మలివేద కాలంలో పన్ను వసూలు చేసే అధికారిని ఏమని పిలిచేవారు?
1. ‘నాగరికత దిగుమతి చేసుకొనే వస్తువు అయితే దానిని మనం భారతదేశం నుంచి దిగుమతి చేసుకోవాలి’ అని వ్యాఖ్యానించిన బ్రిటిషర్ ఎవరు?
1) టకర్
2) జాన్ బ్రూస్ నోర్టన్
3) థామస్ మన్రో
4) ఎల్ఫిన్ స్టోన్
- View Answer
- సమాధానం: 3
2. జతపరచండి.
జాబితాI
a) సెయింట్ జార్జికోట
b) ఎర్రకోట
c) సెయింట్ విలియం కోట
d) సెయింట్ డేవిడ్ కోట
జాబితాII
i) కడలూరు
ii) కలకత్తా
iii) ఢిల్లీ
iv) మద్రాస్
1) a-ii, b-iv, c-i, d-iii
2) a-iv, b-iii, c-ii, d-i
3) a-ii, b-i, c-iii, d-iv
4) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 2
3.అసఫ్‌జాహీల పాలనాకాలం నాటి అంశాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) సర్ఫేఖాస్ - నిజాం వ్యక్తిగత భూములు
2) కొత్వాల్ - నగరంలో ముఖ్య పోలీస్ అధికారి
3) స్మిత్స - పాలనా డివిజన్లు
4) నీరి - న్యాయాధికారి
- View Answer
- సమాధానం: 4
4. జతపరచండి.
జాబితాI
a) 1861
b) 1897
c) 1882
d) 1904
జాబితాII
i) సహకార రుణ సంఘాలను బ్రిటిషర్లు స్థాపించారు
ii) గ్రామ స్థాయిలో పంచాయితీల ఏర్పాటు
iii) పోలీస్ శాఖను బ్రిటిషర్లు స్థాపించారు
iv) రామకృష్ణ మిషన్‌ను బేలూరులో స్థాపించారు
1) a-iv, b-i, c-iii, d-ii
2) a-ii, b-iii, c-i, d-iv
3) a-iii, b-iv, c-ii, d-i
4) a-i, b-ii, c-iii, d-iv
- View Answer
- సమాధానం: 3
5. జ్యోతిబా పూలేకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) కుల నిర్మూలన పోరాటం చేసిన తొలి భారతీయుడు
2) పూనాలో నిమ్న వర్ణాల బాలికల విద్య కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు
3) 1888లో ఆయనకు బొంబాయిలో ‘మహాత్మా’ అనే బిరుదు ప్రదానం చేశారు
4) ‘శూద్రులెవరు’ అనే గ్రంథాన్ని రాశారు
- View Answer
- సమాధానం: 4
6. ప్రతిపాదన(A): 1905లో లార్డ కర్జన్ బెంగాల్‌ను విభజించాడు
కారణం(R): హిందూ, ముస్లింల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడానికి బెంగాల్ విభజన చేశారు
1) A, Rలు సరైనవి, Aకు R సరైన వివరణ
2) A, Rలు సరైనవి, Aకు R సరైన వివరణ కాదు
3) A సరైంది, R సరైంది కాదు
4) A సరైంది కాదు , R సరైంది
- View Answer
- సమాధానం: 1
7. కింది వాటిలో సరైన జత ఏది?
1) వజ్జి - వైశాలి
2) మల్ల - కుశీ నగరం
3) గాంధార - తక్షశిల
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
8. రాజవంశాల పాలనను అనుసరించి కింది వాటిలో సరైన వరుస క్రమం ఏది?
1) హర్యంక, శిశునాగ, నంద, మౌర్య రాజ వంశాలు
2) శిశునాగ, నంద, హర్యంక, మౌర్య రాజ వంశాలు
3) హర్యంక, నంద, మౌర్య, శిశునాగ రాజ వంశాలు
4) హర్యంక, మౌర్య, శిశునాగ, నంద రాజ వంశాలు
- View Answer
- సమాధానం: 1
9. కింది వాటిలో సరికాని జత ఏది?
1) బాహుబలి విగ్రహం (శ్రావణ బెళగొళ) - రాచమల్లుడు
2) కోణార్క్ సూర్యాలయం (కోణార్క్) - నరసింహ దేవుడు
3) బాలకృష్ణ స్వామి ఆలయం (హంపి) - శ్రీకృష్ణ దేవరాయలు
4) బులంద్ దర్వాజా (ఫతేపూర్ సిక్రీ) - షాజహాన్
- View Answer
- సమాధానం: 4
10. మలివేద కాలంలో పన్ను వసూలు చేసే అధికారిని ఏమని పిలిచేవారు?
1) భాగదుఘ
2) గోఘ్న
3) పుషాన్
4) కులాప
- View Answer
- సమాధానం: 1
11. జతపరచండి.
జాబితాI
a) పూనా తామ్ర పత్ర శాసనం
b) ఎరాన్ శాసనం
c) మోటుపల్లి శాసనం
d) అలహాబాద్ శాసనం
జాబితాII
i) సముద్రగుప్తుడు
ii) మొదటి దేవరాయలు
iii) భానుగుప్తుడు
iv) ప్రభావతి గుప్త
1) a-iii, b-i, c-iv, d-ii
2) a-iv, b-iii, c-ii, d-i
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-ii, b-iv, c-i, d-iii
- View Answer
- సమాధానం: 2
12. కింది వాటిలో సరికాని జత ఏది?
1) నీల్‌దర్పణ్ - దీనబంధు మిత్ర
2) ఇండియన్ ముసల్మాన్స్ - డబ్ల్యూ.డబ్ల్యూ. హంటర్
3) ఇండియా విన్స్ ఫ్రీడమ్ - లాలా లజపతిరాయ్
4) ఆనంద్‌మఠ్ - బంకించంద్ర ఛటర్జీ
- View Answer
- సమాధానం: 3
13. శాతవాహనుల కాలంలో శాశ్వత సైనిక స్థావరం పేరు ఏమిటి?
1) నిగమం
2) కటకం
3) గద్వాణం
4) స్కంధావారం
- View Answer
- సమాధానం: 2
14. కింది వాటిలో సరైన జత ఏది?
1) విశ్వంభర (గ్రంథం) - డాక్టర్ సి. నారాయణరెడ్డి
2) అమ్మా తెలంగాణమా...(గీతం) - గద్దర్
3) కొమ్మ చెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా... (గీతం) - అంద్శై
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
15. అనీబిసెంట్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) 1916లో మదనపల్లిలో జాతీయ కళాశాలను స్థాపించారు
బి) ‘యంగ్ ఇండియా’ పత్రిక ద్వారా బ్రిటిషర్లను తీవ్రంగా విమర్శించారు
సి) 1917 కలకత్తాలో జరిగిన ఐఎన్సీకి అధ్యక్షత వహించారు
డి) భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)కి అధ్యక్షత వహించిన చివరి విదేశీ వనిత
1) ఎ, బి, సి
2) ఎ, బి,డి
3) ఎ, బి
4) ఎ, సి, డి
- View Answer
- సమాధానం: 4
16. గుప్తుల కాలంలో అభయ దత్తుడు అనే రాజోద్యోగి విధి ఏమిటి?
1) చాతుర్వర్ణ స్థితిని కాపాడటం
2) పన్నులు వసూలు చేయడం
3) విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించడం
4) యుద్ధ వ్యవహారాలు పర్యవేక్షించడం
- View Answer
- సమాధానం: 1
17. జతపరచండి.
జాబితాI
a) సమర్థ రామదాసు
b) షేక్ సలీం చిష్టీ
c) క్షేత్రయ్య
d) విద్యారణ్య స్వామి
జాబితాII
i) హరిహర రాయలు
ii) అబ్దుల్లా కుతుబ్ షా
iii) అక్బర్
iv) శివాజీ
1) a-iii, b-i, c-iv, d-ii
2) a-ii, b-iv, c-i, d-iii
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-iv, b-iii, c-ii, d-i
- View Answer
- సమాధానం: 4
18. భారతదేశ చరిత్రలో ఆఖరి పీష్వా ఎవరు?
1) మొదటి బాజీరావు
2) రెండో బాజీరావు
3) బాలాజీ విశ్వనాథ్
4) సదాశివ రావు
- View Answer
- సమాధానం: 2
19. ప్రతిపాదన(A): ఉత్తర భారతదేశంలో రామానందుడు తన సిద్ధాంతాల ప్రచారానికి హిందీ భాషను ఉపయోగించాడు
కారణం(R): సామాన్య ప్రజలు కూడా సిద్ధాంతాలను అర్థం చేసుకుని, ఆచరిస్తారని హిందీని ఉపయోగించారు
1) A, Rలు సరైనవి, Aకు R సరైన వివరణ
2) A, Rలు సరైనవి, Aకు R సరైన వివరణ కాదు
3) A సరైంది, R సరైంది కాదు
4) A సరైంది కాదు , R సరైంది
- View Answer
- సమాధానం: 1
20. జియావుద్దీన్ బరౌనీ (చరిత్రకారుడు), అమీర్‌ఖుస్రూ (కవి) ఏ సూఫీ శాఖను అనుసరించారు?
1) ఫిర్దౌసీ
2) చిష్టి
3) సుహ్రవర్థి
4) ఖాద్రి
- View Answer
- సమాధానం: 2
21. కింది వాటిలో ఏ గ్రంథానికి ‘మానసోల్లాసం’ అనే పేరు ఉంది?
1) ఆముక్త మాల్యద
2) అభిలషితార్థ చింతామణి
3) విక్రమోర్వశీయం
4) క్రీడాభిరామం
- View Answer
- సమాధానం: 2
22. వందేమాతరం ఉద్యమం కాలంలో ‘వందేమాతరం - అల్లాహో అక్బర్’ అని నినదించిన వారెవరు?
1) మౌలానా అబుల్ కలాం ఆజాద్
2) బద్రుద్దీన్ త్యాబ్జీ
3) షేక్ చాంద్
4) అబ్బాస్ త్యాబ్జీ
- View Answer
- సమాధానం: 3
23. కింది వాటిలో సరికాని జత ఏది?
1) గోల్కొండ - కుతుబ్‌షాహీలు
2) బీరార్ - ఇమ్మద్షాహీలు
3) బీదర్ - బరీద్షాహీలు
4) అహ్మద్ నగర్ - అదిల్షాహీలు
- View Answer
- సమాధానం: 4
24. హూణులు అనే క్రూరులు గుప్త రాజ్యంలోకి రాకుండా వారిని తరిమి కొట్టిన రాజు ఎవరు?
1) కుమార గుప్తుడు
2) స్కంధ గుప్తుడు
3) విష్ణుగుప్తుడు
4) పురుగుప్తుడు
- View Answer
- సమాధానం: 2
25. కింది వాటిలో సరైన జత కానిది ఏది?
1) పంచ పాండవ రథాలు - మహాబలిపురం
2) మార్తాండ సూర్యాలయం - కశ్మీర్
3) కమలపు మందిరం - హంపి
4) లింగరాజ స్వామి ఆలయం - బేలూరు
- View Answer
- సమాధానం: 4
26. అఖిల భారత ఖైదీల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
1) జనవరి 4
2) జనవరి 6
3) జనవరి 8
4) జనవరి 12
- View Answer
- సమాధానం: 1
27. కింది వాటిలో సరికాని జత ఏది?
1) అనాథ పిండకుడు జేతవనాన్ని బుద్ధుడికి బహుకరించాడు
2) దక్షిణ భారతదేశంలో అతి పెద్ద బౌద్ధ స్తూపం నేలకొండపల్లిలో ఉంది
3) బుద్ధుడిని హిందూ మత దశావతారాల్లో విష్ణువు ఏడో అవతారంగా శిల్పీకరించారు
4) బుద్ధుడి జీవితంలో ప్రధాన ఘట్టాలను ‘పంచ కళ్యాణాలు’ అంటారు
- View Answer
- సమాధానం: 3
28. సింధూ నాగరికత తొలి దశలో తంధురి పొయ్యిలు కనుగొన్న ఏ ప్రాంతంలో రొట్టెల తయారీకి 5000 సంవత్సరాల చరిత్ర ఉందని తెలుస్తోంది?
1) కాలిభంగన్
2) హరప్పా
3) లోథాల్
4) బన్వాలీ
- View Answer
- సమాధానం: 1
29. కాకతీయుల గురించి ప్రస్తావించిన తొలి శాసనం ఏది?
1) మల్కాపురం శాసనం
2) విప్పర్ల శాసనం
3) మాగల్లు శాసనం
4) అద్దంకి శాసనం
- View Answer
- సమాధానం: 3
30.కింది వాటిలో భారతదేశాన్ని పాలించిన మొగల్ రాజుల సరైన పాలనా వరుస క్రమం ఏది?
1) బాబర్, అక్బర్, హుమాయూన్, ఔరంగజేబు
2) బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్
3) బాబర్, షాజహాన్, అక్బర్, ఔరంగజేబు
4) బాబర్, జహంగీర్, అక్బర్, షాజహాన్
- View Answer
- సమాధానం: 2
31. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన తొలి మహిళ ఎవరు?
1) అనీబిసెంట్
2) సరోజిని నాయుడు
3) కాదింబినీ గంగూలీ
4) నెల్లీసేన్ గుప్తా
- View Answer
- సమాధానం: 3
32.పంచమ వేదం, జయ సంహిత అని కింది వాటిలో దేన్ని పిలుస్తారు?
1) రామాయణం
2) మహాభారతం
3) శృంగార నైషధం
4) మనుచరిత్ర
- View Answer
- సమాధానం: 2
33. జతపరచండి.
జాబితా-I
a) బక్సార్ యుద్ధం
b) ప్లాసీ యుద్ధం
c) నాలుగో మైసూర్ యుద్ధం
d) చందుర్తి యుద్ధం
జాబితాII
i) 1757
ii) 1758
iii) 1764
iv) 1799
1) a-iv, b-iii, c-ii, d-i
2) a-ii, b-iv, c-i, d-iii
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-iii, b-i, c-iv, d-ii
- View Answer
- సమాధానం: 4
34. ప్రతిపాదన(A): పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాని్సస్ - డి - ఆల్మిడా నీలి నీటి విధానం (BLUE WATER POLICY)ను ప్రవేశపెట్టాడు
కారణం(R): తాము చేసే వివిధ వ్యాపారాలకు ఇతర విదేశీయులు సముద్రంపై జరిగే వ్యాపార రవాణాకు అడ్డురాకుండా ఉండేందుకు.
1) A, Rలు సరైనవి, Aకు R సరైన వివరణ
2) A, Rలు సరైనవి, Aకు R సరైన వివరణ కాదు
3) A సరైంది, R సరైంది కాదు
4) A సరైంది కాదు , R సరైంది
- View Answer
- సమాధానం: 1
35. కింది వాటిలో సరికాని జత ఏది?
1) ముద్రారాక్షసం - విశాఖ దత్తుడు
2) మృచ్ఛకటికం - కాళిదాసు
3) నిర్వచనోత్తర రామాయణం - తిక్కన
4) భోగినీ దండకం - పోతన
- View Answer
- సమాధానం: 2
36. కింది వాటిలో సరికాని జత ఏది?
1) ‘సారే జహా సే అచ్ఛా’... - మహ్మద్ ఇక్బాల్
2) ‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినా’... - రాయప్రోలు సుబ్బారావు
3) ‘ఇంక్విలాబ్ జిందాబాద్’...- భగత్ సింగ్
4) ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’ - గుర్రం జాషువా
- View Answer
- సమాధానం: 4
37. కింది వాటిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నినాదం కానిది ఏది?
1) ఛలో ఢిల్లీ
2) జై హింద్
3) మీరు నాకు రక్తాన్నివ్వండి.. నేను మీకు స్వాతంత్య్రాన్నిస్తాను
4) జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్
- View Answer
- సమాధానం: 4