్ట్రపతి
2) రాజ్యసభ
3) పార్లమెంట్
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 3
31.కింది వాటిలో భిన్నమైంది ఏది?
1) అవిశ్వాస తీర్మానం
2) విశ్వాస తీర్మానం
3) వాయిదా తీర్మానం
4) అభిశంసన తీర్మానం
- View Answer
- సమాధానం: 4
32. కింది వాటిలో భారతదేశం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి ఏది?
1) సావధాన తీర్మానం
2) జీరో అవర్
3) పాయింట్ ఆఫ్ ఆర్డర్
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
33. సాధారణంగా ప్రాథమిక హక్కులన్నీ స్వయంగా అమల్లోకి వస్తాయి. కానీ కొన్ని నిబంధనల్లో ప్రస్తావించిన హక్కుల అమలు కోసం పార్లమెంట్ ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది. కింది వాటిలో అలాంటి నిబంధన ఏది?
ఎ. 17
బి. 21
సి. 23
డి. 24
1) ఎ మాత్రమే
2) ఎ, సి, డి
3) సి, డి మాత్రమే
4) ఎ, సి, డి
- View Answer
- సమాధానం: 4
34. ఆర్థిక ప్రజాస్వామ్యం దేని/ వేటి ద్వారా సాధ్యమవుతుంది?
1) ప్రాథమిక హక్కులు
2) ప్రాథమిక విధులు
3) రాజ్యాంగ పీఠిక
4) ఆదేశిక సూత్రాలు
- View Answer
- సమాధానం: 4
35. కింది వారిలో మైనారిటీ వర్గం పరిధిలోకి రానిది ఎవరు?
1) పార్శీలు
2) బౌద్ధులు
3) జైనులు
4) పై ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 4
36.లోక్‌సభలో ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అతడిని మాట్లాడవద్దని చెప్పి, మరో సభ్యుడిని మాట్లాడాల్సిందిగా ఆదేశించడాన్ని ఏమంటారు?
1) క్రాసింగ్ ది ఫోర్
2) ఈల్డింగ్ ద ఫోర్
3) ఇంటర్ఫెలేషన్
4) మిడిలింగ్ విత్
- View Answer
- సమాధానం: 2
37. కింద పేర్కొన్న ఏ బిల్లులను బడ్జెట్‌తో కలిపి లోక్‌సభలో ప్రవేశపెడతారు?
1) ఆర్థిక బిల్లు, ఆగంతుక బిల్లు
2) ద్రవ్య బిల్లు
3) ఆర్థిక బిల్లు, అనుమతి ఉపక్రమణ బిల్లు
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 3
38. ఆదివాసీలకు ‘గిరిజనులు’ అనే పేరు సూచించింది ఎవరు?
1) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
2) మహాత్మా గాంధీ
3) బాబూ జగ్జీవన్‌రామ్
4) మహాత్మా జ్యోతిబా పూలే
- View Answer
- సమాధానం: 1
39. సభా కార్యక్రమాలు నియమ, నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో, లేదో తెలుసుకోవడానికి ఉద్దేశించిన పద్ధతి ఏది?
1) సావధాన తీర్మానం
2) ఫిలబస్టర్
3) పాయింట్ ఆఫ్ ఆర్డర్
4) బాయ్‌కాట్
- View Answer
- సమాధానం: 3
40. రాజభరణాలను రద్దు చేసిన రాజ్యాంగ సవరణ ఏది?
1) 26వ సవరణ
2) 25వ సవరణ
3) 32వ సవరణ
4) 38వ సవరణ
- View Answer
- సమాధానం: 1
41. కాంగ్రెస్ పార్టీ ఎన్నో లోక్‌సభలో అధిక సీట్లు సాధించింది?
1) 5
2) 6
3) 8
4) 7
- View Answer
- సమాధానం: 3
42. కింది వాటిలో సరైంది ఏది?
1) ఎస్సీలకు ఉప ప్రణాళిక - 1999
2) ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం - 1989
3) ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల వర్తింపు - 1951
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
43. కింది వాటిలో సరికానిది ఏది?
1) మొదటి లా కమిషన్ అధ్యక్షుడు - లార్డ్ మెకాలే
2) మొదటి లా కమిషన్ అధ్యక్షుడు (స్వాతంత్య్రానంతరం) - ఎం.సి. సెతల్వాద్
3) 21వ లా కమిషన్ అధ్యక్షుడు - జస్టిస్ బల్బీర్‌సింగ్ చౌహాన్
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 4
44. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) దీన్ని 1953లో ఏర్పాటు చేశారు
2) మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఇది అటానమస్ సంస్థ
3) దీనికి మొట్టమొదటి అధ్యక్షురాలు దుర్గాబాయ్ దేశ్‌ముఖ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
45. సిటిజన్ చార్టర్ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1997
2) 1999
3) 2001
4) 2004
- View Answer
- సమాధానం: 1
46. మహిళా సాధికారతకు సంబంధించి జాతీయ విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 2001
2) 2004
3) 2006
4) 2005
- View Answer
- సమాధానం: 3
47. కింది వాటిలో రెగ్యులేటరీ సంస్థ కానిది?
1) సెబీ
2) ఐఆర్డీఏ
3) ట్రాయ్
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 4
48. బడ్జెట్ తయారీలో భాగస్వామ్యం కలిగి ఉన్నవారు/ ఉన్నది?
1) నీతి ఆయోగ్
2) వివిధ శాఖామాత్యులు
3) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
4) 1, 2, 3
- View Answer
- సమాధానం: 4
49. సామాజిక న్యాయ సాధనకు న్యాయపరమైన మార్గం ఏది?
1) ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం
2) ట్రైబ్యునళ్లు
3) లోక్ అదాలత్‌లు
4) వినియోగదారుల కోర్టులు
- View Answer
- సమాధానం: 1
50.పౌర సమాజంలో అంతర్భాగం కానిది?
1) స్వచ్ఛంద సంస్థలు
2) కుల సంఘాలు
3) శాసనసభ
4) కుటుంబం
- View Answer
- సమాధానం: 3