ఎన్నో పంచవర్ష ప్రణాళిక కాలంలో జీడీపీ వృద్ధి రేటు అతి తక్కువగా 2.82 శాతం మాత్రమే నమోదైంది?
1. ఎన్నో పంచవర్ష ప్రణాళిక కాలంలో జీడీపీ వృద్ధి రేటు అతి తక్కువగా 2.82 శాతం మాత్రమే నమోదైంది?
ఎ) 3
బి) 9
సి) 10
డి) 11
- View Answer
- సమాధానం: ఎ
2. ముందుగా నిర్దేశించిన ప్రణాళికలో ఏ విధమైన మార్పులు చేయకుండా అమలు చేయడాన్ని ఏవిధంగా వ్యవహరిస్తారు?
ఎ) భౌతిక ప్రణాళిక
బి) విత్త ప్రణాళిక
సి) స్థిర ప్రణాళిక
డి) సూచనాత్మక ప్రణాళిక
- View Answer
- సమాధానం: సి
3. నిర్దేశాత్మక ప్రణాళిక ఏ రకమైన ఆర్థిక వ్యవస్థల్లో అమల్లో ఉంటుంది?
ఎ) పెట్టుబడిదారీ
బి) సామ్యవాద
సి) మిశ్రమ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
4. కింది వాటిలో దేశీయ బడ్జెట్ వనరుల్లో భాగం కాని అంశం ఏది?
ఎ) దేశీయ పొదుపు
బి) విదేశాల నుంచి గ్రాంట్లు
సి) ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు
డి) బడ్జెటరీ మిగులు
- View Answer
- సమాధానం: బి
5. ప్రభుత్వ రంగ పెట్టుబడిలో శాతం పరంగా విదేశీ సహాయం వాటా కింద పేర్కొన్న ఎన్నో ప్రణాళికలో ఎక్కువగా ఉంది?
ఎ) 3
బి) 4
సి) 9
డి) 11
- View Answer
- సమాధానం: ఎ
6. ‘ఆర్థిక స్వావలంబన, సుస్థిర వృద్ధి’ అనేది ఎన్నో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం?
ఎ) 2
బి) 3
సి) 4
డి) 12
- View Answer
- సమాధానం: సి
7. నిధులు కొరతగా ఉన్నప్పుడు ప్రభుత్వం బడ్జెట్ లోటును సృష్టించి నూతన కరెన్సీని ముద్రించే విధానాన్ని ఏమంటారు?
ఎ) కనిష్ట నిల్వల పద్ధతి
బి) లోటు ద్రవ్య విధానం
సి) ప్రాథమిక లోటు
డి) రెవెన్యూ లోటు
- View Answer
- సమాధానం: బి
8. భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికను ఏ విధంగా వ్యవహరిస్తారు?
ఎ) దీర్ఘదర్శి ప్రణాళిక
బి) ఆదేశాత్మక ప్రణాళిక
సి) సూచనాత్మక ప్రణాళిక
డి) స్థిర ప్రణాళిక
- View Answer
- సమాధానం: ఎ
9. ‘వ్యవసాయ ధరల కమిషన్’ను ఎన్నో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు?
ఎ) 3
బి) 4
సి) 6
డి) 7
- View Answer
- సమాధానం: ఎ
10. అత్యంత విఫలమైన ప్రణాళికగా ఎన్నో ప్రణాళికను భావించవచ్చు?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 8
- View Answer
- సమాధానం: సి
11. బొకారో ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1956-57
బి) 1961-62
సి) 1962-63
డి) 1964-65
- View Answer
- సమాధానం: డి
12. కింద పేర్కొన్న ఏ కాలంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు రుణాత్మకంగా నమోదైంది?
ఎ) 1956-61
బి) 1969-74
సి) 1978-80
డి) 1990-92
- View Answer
- సమాధానం: సి
13. కింది వాటిలో ప్రణాళికా విరామ కాలం?
ఎ) 1956-58
బి) 1961-63
సి) 1966-69
డి) 1980-82
- View Answer
- సమాధానం: సి
14.‘లీడ్ బ్యాంక్’ పథకాన్ని ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రారంభించారు?
ఎ) నారిమన్
బి) అశోక్ మెహతా
సి) ఫోర్డ్
డి) స్వామినాథన్
- View Answer
- సమాధానం: ఎ
15. నాలుగో పంచవర్ష ప్రణాళిక రూపకర్త?
ఎ) అశోక్ రుద్ర
బి) స్వామినాథన్
సి) డీఆర్ గాడ్గిల్
డి) డీపీ ధర్
- View Answer
- సమాధానం: సి
16. 1974 మార్చి 18న పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) బిహార్
బి) పశ్చిమ బెంగాల్
సి) అరుణాచల్ ప్రదేశ్
డి) రాజస్థాన్
- View Answer
- సమాధానం: డి
17. ‘ఈశాన్య రాష్ట్రాల మండలి’ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1965
బి) 1971
సి) 1974
డి) 1978
- View Answer
- సమాధానం: బి
18. ఉపాధి హామీ పథకాన్ని 1972-73లో మొదటగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) కర్ణాటక
సి) మహారాష్ట్ర
డి) కేరళ
- View Answer
- సమాధానం: సి
19. ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ఎప్పుడిచ్చారు?
ఎ) 1974
బి) 1976
సి) 1980
డి) 1981
- View Answer
- సమాధానం: ఎ
20. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను తొలిసారిగా ఎన్నో ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేశారు?
ఎ) 3
బి) 4
సి) 5
డి) 6
- View Answer
- సమాధానం: సి
21. ‘గ్రామీణ విద్యుద్దీకరణ కార్పొరేషన్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1966
బి) 1969
సి) 1970
డి) 1972
- View Answer
- సమాధానం: బి
22. అయిదో పంచవర్ష ప్రణాళిక రూపకర్త?
ఎ) డీపీ ధర్
బి) అశోక్ మెహతా
సి) మహలనోబిస్
డి) డీఆర్ గాడ్గిల్
- View Answer
- సమాధానం: ఎ
23. భారతదేశంలో ‘నిర్బంధ కుటుంబ నియంత్రణ’ను అమలు చేసిన సంవత్సరం?
ఎ) 1971
బి) 1973
సి) 1975
డి) 1979
- View Answer
- సమాధానం: సి
24. పేదరిక నిర్మూలన ప్రణాళికగా ఎన్నో పంచవర్ష ప్రణాళికను వ్యవహరించవచ్చు?
ఎ) 5
బి) 7
సి) 8
డి) 9
- View Answer
- సమాధానం: ఎ
25. నిరంతర ప్రణాళికను రూపొందించిన గున్నార్ మిర్థాల్ ఏ దేశస్థులు?
ఎ) అమెరికా
బి) రష్యా
సి) దక్షిణ కొరియా
డి) స్వీడన్
- View Answer
- సమాధానం: డి
26. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు మొత్తం మూలధనంలో ప్రాయోజిత బ్యాంకు (స్పాన్సర్ చేసిన బ్యాంకు) వాటా ఎంత శాతం?
ఎ) 15
బి) 35
సి) 40
డి) 50
- View Answer
- సమాధానం: బి
27. కింది వాటిలో ఏ బ్యాంకును జాతీయం చేయలేదు?
ఎ) ఐడీబీఐ
బి) భారతీయ మహిళా బ్యాంకు
సి) ధనలక్ష్మి బ్యాంకు
డి) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు
- View Answer
- సమాధానం: సి
28. ‘ఇందిరా ఆవాస్ యోజన’ను ఎన్నో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు?
ఎ) 7
బి) 9
సి) 10
డి) 11
- View Answer
- సమాధానం: ఎ
29. వేతన వస్తు వ్యూహం ప్రభావం ఎన్నో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఇమిడి ఉందని భావించవచ్చు?
ఎ) 2
బి) 4
సి) 6
డి) 7
- View Answer
- సమాధానం:డి
30.ప్రాథమిక పాఠశాలలో కనీస వసతుల కల్పనకు ‘ఆపరేషన్ బ్లాక్ బోర్డు’ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1985-86
బి) 1987-88
సి) 1990-91
డి) 1992-93
- View Answer
- సమాధానం: బి
31. 1990-92లో ప్రణాళికా విరామాన్ని ప్రకటించడానికి కారణం?
ఎ) విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత
బి) అధిక ద్రవ్యలోటు
సి) అధిక ద్రవ్యోల్బణం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం:డి
32. ఏ కమిటీ సిఫారసుల మేరకు 1985లో ‘ఖాయిలా పడిన పరిశ్రమల చట్టం’ను తీసుకువచ్చారు?
ఎ) తివారీ
బి) రంగరాజన్
సి) వైద్యనాథన్
డి) బ్రహ్మానందం
- View Answer
- సమాధానం: ఎ
33. ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1983
బి) 1985
సి) 1988
డి) 1990
- View Answer
- సమాధానం: సి
34. ఏడో పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగ పెట్టుబడిలో భాగంగా వనరుల కేటాయింపులో ఏ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు?
ఎ) నీటి పారుదల, వరద నివారణ
బి) శక్తి
సి) పరిశ్రమలు, ఖనిజాలు
డి) రవాణా, సమాచారం
- View Answer
- సమాధానం: బి
35. వ్యవసాయ, చేనేత రుణ మాఫీని మొదటిసారిగా ఎప్పుడు అమలు చేశారు?
ఎ) 1988
బి) 1990
సి) 1991
డి) 2004
- View Answer
- సమాధానం: బి
36. ఎనిమిదో పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగ పెట్టుబడిలో భాగంగా వనరుల కేటాయింపులో ప్రాధాన్యం పొందిన రంగం?
ఎ) వ్యవసాయం
బి) తయారీ రంగం
సి) శక్తి
డి) నీటి పారుదల
- View Answer
- సమాధానం: సి
37. తొమ్మిదో ప్రణాళిక లక్ష్యం?
ఎ) సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం
బి) మానవాభివృద్ధి
సి) వృద్ధి, ఆధునీకరణ, స్వయం సమృద్ధి
డి) సమ్మిళిత వృద్ధి
- View Answer
- సమాధానం: ఎ
38. కింది వాటిలో పదో ప్రణాళిక లక్ష్యం కానిది ఏది?
ఎ) 2007 నాటికి అక్షరాస్యత రేటు 75 శాతానికి పెంచడం
బి) 2012 నాటికి పేదరికాన్ని 25 శాతానికి తగ్గించడం
సి) 2012 నాటికి శిశు మరణాలు ప్రతి వేయి జననాలకు 28కి తగ్గించడం
డి) అటవీ విస్తీర్ణాన్ని 2012 నాటికి దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతానికి పెంచడం
- View Answer
- సమాధానం: బి
39. లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఎ) 1997
బి) 1998
సి) 1999
డి) 2004
- View Answer
- సమాధానం: ఎ
40. ‘కృషి శ్రామిక సామాజిక సురక్షా యోజన’ ప్రారంభించిన సంవత్సరం ఏది?
ఎ) 1998
బి) 1999
సి) 2000
డి) 2001
- View Answer
- సమాధానం: డి
41. పదకొండో ప్రణాళికలో సాధించాల్సిన లక్ష్యాలుగా ఎన్ని అంశాలను నిర్ణయించారు?
ఎ) 25
బి) 26
సి) 27
డి) 29
- View Answer
- సమాధానం: సి
42.‘వేగవంతమైన సమ్మిళిత వృద్ధి’ ఎన్నో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం?
ఎ) 9
బి) 10
సి) 11
డి) 12
- View Answer
- సమాధానం:సి
43. పదకొండో ప్రణాళికలో ఎన్ని అంశాలకు సంబంధించి లక్ష్యాలను నిర్ణయించుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు కల్పించారు?
ఎ) 12
బి) 13
సి) 14
డి) 15
- View Answer
- సమాధానం: బి
44. బీమా రంగ నియంత్రణకు ఐఆర్డీఏను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1997
బి) 1998
సి) 1999
డి) 2001
- View Answer
- సమాధానం:సి
45. నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి?
ఎ) ప్రణాళిక రూపకల్పనలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం
బి) వికేంద్రీకృత ప్రణాళికా విధానం అమలు
సి) ప్రాంతీయ కౌన్సిళ్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
46. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత నిధుల కేటాయింపులు ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నారు?
ఎ) కేంద్ర ఆర్థిక మంత్రి
బి) నీతి ఆయోగ్ సీఈవో
సి) రాష్ట్రాల ముఖ్యమంత్రులు
డి) ప్రణాళికా డిపార్టమెంట్
- View Answer
- సమాధానం:ఎ
47. కింది వాటిలో 2014 మే తర్వాత ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో ప్రకటించని కార్యక్రమం ఏది?
ఎ) ప్రధానమంత్రి కృషి సించాయి యోజన
బి) స్వావలంబన్
సి) పారంపరాగత్ కృషి వికాస్ యోజన
డి) స్మార్ట సిటీస్
- View Answer
- సమాధానం: బి
48. ప్రణాళిక సంఘం 2011 ఏప్రిల్లో బి.కె. చతుర్వేది కమిటీని దేని కోసం ఏర్పాటు చేసింది?
ఎ) కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో అమలవుతున్న పథకాల సమీక్ష
బి) ఖాయిలా పడిన పరిశ్రమలపై అధ్యయనం
సి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలు
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
49.పేదలకు గృహ వసతి కోసం 1999 - 2000లో ప్రారంభించిన పథకం ఏది?
ఎ) వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన
బి) రాజీవ్ ఆవాస్ యోజన
సి) సమగ్ర ఆవాస్ యోజన
డి) ఇందిరా ఆవాస్ యోజన
- View Answer
- సమాధానం: సి
50. వెనుకబడిన ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలకు పాఠశాల విద్య అందించడానికి ఉద్దేశించిన పథకం?
ఎ) జననీ సురక్షా యోజన
బి) కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ
సి) ప్రధానమంత్రి గ్రామోదయ పథకం
డి) మహిళా అభివృద్ధి యోజన
- View Answer
- సమాధానం: బి