బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు
1. 1857 సిపాయిల తిరుగుబాటును ‘భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం’గా అభివర్ణించింది ఎవరు?
ఎ) వి.డి. సావర్కర్
బి) బాల్గంగాధర్ తిలక్
సి) మదన్‌లాల్ దింగ్రా
డి) మహాత్మా గాంధీ
- View Answer
- సమాధానం: ఎ
2. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏది?
ఎ) సాంఘిక వ్యవహారాల్లో బ్రిటిషర్ల జోక్యం
బి) భారతీయ సిపాయిలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం
సి) 1856లో ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ తుపాకుల్లో కొవ్వు పూసిన తూటాలు ఉపయోగించారనే వదంతి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
3. ఎన్ఫీల్డ్ తుపాకీ ఉపయోగించడాన్ని నిరాకరించి, 1857 మార్చి 29న బారక్పూర్లో బ్రిటిష్ అధికారిని కాల్చి చంపి సిపాయిల తిరుగుబాటుకు బీజం వేసింది ఎవరు?
ఎ) రామ్ పాండే
బి) మంగళ్‌పాండే
సి) దేశ్‌పాండే
డి) తాంతియా తోపే
- View Answer
- సమాధానం: బి
4. చరిత్రకారులు ‘1857 తిరుగుబాటు’ ఏ రోజు, ఏ ప్రాంతంలో ప్రారంభమైందని గుర్తించారు?
ఎ) మే 10; మీరట్
బి) జనవరి 29; బారక్పూర్
సి) జూన్ 10; ఢిల్లీ
డి) జూన్ 5; లక్నో
- View Answer
- సమాధానం: ఎ
5. 1857 తిరుగుబాటుకు సంబంధించిన ప్రధాన ప్రాంతాలు, నాయకులను జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e జాబితా - 1 జాబితా - 2 1) ఢిల్లీ a) భక్తి ఖాన్ 2) లక్నో b) బేగం హజ్రత్ మహల్ 3) ఝాన్సీ c) లక్ష్మీబాయి 4) ఫైజాబాద్ d) మౌల్వీ అహ్మదుల్లా 5) అర్రాహ్ e) కున్వర్ సింగ్
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-d, 2-a, 3-e, 4-b, 5-c
డి) 1-c, 2-b, 3-a, 4-e, 5-d
- View Answer
- సమాధానం: ఎ
6. మొగల్ చివరి పాలకుడు 2వ బహదూర్ షా వారసులను హత్య చేసి, ఆ వంశాన్ని అంతం చేసిన బ్రిటిష్ సేనాని ఎవరు?
ఎ) విలియం టేలర్
బి) నికోల్సన్
సి) కెప్టెన్ హడ్సన్
డి) విండ్ హోమ్
- View Answer
- సమాధానం: సి
7. లక్ష్మీబాయితో పోరాటం చేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
ఎ) హావ్లాక్
బి) సర్ హ్యూరోజ్
సి) కాంప్‌బెల్
డి) నికోల్సన్
- View Answer
- సమాధానం: బి
8. 1857 తిరుగుబాటు ప్రముఖ నాయకులు, వారి అసలు పేర్లకు సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) నానాసాహెబ్ - గోవింద దోండూపంత్
బి) తాంతియా తోపే - రామచంద్ర పాండురంగ్
సి) లక్ష్మీబాయి - మణికర్ణిక
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
9. కింది వారిలో నేపాల్ పారిపోయి, అక్కడే మరణించిన 1857 తిరుగుబాటు నాయకులు ఎవరు?
ఎ) నానాసాహెబ్
బి) బేగం హజ్రత్ మహల్
సి) ఎ, బి
డి) తాంతియా తోపే
- View Answer
- సమాధానం: సి
10. 1844-45లో గడ్కారి తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది?
ఎ) బ్రిటిష్ ప్రభుత్వం
బి) వడ్డీ వ్యాపారులు
సి) స్థానిక రాజులు
డి) ఎ, బి
- View Answer
- సమాధానం: డి
11. బ్రిటిష్ సైన్యంలో భారతీయ సిపాయిల తిరుగుబాటు మొదట ఏ ప్రాంతంలో జరిగింది?
ఎ) లక్నో
బి) వెల్లూరు
సి) బారక్పూర్
డి) మీరట్
- View Answer
- సమాధానం: బి
12. 1857 తిరుగుబాటు ప్రారంభానికి కొద్ది రోజుల ముందే.. ‘భారతీయ ఆకాశంలో చిన్న మబ్బు క్రమంగా పెరుగుతూ బ్రిటిష్ సామ్రాజ్య పునాదులనే కదిలించబోతుంది’అని పేర్కొన్న వ్యక్తి ఎవరు?
ఎ) లార్డ్ డల్హౌసీ
బి) వి.డి. సావర్కర్
సి) లార్డ్ కానింగ్
డి) దేవేంద్రనాథ్ ఠాగూర్
- View Answer
- సమాధానం: సి
13. ‘1857లో జరిగింది సిపాయిల తిరుగుబాటు కాదు, అది జాతీయ పోరాటం’ అని అంగీకరించిన ఆంగ్లేయుడు ఎవరు?
ఎ) చార్లెస్ ఉడ్
బి) డిజ్రౌలి
సి) కానింగ్
డి) ఎలెన్‌బరో
- View Answer
- సమాధానం: బి
14. కింది వాటిలో 1857 తిరుగుబాటు ముఖ్య కేంద్రం, బ్రిటిషర్లు మొదటగా పునరాక్రమించుకున్న ప్రాంతం ఏది?
ఎ) కాన్పూర్
బి) ఝాన్సీ
సి) ఢిల్లీ
డి) లక్నో
- View Answer
- సమాధానం: సి
15. 1858 ఏప్రిల్‌లో కింద పేర్కొన్న ఏ నాయకుడిని బంధించడంతో 1857 తిరుగుబాటు ముగిసిపోయినట్లుగా భావిస్తారు?
ఎ) తాంతియా తోపే
బి) మౌల్వీ అహ్మదుల్లా
సి) నానాసాహెబ్
డి) బేగం హజ్రత్ మహల్
- View Answer
- సమాధానం: ఎ
16.కింద పేర్కొన్నవారిలో 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిషర్లకు విశ్వాసపాత్రుడిగా ఉన్న జమీందార్/ పాలకుడు ఎవరు?
ఎ) కాశ్మీర్ - గులాబ్ సింగ్
బి) హైదరాబాద్ - సాలార్జంగ్
సి) సింధియా - దినకర్ రాయ్
డి) పైన పేర్కొన్న వారందరూ
- View Answer
- సమాధానం: డి
17.1857 తిరుగుబాటు ప్రధానంగా ఏ ప్రాంతంలో మత పెద్దలైన మౌల్వీలు, పండిట్ల ప్రభావానికి లోనైంది?
ఎ) బిహార్
బి) బెంగాల్
సి) ఉత్తరప్రదేశ్
డి) రాజస్థాన్
- View Answer
- సమాధానం: ఎ
18. ఏ గిరిజన తెగకు చెందినవారు తమ గ్రామాలను గ్రామపెద్దలైన ముండాల నుంచి సిక్కు, ముస్లింలకు మార్చినప్పుడు 1831-32లో తిరుగుబాటు చేశారు?
ఎ) హోస్
బి) కోల్
సి) భుమిజ్
డి) గోండు
- View Answer
- సమాధానం: బి
19. డల్హౌసీ గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలో 1855-56లో జరిగిన ఏ ఉద్యమాన్ని ‘గొప్ప తిరుగుబాటు’గా పేర్కొంటారు?
ఎ) సంతాల్ తిరుగుబాటు
బి) ఖోండ్ తిరుగుబాటు
సి) చెంచు తిరుగుబాటు
డి) కోయ తిరుగుబాటు
- View Answer
- సమాధానం: ఎ
20. 1829లో అస్సాంలో జరిగిన ‘ఖాసీ తిరుగుబాటు’కు ముఖ్య కారణం ఏమిటి?
ఎ) పన్నులు పెంచడం
బి) అస్సాం, సిల్హట్‌ను కలుపుతూ రహదారి నిర్మాణం కోసం ఉద్యోగాల నియామకం
సి) జమీందార్ల దురాగతాలు
డి) వడ్డీ వ్యాపారుల అకృత్యాలు
- View Answer
- సమాధానం: బి
21.‘కోల్’లు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఎప్పుడు తిరుగుబాటు చేశారు?
ఎ) 1828
బి) 1839
సి) 1844 – 48
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
22. నీలి మందు రైతుల దుస్థితిని వివరిస్తూ ‘నీలిదర్పణ్’ నాటకాన్ని రాసింది ఎవరు?
ఎ) దీనబంధుమిత్ర
బి) నారాయణ మెఖండే
సి) ఎస్.ఎ. డాంగే
డి) ఎస్.ఎన్. బెనర్జీ
- View Answer
- సమాధానం: ఎ
23. 1875లో పుణే, అహ్మద్ నగర్ కేంద్రాలుగా వ్యవసాయదారుల నిరసన (దక్కన్ తిరుగుబాటు) ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది?
ఎ) బ్రిటిష్ ప్రభుత్వం
బి) వడ్డీ వ్యాపారులు
సి) జమీందార్లు
డి) విదేశీ ఉద్యానవనదార్లు
- View Answer
- సమాధానం: బి
24. మోప్లా తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది?
ఎ) తమిళనాడు
బి) కర్ణాటక
సి) కేరళ
డి) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం:సి
25. ఏ గిరిజన నాయకుడిని అతడి అనుచరులు ‘దేవుడి అవతారం’గా, ‘ప్రపంచ పిత’గా భావించారు?
ఎ) బుద్ధో భగత్
బి) కన్హు
సి) బిర్సాముండా
డి) ఉమ్జి నాయక్
- View Answer
- సమాధానం: సి
26. పాగల్ పంథీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి.. కౌలుదార్లు, భూస్వాములను జమీందార్లకు వ్యతిరేకంగా ప్రోత్సహించిన నాయకుడు ఎవరు?
ఎ) మజ్ను షా
బి) టిప్పు షా
సి) దాదుమియా
డి) కరం షా
- View Answer
- సమాధానం: బి
27. తిరుగుబాట్లు, అవి జరిగిన ప్రాంతాలను జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e జాబితా - 1 జాబితా - 2 1) కుకా తిరుగుబాటు a) పంజాబ్ 2) కుకీ తిరుగుబాటు b) మణిపూర్ 3) పాయకా తిరుగుబాటు c) ఒరిస్సా 4) రామోసిస్ తిరుగుబాటు d) పుణే (మహారాష్ట్ర) 5) కట్టబ్రహ్మన తిరుగుబాటు e) తిరునల్వేలి (తమిళనాడు)
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-d, 2-a, 3-b, 4-c, 5-e
డి) 1-c, 2-d, 3-e, 4-a, 5-b
- View Answer
- సమాధానం: ఎ
28.పీష్వా పదవిని రద్దు చేయడంతో పీష్వా దళంలోని కింది తరగతి పోలీసులు చిత్తూరు సింగ్ ఉమాజీ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. దీన్ని ఏమని పిలుస్తారు?
ఎ) సతారా అల్లర్లు
బి) రామోసిస్ తిరుగుబాటు
సి) సంబల్పూర్ తిరుగుబాటు
డి) వేలుతంబి తిరుగుబాటు
- View Answer
- సమాధానం: బి
29. పుల్లరి తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు?
ఎ) కట్టబ్రహ్మన
బి) కిట్టూరు చెన్నమ
సి) కన్నెగంటి హనుమంతు
డి) సురేంద్రసాయి
- View Answer
- సమాధానం: సి
30. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు ‘రంపా తిరుగుబాటు’ను ఏ కాలంలో సాగించారు?
ఎ) 1921-22
బి) 1922-24
సి) 1924-26
డి) 1920-21
- View Answer
- సమాధానం: బి
31. కింది వాటిలో బెంగాల్ ప్రాంతంలో జరిగిన జమీందారీ వ్యతిరేక తిరుగుబాటు ఏది?
ఎ) పాబ్నా తిరుగుబాటు
బి) తెభాగా తిరుగుబాటు
సి) ఎ, బి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
32. రైతుల తిరుగుబాట్ల ఫలితంగా చేసిన చట్టాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) డెక్కన్ అగ్రికల్చరిస్ట్ రిలీఫ్ యాక్ట్- 1879
బి) బెంగాల్ కౌలుదార్ల చట్టం-1885
సి) పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టం - 1902
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
33. మోప్లాలు (ముస్లిం రైతులు) తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారకులు ఎవరు?
ఎ) బ్రిటిష్ అధికారులు
బి) రెవెన్యూ పాలకులు
సి) జెన్మీలు అనే హిందూ భూస్వాములు
డి) పైన పేర్కొన్న వారందరూ
- View Answer
- సమాధానం: సి
34. గాంధీజీ భారతదేశంలో నిర్వహించిన తొలి సత్యాగ్రహమైన ‘చంపారన్ సత్యాగ్రహం’కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) చంపారన్ బిహార్‌లో ఉంది
బి) రైతులు వారి పంట భూముల్లో 1/3 వ భాగంలో నీలిమందు పండించాలనే ‘తీన్ కథియా’ విధానానికి వ్యతిరేకంగా దీన్ని నిర్వహించారు
సి) గాంధీజీ పోరాట ఫలితంగా తీన్ కథియా విధానాన్ని రద్దు చేశారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
35. భూమిశిస్తు పెంపునకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనకు మద్దతుగా గాంధీజీ 1918లో ‘ఖేడా సత్యాగ్రహం’ చేశారు. ఈ ప్రాంతం ఎక్కడ ఉంది?
ఎ) గుజరాత్
బి) మహారాష్ట్ర
సి) బెంగాల్
డి) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం:ఎ
36. రైతులకు సహాయకంగా ‘బార్డోలి సత్యాగ్రహం’ను విజయవంతంగా నిర్వహించిన కాంగ్రెస్ ప్రముఖ నాయకులు ఎవరు?
ఎ) మహాదేవ దేశాయ్
బి) సర్దార్ పటేల్
సి) జె.బి. కృపలాని
డి) రాజేంద్రప్రసాద్
- View Answer
- సమాధానం: బి
37. గాంధీ యుగంలో జరిగిన ప్రముఖ సత్యాగ్రహ ఉద్యమాల్లో ఒకటైన ‘చీరాల-పేరాల’ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు?
ఎ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
బి) కొండా వెంకటప్పయ్య
సి) పర్వతనేని వీరయ్యచౌదరి
డి) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
- View Answer
- సమాధానం: ఎ
38. కింది వాటిలో 19వ శతాబ్దంలో జరిగిన, 1857 తిరుగుబాటు కంటే ప్రణాళికావంతంగా నిర్వహించిన ఉద్యమం ఏది?
ఎ) వహాబీ ఉద్యమం
బి) సన్యాసి ఉద్యమం
సి) ముండా తిరుగుబాటు
డి) సంతాల్ తిరుగుబాటు
- View Answer
- సమాధానం: ఎ
39.బ్రిటిషర్ల పాలనకు వ్యతిరేకంగా ‘వాఘేరా తిరుగుబాటు’ ఏ ప్రాంతంలో చేశారు?
ఎ) ఖాందేష్
బి) సౌరాష్ట్ర
సి) అహ్మదాబాద్
డి) పుణే
- View Answer
- సమాధానం: బి
40. బ్రిటిషర్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ముస్లిం ఫకీర్లను ఏకం చేసిన మొదటి నాయకుడు ఎవరు?
ఎ) అబ్దుల్ అజీజ్
బి) మజ్ను షా
సి) చిరాగ్ ఆలీ
డి) దాదుమియా
- View Answer
- సమాధానం: బి
41. బ్రిటిషర్ల పాలనా కాలంలో 19వ శతాబ్దం మధ్య వరకూ అనేక రకాల తిరుగుబాట్లు చెలరేగాయి. కానీ, కింద పేర్కొన్న వాటిలో ఏ రకమైన తిరుగుబాట్లు జరగలేదు?
ఎ) రైతు పోరాటాలు
బి) న్యాయ పోరాటాలు
సి) గిరిజన తిరుగుబాట్లు
డి) జమీందారీ తిరుగుబాట్లు
- View Answer
- సమాధానం: బి
42. 1857 తిరుగుబాటు సమయంలో రెండో బహదూర్షా ముఖ్య సలహాదారు ఎవరు?
ఎ) హకీమ్ అసనుల్లా
బి) భక్తా ఖాన్
సి) రూప్‌చంద్
డి) జవాన్ భక్త్
- View Answer
- సమాధానం:ఎ
43. 1857 తిరుగుబాటు విఫలమవడానికి ముఖ్య కారణం ఏది?
ఎ) నిధుల కొరత
బి) ఆయుధాల కొరత
సి) ఐక్యత, ఆధునికత, ముందుచూపు లోపించడం
డి) స్వదేశీయుల మద్దతు లేకపోవడం
- View Answer
- సమాధానం: సి