భారతదేశం - పరిశ్రమలు
1. సిల్క్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం? (పోలీస్ కానిస్టేబుల్-2012)
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) తమిళనాడు
4) అసోం
- View Answer
- సమాధానం: 2
2. రబ్బరుకు సంబంధించి అత్యధిక విస్తీర్ణం ఉన్న రాష్ట్రం?(పోలీస్ కానిస్టేబుల్-2009)
1) కేరళ
2) కర్ణాటక
3) మహారాష్ట్ర
4) ఒరిస్సా
- View Answer
- సమాధానం: 1
3. ‘చెరకు చక్కెర’లో ఉండే రసాయనం పేరేమిటి? (ఎస్ఐ-2011)
1) లాక్టోస్
2) గ్లూకోజ్
3) సుక్రోజ్
4) ఫ్రక్టోజ్
5) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
4. ‘మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా’ అని ఏ నగరానికి పేరు? (డిప్యూటీ జైలర్‌స-2012)
1) బెంగళూరు
2) మధురై
3) కోయంబత్తూర్
4) కొచ్చిన్
- View Answer
- సమాధానం: 3
5. భారతదేశ అతిపెద్ద కుటీర పరిశ్రమ? (ఎస్ఐ-2012)
1) పట్టు పరిశ్రమ
2) సబ్బుల పరిశ్రమ
3) చేనేత పరిశ్రమ
4) పాన్ మసాల
- View Answer
- సమాధానం: 3
6. ఏ పరిశ్రమ అత్యధిక ఉద్యోగితను కలిగిస్తుంది?
1) ఉక్కు
2) వస్త్ర పరిశ్రమ
3) పంచదార
4) సిమెంట్
- View Answer
- సమాధానం: 2
7. జనపనార పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది?
1) ముంబై
2) ఢిల్లీ
3) కోల్‌కతా
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 3
8. కిందివాటిలో వ్యవసాయాధారిత పరిశ్రమ కానిది?
1) సిగరెట్
2) వనస్పతి
3) పట్టు
4) సిమెంట్
- View Answer
- సమాధానం: 4
9. కింది వాటిలో ఏ నగరాన్ని ‘మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా’ అని పిలుస్తారు?
1) కాన్పూర్
2) ముంబై
3) కోయంబత్తూర్
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 3
10. కింది వాటిలో ఖనిజాధార పరిశ్రమ కానిది ఏది?
1) కాపర్
2) గాజు
3) రబ్బరు
4) లెడ్
- View Answer
- సమాధానం: 3
11. దేశంలో 1818లో మొదటి వస్త్ర పరిశ్రమను కలకత్తా సమీపంలో ఎక్కడ స్థాపించారు?
1) సెరంపూర్
2) ఖరగ్‌పూర్
3) హౌరా
4) ఫోర్ట్ గ్లాస్టర్
- View Answer
- సమాధానం: 4
12. కర్మాగారాలు, అవి ఉన్న నగరాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) భిలాయ్ ఉక్కు కర్మాగారం- ఛత్తీస్‌గఢ్
2) రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం - ఒడిశా
3) బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం - జార్ఖండ్
4) దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం - మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
13.భారతదేశంలో మొదటి కాగితం పరిశ్రమను 1832లో సేరంపూర్‌లో స్థాపించారు. ఇది ఏ నది ఒడ్డున ఉంది?
1) మహానది
2) హుగ్లీనది
3) నర్మదానది
4) గంగానది
- View Answer
- సమాధానం: 2
14. ‘కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1) కోయంబత్తూర్
2) అహ్మదాబాద్
3) ముంబై
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 3
15. న్యూస్ ప్రింట్ పరిశ్రమ ఉన్న ‘నేపా నగర్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) మధ్యప్రదేశ్
2) మహారాష్ట్ర
3) గుజరాత్
4) గోవా
- View Answer
- సమాధానం: 1
16.భారతదేశంలో ‘అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ ఎక్కడ ఉంది?
1) టాండూ
2) జాయక్ నగర్
3) ఘాట్సీలా
4) ఖేత్రి
- View Answer
- సమాధానం: 2
17. టాటా ఇనుము ఉక్కు కర్మాగారం (TISCO)కు ఏ నది నీటిని వినియోగిస్తున్నారు?
1) హుగ్లీ
2) నర్మదా
3) ఖారికామ్
4) సువర్ణరేఖ
- View Answer
- సమాధానం: 4
18. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది?
1) మహానది
2) బ్రాహ్మణీ నది
3) సరస్వతీ నది
4) యమునా నది
- View Answer
- సమాధానం: 2
19. భారతదేశంలో మొదటి గాజు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు?
1) ఫిరోజాబాద్
2) ఆల్వే
3) నామరూప్
4) రత్నగిరి
- View Answer
- సమాధానం: 1
20. దేశంలో కాపర్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ‘మాహుభాండార్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఛత్తీస్‌గఢ్
2) సిక్కిం
3) రాజస్థాన్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 4
21. కింది వాటిలో సరికాని జత ఏది?
1) కొచ్చిన్ షిప్‌యార్డ్ - కేరళ
2) మజగావ్ డాక్ - ముంబై
3) గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ - పారాదీప్
4) హిందూస్తాన్ షిప్‌యార్డ్ - విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 3
22. భారతదేశంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది?
1) పశ్చిమ బెంగాల్
2) కర్ణాటక
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
23. సింథటిక్ రబ్బరు పరిశ్రమ ఉన్న ‘బరేలీ’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) గుజరాత్
2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
24. భారతదేశంలో మొదటి యాంటీబయాటిక్ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) రాణిపేట
2) సింద్రీ
3) పింప్రి
4) రాణికేట్
- View Answer
- సమాధానం: 3
25. దేశంలో 1919లో ‘ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ’ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) భద్రావతి, కర్ణాటక
2) బర్నపూర్, బెంగాల్
3) సేలం, తమిళనాడు
4) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
26. ‘సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ఎక్కడ ఉంది?
1) గుల్మార్గ్
2) నాగపూర్
3) లక్నో
4) కాసర్‌గఢ్
- View Answer
- సమాధానం: 4
27. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’ ఎక్కడ ఉంది?
1) కోల్‌కతా
2) నాగపూర్
3) పనాజి
4) జోధ్‌పూర్
- View Answer
- సమాధానం: 3
28. భారతదేశంలో సింద్రీ ఎరువుల కర్మాగారాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు?
1) సువర్ణరేఖ నది
2) హుగ్లీ నది
3) మహానది
4) దామోదర్ నది
- View Answer
- సమాధానం: 4
29. ‘హిందూస్తాన్ ఫొటోఫిల్మ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్’ ఎక్కడ ఉంది?
1) కొచ్చిన్
2) ఊటీ
3) ముంబై
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
30. కింది వాటిలో రెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేయని కర్మాగారం ఏది?
1) రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం
2) బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం
3) భిలాయ్ ఉక్కు కర్మాగారం
4) దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం
- View Answer
- సమాధానం: 2
31. శివకాశి, త్రిసూర్ అనేవి ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవి?
1) రబ్బరు
2) సిల్కు పరిశ్రమ
3) కాగితం
4) అగ్గిపుల్లలు
- View Answer
- సమాధానం: 4
32. రోలింగ్ యంత్రాలను ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏది?
1) హిందుస్తాన్ మెషీన్ టూల్స్
2) హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్
3) హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
4) హిందుస్తాన్ లెటెక్స్ లిమిటెడ్
- View Answer
- సమాధానం:3
33. కింది వాటిలో ఏ ఇనుము ఉక్కు కర్మాగారంలో ‘స్టెయిన్లెస్ స్టీల్’ను ఉత్పత్తి చేస్తారు?
1) బర్నపూర్
2) రూర్కెలా
3) విశాఖపట్నం
4) సేలం
- View Answer
- సమాధానం: 4
34. విశాఖపట్నం ఇనుము ఉక్కు కర్మాగారానికి ఇనుప ఖనిజాన్ని ఏ గనుల నుంచి రవాణా చేస్తున్నారు?
1) బైలదిల్లా
2) సుందర్‌గఢ్
3) సింగ్భమ్
4) మయూర్ బంజ్
- View Answer
- సమాధానం: 1
35. భారతదేశంలో మొదటి కాఫీ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) విజయనగరం
2) డార్జిలింగ్
3) చిక్‌మంగుళూరు
4) నీలగిరి ప్రాంతం
- View Answer
- సమాధానం: 3
36. కింది వాటిలో ‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’లో విలీనం కాని ఇనుము ఉక్కు కర్మాగారం ఏది?
1) రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం
2) బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం
3) దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం
4) భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం
- View Answer
- సమాధానం: 2
37. భారతదేశంలో అతి పురాతన పరిశ్రమ ఏది?
1) నూలు వస్త్ర పరిశ్రమ
2) అల్యూమినియం పరిశ్రమ
3) పంచదార పరిశ్రమ
4) ఇనుము- ఉక్కు పరిశ్రమ
- View Answer
- సమాధానం: 1
38. ‘దేవాస్’ ప్రాంతం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది?
1) కాఫీ
2) ఉన్ని
3) కాగితం
4) రబ్బరు
- View Answer
- సమాధానం: 3
39.చెరకు పిప్పి (బగాసీ)ని ముడి పదార్థంగా ఉపయోగించి పేపరును తయారు చేసే ‘బెళగోళ’ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్
2) మహారాష్ట్ర
3) బిహార్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
40. భారతదేశంలో మొదటి జనుము పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) సేరంపూర్
2) రిష్రా
3) నేపానగర్
4) వారణాసి
- View Answer
- సమాధానం: 2
గతంలో అడిగిన ప్రశ్నలు
1. మొదటి ఉన్ని వస్త్రాగారాన్ని ఎక్కడ నెలకొల్పారు? (Group-II, 2000)
1) కాన్పూర్
2) లక్నో
3) ధరివాల్
4) శ్రీనగర్
- View Answer
- సమాధానం: 1
2. దేశంలో అతి పురాతన నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? (Group-II, 2002)
1) హల్దియా
2) దిగ్భాయ్
3) బరౌని
4) కొచ్చిన్
- View Answer
- సమాధానం:2
3. దేశంలో అతిపెద్ద ఇనుము-ఉక్కు పరిశ్రమ ఏది? (Group-I, 2002)
1) రూర్కెలా
2) భిలాయ్
3) బొకారో
4) దుర్గాపూర్
- View Answer
- సమాధానం: 3
4. కింద పేర్కొన్న నగరాల సమూహాల్లో వేటిలో బి.హెచ్.ఇ.ఎల్. కర్మాగారాలు ఉన్నాయి? (Group-I, 2002)
1) భోపాల్, హైదరాబాద్, పింజోర్
2) హరిద్వార్, తిరుచిరాపల్లి, శ్రీనగర్
3) ఢిల్లీ, ముంబై, కోల్‌కతా
4) భోపాల్, హైదరాబాద్, తిరుచిరాపల్లి
- View Answer
- సమాధానం: 4
5. కింది వాటిలో పశ్చిమ బెంగాల్‌లోని రూప్ నారాయణ్‌పూర్‌లో ఉన్న కర్మాగారం ఏది? (S.I., 2012)
1) భారత్ అల్యూమినియం కర్మాగారం
2) హిందుస్తాన్ కాపర్ ప్లాంట్
3) భారత్ టెలిఫోన్ కర్మాగారం
4) హిందుస్తాన్ కేబుల్ కర్మాగారం
- View Answer
- సమాధానం: 4
6. కింది వాటిలో దేశంలో అత్యంత ప్రముఖమైన నూలు వస్త్ర పరిశ్రమలున్న ప్రాంతం ఏది? (Group-I, 2003)
1) భోపాల్ - గ్వాలియర్
2) కాన్పూర్ - లక్నో
3) ముంబై - అహ్మదాబాద్
4) హైదరాబాద్ - గుల్బర్గా
- View Answer
- సమాధానం: 3
7. కింది వాటిలో వ్యవసాయ ఆధారితం కాని పరిశ్రమ ఏది? (Group-I, , 2000)
1) సిగరెట్
2) వనస్పతి
3) పేపర్
4) సిమెంట్
- View Answer
- సమాధానం: 4
8. ‘సింద్రీ’ దేనికి ప్రసిద్ధి? (A.E.E., 2007)
1) ఎరువుల కర్మాగారం
2) అల్యూమినియం కర్మాగారం
3) సిమెంట్ కర్మాగారం
4) కాగితం పరిశ్రమ
- View Answer
- సమాధానం: 1
9. రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు? (Group-I, 2002)
1) సోవియట్ యూనియన్
2) ఫ్రాన్స్
3) బ్రిటన్
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 4
10. కింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ ఏది? (Group-I, 1999)
1) ఇనుము - ఉక్కు పరిశ్రమ
2) నేత వస్త్ర పరిశ్రమ
3) ఎరువుల పరిశ్రమ
4) సిమెంట్ పరిశ్రమ
- View Answer
- సమాధానం: 2
11. హల్దియా అనేది..? (Group-I, 1994)
1) బంగాళాఖాతం తీరంలో ఉంది
2) చమురుశుద్ధికి ప్రముఖ కేంద్రం
3) కలకత్తాకు బయటి రేవు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
12. ఇండియాలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?? (A.C.F., 2012)
1) ఉత్తర ప్రదేశ్
2) బిహార్
3) జార్ఖండ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 4
13. భారతదేశంలో అతిపెద్ద కుటీర పరిశ్రమ ఏది? (S.I. 2012)
1) పట్టు పరిశ్రమ
2) సబ్బుల పరిశ్రమ
3) చేనేత పరిశ్రమ
4) పాన్ మసాల
- View Answer
- సమాధానం: 3
14. పెట్రో- కెమికల్ పరిశ్రమ అధికంగా ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది? (Group-II, 2003)
1) బెంగాల్
2) బిహార్
3) గుజరాత్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
15. హుగ్లీలో జనపనార పరిశ్రమలు వృద్ధి చెందడానికి కారణం? (Group-I, 1994)
1) బొగ్గు పుష్కలంగా లభించడం
2) నీరు పుష్కలంగా లభించడం
3) ముడిసరకు పుష్కలంగా లభించడం
4) జౌళి పరిశ్రమ ఎగుమతికి దోహదం చేయడం
- View Answer
- సమాధానం: 3
16.కింది వాటిలో డీజిల్ రైలు ఇంజన్లను తయారు చేసే ప్రదేశం ఏది? (Group-I, 2008)
1) పెరంబూర్
2) జంషెడ్పూర్
3) వారణాసి
4) చిత్తరంజన్
- View Answer
- సమాధానం: 3
17. నగరం, ప్రధాన పరిశ్రమలకు సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది? (A.E.E., 2008)
1) బెంగళూరు - నూలు పరిశ్రమ
2) బరౌని - రసాయన పరిశ్రమ
3) కోర్బా - అల్యూమినియం
4) అహ్మదాబాద్ - ఇంజనీరింగ్
- View Answer
- సమాధానం: 3
18. భారతదేశంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు? (Police Constables, 2012)
1) కొత్తగూడెం
2) విశాఖపట్నం
3) భోపాల్
4) కలకత్తా
- View Answer
- సమాధానం: 1
19. చక్కెర పరిశ్రమ ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి తరలడానికి ప్రధాన కారణం? (A.E.E., 2004)
1) కార్మికులు చవకగా లభించడం
2) ప్రాంతీయ మార్కెట్లు వృద్ధి చెందడం
3) విద్యుచ్ఛక్తి చవకగా, ఎక్కువగా లభించడం
4) అధిక ఉత్పాదకత, ఇక్కడ పండిన చెరకు ఎక్కువగా చక్కెర శాతాన్ని కలిగి ఉండటం
- View Answer
- సమాధానం: 4
20.‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)’ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? (J.L., 2001)
1) ముంబై
2) కోల్‌కతా
3) ఢిల్లీ
4) భోపాల్
- View Answer
- సమాధానం: 3