కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నికకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ప్రొవిన్షియల్ అసెంబ్లీలు ఎన్నుకుంటాయి
2) ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు
3) ప్రభుత్వం నామినేట్ చేస్తుంది
4) గవర్నర్ నియమిస్తాడు
- View Answer
- సమాధానం: 1
2. కిందివాటిని జతపరచండి.
జాబితా - I
i) విద్యకు బడ్జెట్ నిధులు కేటాయింపు
ii) మొదటి ‘లా’ కమిషన్ నియామకం
iii) వైస్రాయ్ పదవి ఏర్పాటు
iv) హైకోర్టుల ఏర్పాటు
జాబితా - II
a) 1833 చార్టర్ చట్టం
b) 1813 చార్టర్ చట్టం
c) 1861 కౌన్సిల్స్ చట్టం
d) 1818 విక్టోరియా మహారాణి ప్రకటన
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 1
3. కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) కేబినెట్ మిషన్ తర్వాత
2) క్రిప్స్ మిషన్ తర్వాత
3) మౌంట్ బాటెన్ ప్రణాళిక తర్వాత
4) క్రిప్స్ మిషన్ ముందు
- View Answer
- సమాధానం: 1
4. జతపరచండి.
జాబితా - I
i) రాజ్యసభలో సీట్ల కేటాయింపు
ii) కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన
iii) పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
iv) అధికార భాషలు
జాబితా - II
a) నాలుగో షెడ్యూల్
b) ఏడో షెడ్యూల్
c) ఎనిమిదో షెడ్యూల్
d) పదో షెడ్యూల్
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-a, ii-b, iii-d, iv-c
4) i-b, ii-a, iii-d, iv-c
- View Answer
- సమాధానం: 3
5. జతపరచండి.
జాబితా - I
i) పరిపాలన ట్రైబ్యునల్స్
ii) వెనకబడిన వర్గాల సంక్షేమం
iii) రాష్ట్రపతి అత్యవసర అధికారాలు
iv) కేంద్ర ఎన్నికల సంఘం
జాబితా - II
a) 15వ భాగం
b) 16వ భాగం
c) 14(ఎ)వ భాగం
d) 18వ భాగం
1) i-b, ii-a, iii-c, iv-d
2) i-c, ii-b, iii-d, iv-a
3) i-c, ii-a, iii-d, iv-b
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 2
6. జత పరచండి.
జాబితా - I
i) రాజ్యాంగ సవరణ విధానం
ii) తాత్కాలిక స్పీకర్
iii) సామ్యవాదం
iv) అటార్నీ జనరల్
జాబితా - II
a) ఫ్రాన్స
b) దక్షిణాఫ్రికా
c) రష్యా
d) బ్రిటన్
1) i-b, ii-d, iii-a, iv-c
2) i-c, ii-a, iii-b, iv-d
3) i-d, ii-a, iii-c, iv-b
4) i-b, ii-a, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 4
7. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) అధికరణ 326 వయోజన ఓటు హక్కు
బి) ఓటింగ్ వయో పరిమితిని 61వ సవరణ ద్వారా తగ్గించారు
సి) మొదటి మధ్యంతర ఎన్నికలు 1977లో నిర్వహించారు
డి) ఇప్పటివరకు అన్ని సాధారణ ఎన్నికల్లో 14వ లోక్‌సభ ఎన్నికల్లోనే అధిక పోలింగ్ శాతం నమోదైంది
1) డి
2) సి, డి
3) సి
4) ఎ, సి, డి
- View Answer
- సమాధానం:2
8. ఏదైనా ప్రభుత్వ అధికారిని లేదా ప్రభుత్వ సంస్థను తన విధిని సక్రమంగా నిర్వహించాలని జారీ చేసే ఆజ్ఞ ఏది?
1) హెబియస్ కార్పస్
2) మాండమస్
3) కోవారెంటో
4) సెర్షియోరరి
- View Answer
- సమాధానం: 2
9. కింది వాటిలో సమసమాజ నిర్మాణానికి, సంక్షేమ రాజ్య స్థాపనకు తోడ్పడేవి ఏవి?
1) రాజ్యంగ ప్రవేశిక
2) ఆదేశిక సూత్రాలు
3) రిజర్వేషన్లు
4) ప్రాథమిక విధులు
- View Answer
- సమాధానం: 2
10. వెంకయ్య నాయుడు ఎన్నో ఉపరాష్ట్రపతి?
1) 13
2) 14
3) 15
4) 16
- View Answer
- సమాధానం: 1
11. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) సుప్రీంకోర్టు సలహాను ఎక్కువసార్లు కోరిన రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్
బి) తాత్కాలిక రాష్ట్రపతిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారు బి.డి. జెత్రి
సి) పదవిలో కొనసాగుతూ చనిపోయిన మొదటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
డి) ఓటు బదలాయింపు ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి వి.వి. గిరి
1) ఎ, డి
2) బి, సి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 2
12. కింది ఉప ప్రధానులను వరుస క్రమంలో అమర్చండి.
ఎ) బాబు జగ్జీవన్ రామ్
బి) మొరార్జీ దేశాయ్
సి) దేవీలాల్
డి) వై.బి. చవాన్
1) ఎ, బి, సి, డి
2) డి, బి, సి, ఎ
3) బి, ఎ, డి, సి
4) బి, సి, ఎ, డి
- View Answer
- సమాధానం: 3
13. రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్యకు సంబంధించి కింది వాటిలో సరైంది?
1) ఎమ్మెల్యేల సంఖ్యలో 15% మించరాదు
2) ఎమ్మెల్సీల సంఖ్యలో 15% మించరాదు
3) కనిష్టంగా 12 మంది గరిష్టంగా ఎమ్మెల్యేల సంఖ్యలో 15%
4) ఎమ్మెల్యేల సంఖ్యలో కనిష్టంగా 10%, గరిష్టంగా 15% మించరాదు
- View Answer
- సమాధానం: 3
14. కర్ణాటక రాష్ట్రంలో హైదరాబాద్ - కర్ణాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక మండలిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు?
1) 100
2) 99
3) 98
4) 97
- View Answer
- సమాధానం: 3
15. భారత రాజకీయ వ్యవస్థను సమాఖ్యగా ఎందుకు పరిగణిస్తారు?
1) ద్వంద్వ పౌరసత్వం
2) ద్వంద్వ న్యాయ వ్యవస్థ
3) కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన
4) లిఖిత రాజ్యాంగం
- View Answer
- సమాధానం: 3
16. కింది వారిలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసే హక్కు ఉండి, రాష్ట్రపతి ఎన్నికలో లేని వారెవరు?
1) ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యులు కాని మంత్రులు
2) రాష్ట్ర ఎగువ సభలకు ఎన్నికైన సభ్యులు
3) పార్లమెంట్‌లోని నామినేటెడ్ సభ్యులు
4) రాజ్యసభ సభ్యులు
- View Answer
- సమాధానం: 3
17. కింది వాటిలో ఎన్నికల సంస్కరణల్లో భాగం కానిది ఏది?
1) నేరస్తులను అనర్హులుగా ప్రకటించడం
2) రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్
3) ఎన్నికల కమిషనర్లను నియమించడం
4) నోటా బటన్‌ను ప్రవేశపెట్టడం
- View Answer
- సమాధానం: 2
18. జమ్మూ - కశ్మీర్‌కు రాజ్యాంగ పరంగా లభించిన ప్రత్యేక హోదా ఏమిటి?
1) ఇది దేశంలో భాగం కాదు
2) భారతీయ చట్టాలు వర్తించవు
3) ప్రత్యేక రాజ్యాంగం ఉంది
4) భారత రాజ్యాంగం పరిధిలోకి రాదు
- View Answer
- సమాధానం: 3
19.కింది ఏ సందర్భాల్లో ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడిని పార్టీ ఫిరాయింపు కింద అనర్హుడిగా ప్రకటించవచ్చు?
ఎ) ఎన్నికైన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు
బి) పార్టీ విప్‌ను జారీ చేసినప్పటికీ ముందస్తుగా అనుమతి లేకుండా ఓటు వేయకపోయినా, వ్యతిరేకంగా ఓటు వేసినా
సి) పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు
డి) ఎన్నికైన పార్టీ నుంచి వేరొక పార్టీలో చేరినప్పుడు
1) ఎ, బి, సి
2) ఎ, బి, డి
3) ఎ, సి, డి
4) బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
20. కింది వాటిలో పార్లమెంట్‌కు చెందిన ఆర్థిక కమిటీలు ఏవి?
ఎ) ప్రభుత్వ ఖాతాల సంఘం
బి) ప్రభుత్వ అంచనాల సంఘం
సి) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం (పబ్లిక్ అండర్ టేకింగ్)
1) ఎ, బి
2) బి, సి
3) సి, ఎ
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
21. కింది వాటిలో రాష్ట్ర జాబితాలో లేనిది ఏది?
1) బీమా
2) చేపలు
3) వ్యవసాయం
4) జూదం
- View Answer
- సమాధానం: 1
22. కేంద్ర - రాష్ట్ర సంబంధాల్లో ఏ అంశాన్ని మున్సిపల్ సంబంధాలుగా పేర్కొంటారు?
1) రాష్ట్ర పరిపాలన రంగంలో కేంద్ర నియంత్రణ
2) రాష్ట్ర ఆర్థిక విషయంలో కేంద్రం నియంత్రణ
3) రాష్ట్ర ప్రణాళిక ప్రక్రియలో కేంద్ర నియంత్రణ
4) రాష్ట్ర శాసన సంబంధమైన విషయాల్లో కేంద్ర నియంత్రణ
- View Answer
- సమాధానం: 1
23. జతపరచండి.
i) నంబుద్రిపాల్
ii) అన్నాదొరై
iii) ఎన్డీ తివారి
iv) వి.సి.అలెగ్జాండర్
a) రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు
b) కాంగ్రెసేతర మొదటి ముఖ్యమంత్రి
c) ప్రాంతీయ పార్టీకి చెందిన మొదటి ముఖ్యమంత్రి
d) గవర్నర్‌గా ఎక్కువగా కాలం పనిచేసిన వారు
1) i-b, ii-c, iii-a, iv-d
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-b, ii-c, iii-d, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 1
24. సుప్రీంకోర్టు సలహా పరిధికి సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఏ అంశంపైనైనా సలహా పంపితే తప్పనిసరిగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి
బి) సుప్రీంకోర్టుకు పంపిన సలహా అంశంపై కోర్టు చర్చించి సలహా ఇస్తుంది
సి) సుప్రీంకోర్టు సలహా పరిధిలోని అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు
డి) సుప్రీంకోర్టు సలహాకు ఒక్కసారి ఒక అంశం కంటే ఎక్కువ పంపరాదు
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, సి
4) బి, డి
- View Answer
- సమాధానం: 3
25. అధికరణ 156 ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం 5 ఏళ్లు. ఈ సందర్భంలో సరైంది?
ఎ) పదవీ కాలం పూర్తయ్యే వరకు ఏ గవర్నర్‌నూ తన పదవి నుంచి తొలగించడానికి వీలు కాదు
బి) 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఏ గవర్నర్ తన పదవిలో కొనసాగలేడు
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
26. ప్రత్యేక హైకోర్టు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
1) చండీగఢ్
2) అండమాన్ నికోబార్ దీవులు
3) లక్షద్వీప్
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
27. కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి సూచనలను చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కమిటీ ఏది?
1) రెండో పరిపాలన సంస్కరణల సంఘం
2) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ
3) రంజిత్ సింగ్ సర్కారియా కమిటీ
4) మదన్మోహన్ పూంచీ కమిటీ
- View Answer
- సమాధానం: 4
28. జతపరచండి.
జాబితా - I
i) రాష్ట్రపతి
ii) సుప్రీంకోర్టు న్యాయమూర్తి
iii) పార్లమెంట్ సభ్యులు
iv) కేంద్ర మంత్రి
జాబితా - II
a) సమాచారాన్ని రహస్యంగా ఉంచడం
b) విశ్వాసంగా విధులను నిర్వహించడం
c) రాజ్యాంగంపై నమ్మకం కలిగి ఉండి దానికి బద్ధుడై ఉండటం
d) రాజ్యాంగాన్ని పరిరక్షించడం
1) i-d, ii-b, iii-a, iv-c
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-c, ii-d, iii-a, iv-c
- View Answer
- సమాధానం: 2
29. ప్రజా ప్రయోజన వ్యాజ్య భావన(పిల్) ఏ దేశంలో ఆవిర్భవించింది?
1) భారత్
2) అమెరికా
3) బ్రిటన్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
30. అటార్నీ జనరల్‌కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) రాష్ట్రపతి నియమిస్తాడు
బి) సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండే అర్హతలు ఉండాలి
సి) పార్లమెంట్లో సభ్యత్వం తప్పనిసరిగా కలిగి ఉండాలి
డి) మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, సి, డి
4) సి, డి
- View Answer
- సమాధానం:1
31. సభలో మాట్లాడే వ్యక్తిని ఆపి మరో సభ్యుడ్ని మాట్లాడాలని స్పీకర్ సూచించడాన్ని ఏమంటారు?
1) క్రాస్ ద ఫ్లోర్
2) డెకోరం
3) ఈల్డింగ్ ద ఫ్లోర్
4) ఇంటర్పిల్లెషన్
- View Answer
- సమాధానం: 3
32. కింది వాటిలో పార్లమెంట్ ఉభయ సభలతో విడిగా ప్రత్యేక మెజార్టీతో ఆమోదం పొందాల్సిన బిల్లు ఏది?
1) సాధారణ బిల్లు
2) ద్రవ్య బిల్లు
3) ఆర్థిక బిల్లు
4) రాజ్యాంగ సవరణ బిల్లు
- View Answer
- సమాధానం: 4
33. కింది వాటిలో పంచాయతీల కాల పరిమితిని 4 సంవత్సరాలుగా సిఫారసు చేసిన కమిటీ?
1) బల్వంత్రాయ్ కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
34. కింది వాటిలో ఏ నివేదికను పరిశీలించే అధికారం పార్లమెంట్‌కు లేదు?
1) ఎన్నికల సంఘం
2) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
3) ఆర్థిక సంఘం
4) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
- View Answer
- సమాధానం: 2