భూపటలం - శిలలు
1. కింది వాటిలో క్రమక్షయం వల్ల ఏర్పడే శిల ఏది?
ఎ) పాలరాయి
బి) సున్నపురాయి
సి) గ్రానైట్
డి) పలకరాయి
- View Answer
- సమాధానం: బి
2. పాలరాయి ఏ మాతృక శిల రూపాంతరం వల్ల ఏర్పడుతుంది?
ఎ) సున్నపురాయి
బి) ఇసుకరాయి
సి) షేల్
డి) బసాల్ట్
- View Answer
- సమాధానం: ఎ
3. మహారాష్ట్రలోని దక్కన్ నాపల ప్రాంతం ఏ రకమైన శిలలతో కూడి ఉంది?
ఎ) నీస్
బి) చార్నోకైట్
సి) గ్రానైట్
డి) బసాల్ట్
- View Answer
- సమాధానం: డి
4. భారతదేశంలోని కింది తరగతికి చెందిన శిలల్లో చమురు సహజవాయువు నిక్షేపాలు కేంద్రీకృతమై ఉన్నాయి?
ఎ) కర్నూలు-కడప శ్రేణి శిలలు
బి) టైపామ్ శ్రేణి ఇసుకరాయి
సి) ధార్వారియన్ శిలలు
డి) చార్నోకైట్లు
- View Answer
- సమాధానం: బి
5. కింది సూచించిన ఏ తరగతికి చెందిన శిలల్లో భూగర్భ జలవనరులు సమృద్ధిగా ఉంటాయి?
ఎ) అవక్షేప శిలలు
బి) రూపాంతర శిలలు
సి) అగ్ని శిలలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
6. ఏ మూలకాలు కేంద్రీకృతమవడం వల్ల పటలం అల్ప సాంద్రతను కలిగి ఉంటుంది?
ఎ) ఇనుము, నికెల్
బి) ఇనుము, సిలికాన్
సి) సిలికాన్, మెగ్నీషియం
డి) సిలికాన్, అల్యూమినియం
- View Answer
- సమాధానం: డి
7. భారతదేశంలో చార్నోకైట్, కోండలైట్ శిలలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి?
ఎ) పశ్చిమ కనుమలు
బి) దక్షిణ పీఠభూమి
సి) తూర్పు కనుమలు
డి) హిమాలయాలు
- View Answer
- సమాధానం:సి
8. హిమాలయాల్లోని శివాలిక్ కొండలు ప్రధానంగా కింది శిలలతో నిర్మితమై ఉన్నారుు?
ఎ) అవక్షేప శిలలు
బి) రూపాంతర శిలలు
సి) అగ్ని శిలలు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
9. కింది వాటిలో అగ్ని శిల కానిదేది?
ఎ) గ్రానైట్
బి) గాబ్రో
సి) కాంగ్లోమెరేట్
డి) బసాల్ట్
- View Answer
- సమాధానం: సి
10. మోహోలిక్ తలం వేటిని వేరు చేస్తుంది?
ఎ) ప్రావారం-కేంద్రకం
బి) పటలం-ప్రావారం
సి) సముద్రాలు-ఖండాలు
డి) బాహ్య కేంద్రకం-అంతర్ కేంద్రకం
- View Answer
- సమాధానం: బి
11. భూమికి సంబంధించిన కింది పొరను ‘శిలావరణం’గా వ్యవహరిస్తారు?
ఎ) భూపటలం
బి) ప్రావారం
సి) కేంద్రకం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
12. భూకంపాలు భూమికి సంబంధించిన ఏ భాగంలో ఉద్భవిస్తాయి?
ఎ) భూపటలం
బి) ప్రావారం
సి) కేంద్రకం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
13. భూఉపరితలం నుంచి అంతర్భాగానికి వెళ్లేకొద్దీ?
ఎ) సాంద్రత తగ్గుతుంది
బి) సాంద్రత పెరుగుతుంది
సి) సాంద్రత తగ్గి, పెరుగుతుంది
డి) సాంద్రత పెరిగి, తగ్గుతుంది
- View Answer
- సమాధానం: బి
14. మోహోవిక్ తలం భూమిలో సగటున సుమారుగా ఎంత లోతులో ఉంటుంది?
ఎ) 5 కి.మీ.
బి) 10 కి.మీ.
సి) 30 కి.మీ.
డి) 50 కి.మీ.
- View Answer
- సమాధానం: సి
15. ఖండాల భూపటలాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) సియాలో పొర
బి) సీమా పొర
సి) నైఫ్ పొర
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
16. భూ అంతర్భాగానికి చెందిన కింది పొరను ‘పెరిడోటైట్’ కర్పరంగా పిలుస్తారు?
ఎ) భూపటంల
బి) ప్రావారం
సి) కేంద్రకం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
17. ‘బాథోలిధ్’ భూస్వరూపం ఏ రకమైన శిలలతో నిర్మించబడుతుంది?
ఎ) అవక్షేప శిలలు
బి) రూపాంతర శిలలు
సి) అగ్ని శిలలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
18. గ్యుటెన్బర్గ్ తలం భూ అంతర్భాగంలో సుమారు ఎంత లోతులో ఉంటుంది?
ఎ) 2000 కి.మీ.
బి) 2200 కి.మీ.
సి) 2500 కి.మీ.
డి) 2900 కి.మీ.
- View Answer
- సమాధానం: డి
19. రూపాంతర శిలలు ఏర్పడటానికి ఏ అంశాలు దోహదపడతాయి?
1) అధిక పీడం
2) అధిక ఉష్ణోగ్రత
3) అధిక వర్షపాతం
ఎ) 1, 2
బి) 2, 3
సి) 3, 1
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
20. భూపటలంలో శిలలు ప్రధానంగా ఏ మూలకాలని కలిగి ఉంటాయి?
ఎ) మెగ్నీషియం
బి) ఇసుక
సి) ఇనుము
డి) సిలికాన్
- View Answer
- సమాధానం: డి