ఆధునిక కాలంలో రాజ్యాంగ వాదం ఎన్నో శతాబ్దంలో అభివృద్ధి చెందింది?
1. ఆధునిక కాలంలో రాజ్యాంగ వాదం ఎన్నో శతాబ్దంలో అభివృద్ధి చెందింది?
ఎ) 16వ
బి) 17వ
సి) 18వ
డి) 20వ
- View Answer
- సమాధానం: సి
2. రాజ్యాంగం లక్ష్యం ఏమిటి?
ఎ) రాజ్యాధికార నియంత్రణ, వ్యక్తి స్వేచ్ఛ పరిరక్షణ
బి) వ్యక్తి హక్కుల పరిరక్షణ
సి) ప్రభుత్వ అంగాల మధ్య అధికార పంపిణీ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3. బెంగాల్ గవర్నర్ జనరల్‌ను ఏ చట్టం ద్వారా ‘భారతదేశ గవర్నర్ జనరల్’గా మార్చారు?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం
బి) 1813 చార్టర్ చట్టం
సి) 1833 చార్టర్ చట్టం
డి) 1858 విక్టోరియా మహారాణి ప్రకటన
- View Answer
- సమాధానం: సి
4. ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
బి) లార్డ్ మింటో
సి) రాంసే మెక్ డొనాల్డ్
డి) మహమ్మద్ అలీ జిన్నా
- View Answer
- సమాధానం: బి
5. కింది వాటిలో 1919 చట్టానికి సంబంధించి సరికానిది ఏది?
ఎ) కేంద్రంలో ద్విసభా విధానం ఏర్పాటు
బి) రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ఏర్పాటు
సి) రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఏర్పాటు
డి) పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు
- View Answer
- సమాధానం: సి
6. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని ‘మొదటి లిఖిత చట్టం’గా పేర్కొంటారు
బి) 1861 కౌన్సిల్ చట్టం ద్వారా తొలిసారిగా పోర్టు ఫోలియో విధానం ఏర్పాటు చేశారు
సి) 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా వైస్రాయ్ పదవి ఏర్పాటు చేశారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. భారతదేశంలో సమాఖ్య(ఫెడరల్) ప్రభుత్వ ఏర్పాటుకు మూలమైన చట్టం ఏది?
ఎ) 1909 మింటో-మార్లే సంస్కరణల చట్టం
బి) 1919 మాంటెగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) 1947 భారత స్వతంత్ర చట్టం
- View Answer
- సమాధానం: సి
8. కేబినెట్ మిషన్ ప్లాన్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) తాత్కాలిక కేబినెట్
బి) ప్రొవిన్సియల్ గ్రూపింగ్
సి) రాజ్యాంగ హక్కు గుర్తించడం
డి) ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటును అంగీకరించడం
- View Answer
- సమాధానం: డి
9.కింద పేర్కొన్నవారిలో రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేసింది ఎవరు?
ఎ) హెచ్.సి. ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి
బి) హెచ్.సి. ముఖర్జీ, కె.టి. షా
సి) గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్
డి) ఫ్రాంక్ అంటోని, టి.టి. కృష్ణమాచారి
- View Answer
- సమాధానం:ఎ
10. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టింది ఎవరు?
ఎ) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
బి) హెచ్.సి. ముఖర్జీ
సి) రాజేంద్రప్రసాద్
డి) బి.ఎన్. రావు
- View Answer
- సమాధానం: డి
11. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది?
ఎ) 1958
బి) 1860
సి) 1951
డి) 1876
- View Answer
- సమాధానం: బి
12. కింద పేర్కొన్నవారిలో రాజ్యాంగ ముసాయిదా సంఘంలో సభ్యుడు కానివారెవరు?
ఎ) అంబేడ్కర్
బి) కె.ఎం. మున్షీ
సి) బి.ఎన్. రావు
డి) మాధవరావు
- View Answer
- సమాధానం: సి
13.రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) దక్షిణాఫ్రికా
బి) కెనడా
సి) ఫ్రాన్స్
డి) ఐర్లాండ్
- View Answer
- సమాధానం: డి
14. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 24-1-1950
బి) 15-8-1947
సి) 26-1-1950
డి) 26-11-1949
- View Answer
- సమాధానం: డి
15. ‘లౌకిక తత్వం’ భారత రాజ్యాంగ మౌలిక లక్షణంగా సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది?
ఎ) ఎస్.ఆర్. బొమ్మై గట యూనియన్ ఆఫ్ ఇండియా
బి) భరత్ కుమార్ గట కేరళ రాష్ట్రం
సి) ఉన్నికృష్ణన్ గట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
డి) కేశవానంద భారతి గట కేరళ రాష్ట్రం
- View Answer
- సమాధానం: ఎ
16. ఏ కమిటీ సిఫారసుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ అనే పదాలను చేర్చారు?
ఎ) సంతానం కమిటీ
బి) రాజ్యాంగ సమీక్షా సంఘం
సి) స్వరణ్‌సింగ్ కమిటీ
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం:సి
17. రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి తెలుపుతుంది?
ఎ) 2
బి) 3
సి) 4
డి) 7
- View Answer
- సమాధానం: సి
18.ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించారు?
ఎ) 85వ సవరణ - 2000
బి) 84వ సవరణ - 2000
సి) 81వ సవరణ - 2000
డి) 79వ సవరణ - 1996
- View Answer
- సమాధానం: ఎ
19.పార్లమెంట్ రూపొందించిన ‘విద్యా హక్కు చట్టం’ సమాజంలో ఎవరికి దోహదపడుతుంది?
ఎ) కళాశాలలకు వెళ్లేవారికి
బి) సాంకేతిక విద్యలో ఉత్సాహం ఉన్న వారికి
సి) సీనియర్ సెకండరీ స్థాయి బాలికలకు
డి) 14 ఏళ్ల లోపు బాలబాలికలకు
- View Answer
- సమాధానం: డి
20. రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ ‘ద్వంద్వ శిక్ష’ను నిషేధిస్తుంది?
ఎ) 19(1)(సి)
బి) 15(4)
సి) 20(2)
డి) 21
- View Answer
- సమాధానం: సి
21. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) అధికరణ - 15(3) ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం
బి) అధికరణ - 16(2) ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలకు మినహాయింపు
సి) అధికరణ - 22 నిర్బంధించిన వ్యక్తికి రక్షణ
డి) అధికరణ - 19(బి) పత్రికా స్వేచ్ఛ
- View Answer
- సమాధానం: డి
22. మైనార్టీ వర్గాల సంరక్షణ కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది?
ఎ) పీడనాన్ని నిరోధించే హక్కు
బి) విద్య, సాంస్కృతిక హక్కు
సి) మత హక్కు
డి) సమానత్వ హక్కు
- View Answer
- సమాధానం: బి
23. ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వ సంస్థ.. పరిధిని అతిక్రమించి అధికారం చెలాయించడాన్ని నివారించడానికి జారీ చేసే ఆజ్ఞ ఏది?
ఎ) మాండమస్
బి) కోవారెంటో
సి) సెర్షియోరరీ
డి) ప్రోహిబిషన్
- View Answer
- సమాధానం: బి
24.‘జాతీయ అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి తాత్కాలికంగా రద్దుపరచవచ్చు’ అని తెలిపే అధికరణం ఏది?
ఎ) అధికరణ-352
బి) అధికరణ-359
సి) అధికరణ -32
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
25. 1976లో ఏ కమిటీ సిఫారసుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చారు?
ఎ) స్వరణ్‌సింగ్ కమిటీ
బి) వర్మ కమిటీ
సి) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
డి) రాజ్యాంగ సమీక్షా సంఘం
- View Answer
- సమాధానం: ఎ
26. కింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది?
ఎ) ఓటు హక్కు వినియోగించుకోవడం
బి) కుటీర పరిశ్రమలను అభివృద్ధి పరచడం
సి) బలహీనవర్గాలకు చేయూత ఇవ్వడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
27.కింది వాటిలో సంక్షేమ, సమసమాజ స్థాపనకు తోడ్పడేవి ఏవి?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) ప్రాథమిక విధులు
సి) రిజర్వేషన్లు
డి) ఆదేశిక సూత్రాలు
- View Answer
- సమాధానం: డి
28. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కింది వాటిలో వేటిని 1935 చట్టం ద్వారా వెలువడిన "Instrument of Instructions" తో పోల్చారు?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) ప్రాథమిక విధులు
సి) ఆదేశిక సూత్రాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
29.కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) ఆర్టికల్ - 47: మద్యపాన నిషేధం
బి) ఆర్టికల్ - 50: కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం
సి) ఆర్టికల్ - 44: ఉమ్మడి పౌరస్మృతి ఏర్పాటు
డి) ఆర్టికల్ - 41: మహిళా, శిశు సంక్షేమం
- View Answer
- సమాధానం: డి
30. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) ఆర్టికల్ - 47: మద్యపాన నిషేధం
బి) ఆర్టికల్ - 50: కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం
సి) ఆర్టికల్ - 44: ఉమ్మడి పౌరస్మృతి ఏర్పాటు
డి) ఆర్టికల్ - 41: మహిళా, శిశు సంక్షేమం
- View Answer
- సమాధానం: బి
31. ‘స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి’ అని తెలిపే అధికరణం ఏది?
ఎ) 39(ఎ)
బి) 39(బి)
సి) 39(సి)
డి) 39(డి)
- View Answer
- సమాధానం: ఎ
32. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల్లో కొన్నింటిని కొత్తగా చేర్చారు?
ఎ) 42
బి) 86
సి) 97
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
33. ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని దేని/వేటి ద్వారా సాధించవచ్చు?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) రాజ్యాంగ ప్రవేశిక
సి) రాజ్య విధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు
డి) ప్రణాళికలు
- View Answer
- సమాధానం: సి
34. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఎవరు ఉంటారు?
ఎ) పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులు
బి) పార్లమెంట్‌లోని మొత్తం సభ్యులు
సి) పార్లమెంట్, విధానసభలకు ఎన్నికైన సభ్యులు
డి) పార్లమెంట్, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విధానసభలకు ఎన్నికైన సభ్యులు
- View Answer
- సమాధానం: డి
35. పదవుల కనీస అర్హత వయసుకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) రాష్ట్రపతి - 35 ఏళ్లు
బి) ప్రధానమంత్రి - 25 ఏళ్లు
సి) లోక్‌సభ సభ్యుడు - 25 ఏళ్లు
డి) విధాన పరిషత్ సభ్యుడు - 25 ఏళ్లు
- View Answer
- సమాధానం: డి
36. రాష్ట్రపతికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) రాష్ట్రపతిగా తక్కువ కాలం పనిచేసినవారు - జాకీర్ హుస్సేన్
బి) రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనవారు - నీలం సంజీవరెడ్డి
సి) స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి ఎన్నికైనవారు - వి.వి. గిరి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
37. రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి ఆర్టికల్ 123 దేని గురించి తెలుపుతుంది?
ఎ) సుప్రీంకోర్టు సలహా కోరడం
బి) ఆర్టినెన్సుల జారీ
సి) నేరస్థులకు క్షమాభిక్ష పెట్టడం
డి) లోక్‌సభ రద్దు
- View Answer
- సమాధానం: బి
38. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎవరు?
ఎ) అరుణ్ జైట్లీ
బి) గులాంనబీ ఆజాద్
సి) మల్లికార్జున ఖర్గే
డి) పైవారెవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
39.రాజ్యసభ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు?
ఎ) పి.జె. కురియన్
బి) గులాంనబీ ఆజాద్
సి) హమీద్ అన్సారీ
డి) సుమిత్రా మహాజన్
- View Answer
- సమాధానం: సి
40. ఉప రాష్ట్రపతికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) తక్కువ కాలం ఉప రాష్ట్రపతిగా పనిచేసినవారు - వి.వి. గిరి
బి) ఉప రాష్ట్రపతి పదవిలో కొనసాగుతూ మరణించినవారు - కృష్ణకాంత్
సి) ఉప రాష్ట్రపతి పదవికి రెండు పర్యాయాలు ఎన్నికైనవారు - రాధాకృష్ణన్, హమీద్ అన్సారీ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
41.ఉప రాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) నీలం సంజీవరెడ్డి
బి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
సి) వి.వి.గిరి
డి) జాకీర్ హుస్సేన్
- View Answer
- సమాధానం: బి
42. జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధాని ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) మొరార్జీ దేశాయ్
సి) పి.వి. నరసింహారావు
డి) అటల్ బిహారి వాజ్పాయ్
- View Answer
- సమాధానం: ఎ
43. ఏ ప్రధాని జన్మదినాన్ని ‘సుపరిపాలన దినోత్సవం’గా జరుపుకొంటారు?
ఎ) లాల్ బహదూర్ శాస్త్రి
బి) రాజీవ్ గాంధీ
సి) అటల్ బిహారి వాజ్పాయ్
డి) పి.వి. నరసింహారావు
- View Answer
- సమాధానం: సి
44. ప్రధాని పాత్ర, విధులు, అధికారాల గురించి తెలిపే అధికరణ ఏది?
ఎ) 75
బి) 74
సి) 78
డి) 79
- View Answer
- సమాధానం: సి
45. కింది వాటిలో ప్రధానమంత్రికి సంబంధించి సరికానిది ఏది?
ఎ) విదేశంలో మరణించిన ఏకైక ప్రధాని - లాల్ బహదూర్ శాస్త్రి
బి) మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని - పి.వి. నరసింహారావు
సి) తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి - చరణ్‌సింగ్
డి) సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపిన ప్రధాని - మొరార్జీ దేశాయ్
- View Answer
- సమాధానం: డి
46. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి సభ్యుల సంఖ్య.. లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదని నిర్ణయించారు?
ఎ) 85
బి) 89
సి) 91
డి) 94
- View Answer
- సమాధానం: సి
47. 1947లో నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేబినెట్లో ఏకైక మహిళా మంత్రి?
ఎ) విజయలక్ష్మీ పండిత్
బి) హంసా మెహతా
సి) సుచేతా కృపలాని
డి) రాజ్‌కుమారి అమృత్ కౌర్
- View Answer
- సమాధానం: డి
48. మంత్రి మండలి సమష్టి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి వర్గం నుంచి తప్పుకున్న మొదటి మంత్రి ఎవరు?
ఎ) జె.బి. కృపలాని
బి) బి.ఆర్. అంబేడ్కర్
సి) గోవింద వల్లభ పంత్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: undefined undefined undefined undefinedబి
-
49. భారతదేశంలో ఉన్నత న్యాయాధికారి ఎవరు?
ఎ) కేబినెట్ కార్యదర్శి
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) అటార్నీ జనరల్
డి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
- View Answer
- సమాధానం:సి
50. పార్లమెంట్లో సభ్యత్వం లేకపోయినప్పటికీ చర్చలు, సమావేశాల్లో పాల్గొనేది ఎవరు?
ఎ) కేబినెట్ కార్యదర్శి
బి) భారత రాష్ట్రపతి
సి) భారత ఉప రాష్ట్రపతి
డి) అటార్నీ జనరల్
- View Answer
- సమాధానం: డి