ఎన్నికలు, ఎన్నికల యంత్రాంగం, కేంద్ర ఎన్నికల సంఘం-రాజకీయ పార్టీలు
1. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు?
ఎ) ప్రధానమంత్రి
బి) పార్లమెంటు
సి) కేంద్ర హోం మంత్రి
డి) రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: డి
2. భారతదేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు?
ఎ) 194950
బి) 195051
సి) 195152
డి) 195657
- View Answer
- సమాధానం: సి
3. ‘పార్లమెంటు ఎన్నికలకు నిధులను ప్రభుత్వమే సమకూర్చాలి’ అని సిఫారసు చేసిన కమిటీ ఏది?
ఎ) దినేష్ గోస్వామి కమిటీ
బి) వెంకటాచలయ్య కమిటీ
సి) కె.సి. నియోగి కమిటీ
డి) ప్రధాన ఎన్నికల కమిషన్
- View Answer
- సమాధానం: ఎ
4. కింది వాటిలో కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న అంశాలేవి?
1) ప్రధానమంత్రి ఎన్నిక
2) రాజకీయ పార్టీల గుర్తింపు
3) రాష్ట్రపతి ఎన్నిక
4) రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాల కేటాయింపు
ఎ) 1, 2, 3, 4
బి) 2, 3
సి) 3, 4
డి) 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
5. ఎన్నో సాధారణ ఎన్నికల్లో మొదటిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు?
ఎ) 3
బి) 8
సి) 6
డి) 10
- View Answer
- సమాధానం: సి
6. ఉన్నత స్థాయి అవినీతి కేసులకు సంబంధించిన విచారణ జరపడానికి కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏది?
ఎ) అవినీతి నిరోధక శాఖ
బి) లోక్‌పాల్
సి) కేంద్ర నేర పరిశోధన శాఖ
డి) కేంద్ర నిఘా సంఘం
- View Answer
- సమాధానం: బి
7. ఏకసభ్య ఎన్నికల కమిషన్‌ను ఏ సంవత్సరంలో ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌గా పునర్నిర్మించారు?
ఎ) 1990
బి) 1993
సి) 1994
డి) 1995
- View Answer
- సమాధానం: బి
8. భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని సాధారణ ఎన్నికలు జరిగాయి?
ఎ) 12
బి) 13
సి) 14
డి) 16
- View Answer
- సమాధానం: డి
9. కింది వాటిలో భారత ఎన్నికల సంఘం విధులు ఏవి?
1) ఎన్నికల పర్యవేక్షణ, నిర్దేశం, స్వేచ్ఛగా, న్యాయంగా నిర్వహించడం
2) పార్లమెంటు, రాష్ట్ర శాసన వ్యవస్థలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికల జాబితాలను తయారుచేయించడం
3) రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడం, ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు, వ్యక్తులకు ఎన్నికల చిహ్నాలను కేటాయించడం
4) ఎన్నికల వివాదాల్లో తుది తీర్పు ప్రకటించడం
ఎ) 1, 2, 3
బి) 2, 3, 4
సి) 1, 3
డి) 1, 2, 4
- View Answer
- సమాధానం: ఎ
10. రాజ్యాంగంలోని ఎన్నో ప్రకరణలో ఎలాంటి వివక్ష లేకుండా వయోజనులందరినీ ఓటరుగా గుర్తించారు?
ఎ) 324
బి) 325
సి) 360
డి) 352
- View Answer
- సమాధానం: బి
11.ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయోపరిమితిని 18 సంవత్సరాలకు తగ్గించారు?
ఎ) 73వ సవరణ
బి) 24వ సవరణ
సి) 61వ సవరణ
డి) 4వ సవరణ
- View Answer
- సమాధానం: సి
12.కింద పేర్కొన్నవారిలో ఎవరి ఎన్నికల్లో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు ఉంటాయి?
ఎ) రాజ్యసభ సభ్యులు
బి) విధాన పరిషత్తు సభ్యులు
సి) ఎ, బి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
13. 1979లో ఏ రాష్ట్రం మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని రూపొందించింది?
ఎ) పశ్చిమ బెంగాల్
బి) ఆంధ్రప్రదేశ్
సి) ఉత్తరప్రదేశ్
డి) కేరళ
- View Answer
- సమాధానం: ఎ
14. ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఏమిటి?
ఎ) రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారడం
బి) శాసన సభలో అధికార పక్షానికి మద్దతు తెలపడం
సి) రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీలోకి మారడం
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
15. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతపై అంతిమ అధికారం ఎవరిది?
ఎ) సభాధ్యక్షులు
బి) రాష్ట్రపతి
సి) సుప్రీంకోర్టు
డి) కేంద్ర ఎన్నికల సంఘం
- View Answer
- సమాధానం: ఎ
16. కింది వాటిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
ఎ) 52వ సవరణ
బి) 91వ సవరణ
సి) ఎ, బి
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
17. ‘పార్టీ మారాలనే ఉద్దేశంతో గుర్తింపదగిన ప్రయత్నాలు చేస్తే, అవి పార్టీ ఫిరాయింపుల కిందకి వస్తాయి, అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
ఎ) తమిళనాడు శాసనసభ
బి) కర్ణాటక శాసన సభ
సి) ఆంధ్రప్రదేశ్ శాసన సభ
డి) కేరళ శాసనసభ
- View Answer
- సమాధానం: బి
18. కింది వాటిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపం ఏది?
ఎ) చీలిక, కలయిక అనే పదాలకు సరైన నిర్వచనం లేదు
బి) సభాధ్యక్షులు నిర్ణీత సమయంలోనే తమ తీర్పును వెలువరించాలి అనే పరిమితి లేదు
సి) ఎ, బి
డి) పైన పేర్కొన్నవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
19. కింది వాటిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ప్రయోజనం ఏది?
ఎ) రాజకీయ సుస్థిరత
బి) అవకాశవాద రాజకీయాలను అరికట్టడం
సి) సభ్యుల అనైతిక ప్రవర్తనను నిరోధించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
20. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) అవిశ్వాస, విశ్వాస తీర్మాన సమయంలోనే పార్టీ విప్ జారీ చేయాలి - దినేష్ గోస్వామి కమిటీ నివేదిక
బి) ఎన్నికల ముందు ఏర్పడే రాజకీయ కూటములను కూడా రాజకీయ పార్టీలుగానే పరిగణించాలి - లా కమిషన్ నివేదిక
సి) ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ఓటు వేసినప్పుడే దాన్ని చెల్లని ఓటుగా పరిగణించాలి - రాజ్యాంగ సమీక్షా కమిషన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
21. కింది వాటిలో రాజకీయ పార్టీల విధి కానిది ఏది?
ఎ) ప్రజాభిప్రాయాన్ని సమీకరించడం
బి) ఎన్నికల్లో పోటీ చేయడం
సి) ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడం
డి) ప్రభుత్వ అధికారులను నియంత్రించడం
- View Answer
- సమాధానం: డి
22. రాజకీయ పార్టీలు అనేవి..?
ఎ) రాజ్యాంగేతరమైనవి
బి) చట్టేతరమైనవి
సి) చట్టేతర, రాజ్యాంగేతరమైనవి
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
23.కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) 1955 అవడి కాంగ్రెస్ సమావేశం - సామ్యవాద తరహా సమాజ స్థాపన
బి) కమ్యూనిస్ట్ పార్టీలో చీలిక, సి.పి.ఎం. ఏర్పాటు - 1964
సి) 1977 ఢిల్లీ సమావేశం - జనతా పార్టీ ఏర్పాటు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: డి
24. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) కిహోటో హోలాహన్ గట జచిల్ హు (1993)- పార్టీ ఫిరాయింపు విషయంలో సభాధ్యక్షుల నిర్ణయం అంతిమం కాదు
బి) జి.విశ్వనాథన్ గట తమిళనాడు స్పీకర్ కేసు (1996) - శాసన సభ్యుడు పార్టీ నుంచి బహిష్కారానికి గురైన తర్వాత మరో రాజకీయ పార్టీలో చేరితే దాన్ని ఫిరాయింపుగా పరిగణించకూడదు
సి) రాజేందర్ సింగ్ గట స్వామి ప్రసాద్ కేసు (2007)-సభాధ్యక్షులు పార్టీ ఫిరాయింపు అనర్హత చర్యపై మితిమీరిన జాప్యం చేస్తే అది న్యాయసమీక్షకు గురవుతుంది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
25. కింది వాటిలో సరైన వ్యాఖ్యానం ఏది?
ఎ) ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 - ఓటర్లు, అర్హతలు, నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ, పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలో సీట్ల కేటాయింపుల గురించి పేర్కొంటుంది
బి) ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 - ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, పర్యవేక్షణ, రాజకీయ పార్టీల గుర్తింపు తదితర అంశాల గురించి పేర్కొంటుంది
సి) ఎ, బి
డి) పైన పేర్కొన్న రెండూ సరికావు
- View Answer
- సమాధానం: సి
26. కింద పేర్కొన్న ఏ రాజకీయ పార్టీలకు ఒకే గుర్తు ఉంది?
1) బహుజన్ సమాజ్ పార్టీ
2) అసోం గణ సంగ్రామ్ పరిషద్
3) తెలుగుదేశం పార్టీ
ఎ) 1, 2, 3
బి) 2, 3
సి) 1, 2
డి) 1, 3
- View Answer
- సమాధానం: సి
27. కింది వాటిలో అత్యంత ప్రాచీనమైన ప్రాంతీయ పార్టీ ఏది?
ఎ) ద్రవిడ మున్నేట్ర కజగం
బి) శిరోమణి అకాలీదళ్
సి) తెలుగుదేశం పార్టీ
డి) నేషనల్ కాన్ఫరెన్స్
- View Answer
- సమాధానం: బి
28. ‘అఖిల భారత పార్టీ’గా గుర్తింపు పొందాలంటే కింది వాటిలో ఏ అర్హత ఉండాలి?
ఎ) నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు పొంది ఉండాలి, కనీసం నాలుగు లోక్‌సభ స్థానాలను గెలవాలి
బి) 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి
సి) లోక్‌సభ ఎన్నికల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం లోక్‌సభ స్థానాల్లో 4 శాతం ఓట్లు సాధించాలి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
29.కమ్యూనిస్టు పార్టీ ఏ సంవత్సరంలో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో 51 స్థానాలు సాధించి ప్రతిపక్షంగా అవతరించింది?
ఎ) 1962
బి) 1967
సి) 1972
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
30. కింది వాటిలో సరైంది ఏది?
1) బహుజన సమాజ్ పార్టీ స్థాపకులు - కాన్షీరాం
2) దళిత మజ్దూర్ కిసాన్ పార్టీ స్థాపకులు - చౌదరీ చరణ్ సింగ్
3) మహారాష్ట్ర గోమంతక్ పార్టీ స్థాపకులు - దయానంద బందోర్కర్
4) మిజో నేషనల్ ఫ్రంట్ నాయకులు - లాల్ డెంగా
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2
సి) 3, 4
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
31. కేరళలో మొదటి వామపక్ష ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
ఎ) 1955
బి) 1957
సి) 1959
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
32.ఇందిరాగాంధీ ఎన్నో లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఓటమి చెందారు?
ఎ) 4
బి) 5
సి) 6
డి) 7
- View Answer
- సమాధానం: సి
33. గత పదహారు లోక్‌సభ ఎన్నికల్లో ఒకే చిహ్నంపై పోటీ చేసిన రాజకీయ పార్టీ ఏది?
ఎ) సి.పి.ఐ.
బి) కాంగ్రెస్ (ఐ)
సి) అకాలీదళ్
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
34. లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించిన ఘనత సాధించిన ప్రాంతీయ పార్టీ ఏది?
ఎ) డి.ఎం.కె.
బి) ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
సి) తెలుగుదేశం పార్టీ
డి) శివసేన
- View Answer
- సమాధానం: సి
35. ‘విశాలాంధ్ర’ పిలుపు ఇచ్చిన పార్టీ ఏది?
ఎ) కమ్యూనిస్ట్ పార్టీ
బి) కాంగ్రెస్
సి) ఎ, బి
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
36. పార్టీ రహిత ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించింది ఎవరు?
ఎ) ఎం.ఎన్. రాయ్
బి) జయప్రకాశ్ నారాయణ్
సి) గాంధీజీ
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
37. భాగస్వామ్య ప్రజాస్వామ్యం గురించి ఎవరు పేర్కొన్నారు?
ఎ) జయప్రకాశ్ నారాయణ్
బి) ఎం.ఎన్. రాయ్
సి) గాంధీజీ
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
38. కింది వాటిలో సరైన అంశం ఏది?
ఎ) 1920కి ముందు భారత్‌లో రాజకీయ పార్టీలు లేవు
బి) 1935 తర్వాతే క్రమబద్ధమైన పార్టీల వ్యవస్థ ప్రారంభమైంది
సి) 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీగా ఏర్పడలేదు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం:డి