సూక్ష్మజీవులు - బ్యాక్టీరియా
1. ట్యుబర్ క్యులోసిస్ వ్యాధి దేని వల్ల వస్తుంది?(పోలీస్ కానిస్టేబుల్-2012)
1) వైరస్
2) ప్రోటోజోవా
3) పోషకాహార లోపం
4) బ్యాక్టీరియా
- View Answer
- సమాధానం: 4
2. డయేరియాను తగ్గించడానికి వాడే ద్రావణం ORSను విస్తరించండి.(పోలీస్ కానిస్టేబుల్ -2012)
1) Oral Rehydration Solution
2) Oral Recharging Solution
3) Oral Replenishing Solution
4) Oral Reducing Solution
- View Answer
- సమాధానం: 1
3. కిందివాటిలో దేన్ని నిర్ధారించడం కోసం ‘వైడల్ పరీక్ష’ చేస్తారు? (పోలీస్ కానిస్టేబుల్ -2012)
1) మలేరియా
2) టైఫాయిడ్
3) ట్యుబర్ క్యులోసిస్
4) పచ్చజ్వరం
- View Answer
- సమాధానం: 2
4. తాజా పాలకు కొంచెం ఆమ్లత్వం ఉండటానికి కారణం? (ఎస్.ఐ. - 2012)
1) Co2 మాత్రమే
2) H2CO3 మాత్రమే
3) లాక్టిక్ బ్యాక్టీరియా మాత్రమే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
5. ఏ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ప్రత్యక్షంగా సంక్రమించదు? (ఎస్ఐ -2012)
1) తట్టు
2) ధనుర్వాతం
3) కంఠవాతం
4) ఊపిరితిత్తుల క్షయ
- View Answer
- సమాధానం: 2
6. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లని రుచి రావడానికి కారణం? (ఎస్ఐ - 2011)
1) సిట్రిక్ ఆమ్లం
2) ఎసిటిక్ ఆమ్లం
3) లాక్టిక్ ఆమ్లం
4) టార్టారిక్ ఆమ్లం
5) ఆక్సాలిక్ ఆమ్లం
- View Answer
- సమాధానం: 3
7. బ్యాక్టీరియా శుద్ధ వర్ధనం చేసిన మొదటి వ్యక్తి?
1) లూయీస్ పాశ్చర్
2) ఆంటోని వాన్ లీవెన్ హక్
3) ఎడ్వర్డ్ జెన్నర్
4) రాబర్ట్ కోచ్
- View Answer
- సమాధానం:4
8. గ్రాము సారవంతమైన మట్టిలో ఎన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి?
1) 100 మిలియన్లు
2) మిలియన్
3) 500 మిలియన్లు
4) బిలియన్ పైగా
- View Answer
- సమాధానం: 4
9. ఒక బ్యాక్టీరియా కణం ప్రతి నిమిషానికి ద్విదావిచ్ఛితి చెందుతూ ఒక కప్పును ఒక గంటలో నింపితే మొదటి సగం కప్పు నిండటానికి ఎంత సమయం పడుతుంది?
1) 15 నిమిషాలు
2) 30 నిమిషాలు
3) 59 నిమిషాలు
4) 61 నిమిషాలు
- View Answer
- సమాధానం: 3
10. బ్యాక్టీరియో ఫేజెస్ అంటే?
1) బ్యాక్టీరియాలో నివసించే వైరస్
2) బ్యాక్టీరియాపై దాడి చేసే వైరస్
3) బ్యాక్టీరియాను నాశనం చేసే వైరస్
4) వైరస్‌పై దాడి చేసే బ్యాక్టీరియా
- View Answer
- సమాధానం: 2
11. ధనుర్వాతాన్ని కలుగజేసే బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది?
1) మట్టిలో
2) నీటిలో
3) కలుషిత ఆహారంలో
4) రక్తంలో
- View Answer
- సమాధానం: 1
12. లెగ్యుమ్ మొక్కల్లో నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా ఏది?
1) నైట్రసో మోనాస్
2) నైట్రో బాక్టర్
3) రైజోబియం
4)ఆగ్రో బ్యాక్టీరియం
- View Answer
- సమాధానం: 3
13. స్టెఫిలో కోకస్లో బ్యాక్టీరియా కణాల సంఖ్య?
1) 1
2) 4
3) 8
4) అనేకం
- View Answer
- సమాధానం:4
14. విబ్రియో బ్యాక్టీరియా ఆకారం ఏది?
1) కామా
2) సర్పిలం
3) దండాకారం
4) గోళాకారం
- View Answer
- సమాధానం: 1