Skip to main content

Success Story : సొంతంగానే చ‌దివా.. గ్రూప్‌-1 కొట్టా..

ఈ మాటలే స్ఫూర్తిగా.. ‘అన్న’ మాటలనే మేలిమి బాటగా మలచుకొని, గ్రూప్-1లో విజేతగా నిలిచాడు నల్లగొండ జిల్లాకు చెందిన నూకల ఉదయ్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసిన 2011 గ్రూప్-1 ఎగ్జామ్ ఫలితాల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)- సివిల్ పోస్టును సొంతం చేసుకున్నాడు ఉదయ్.
Nukala Uday Reddy, DSP
Nukala Uday Reddy, DSP

తనను పోలీస్ అధికారిగా చూడాలనుకున్న తండ్రి, అన్నయ్యల ఆకాంక్ష మేరకు.. ‘డిప్యూటీ కలెక్టర్’ను కాదని డీఎస్పీ పోస్టుకు ప్రాధాన్యమిచ్చాడు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. 2011 గ్రూప్-1 పరీక్షలోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లినా.. సుప్రీంకోర్టు తీర్పుతో 2016లో మళ్లీ నిర్వహించిన పరీక్షలో సత్తా చాటి రెండో ర్యాంకు సాధించిన ఉదయ్‌రెడ్డి సక్సెస్ స్పీక్స్..  అతని మాటల్లోనే..

TSPSC Groups Success Tips: ఇలా చ‌దివా.. గ్రూప్‌–1లో స్టేట్ టాపర్‌గా నిలిచా..

కుటుంబ నేప‌థ్యం : 
మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. నాన్న నూకల వెంకట్‌రెడ్డి ఫంక్షన్ హాల్స్ నిర్వహిస్తున్నారు. అమ్మ పద్మ గృహిణి.

ఎడ్యుకేష‌న్ :
నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. పదో తరగతి వరకు చైతన్యపురిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదివాను. ఇంటర్ కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో, ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఇందు కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ పూర్తిచేశాను.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

వ‌చ్చిన నాలుగు ఉద్యోగాలు కాద‌ని..

DSP Story


నాకు మొదటి నుంచి అకడమిక్‌గా పెద్దగా ఆసక్తి లేదు. ఇంజనీరింగ్‌లో ప్రవేశించినప్పటి నుంచే ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) సాధించాలనే తపన ఉండేది. దీంతో ఇంజనీరింగ్ తొలి ఏడాది నుంచే సివిల్స్‌కు సన్నద్ధమయ్యాను. ఇంజనీరింగ్ పూర్తికాగానే కాసింత ఉద్యోగ అనుభవం అవసరమని ఇంట్లో వారు చెప్పడంతో ఉద్యోగంలో చేరాను. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. ఇన్ఫోటెక్‌లో కోర్ సబ్జెక్టు అయిన ఎంబెడెడ్ సిస్టమ్‌పై అవకాశం రావడంతో ఉద్యోగంలో చేరాను.

సొంతంగానే చ‌దివా..
తొమ్మిది నెలల పాటు ఉద్యోగం చేశాక.. 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. దీంతో వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రిపరేషన్ ప్రారంభించాను. ఇంజనీరింగ్‌లో చేరిన దగ్గరి నుంచే సివిల్స్‌కు సన్నద్ధమవ్వడం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని అంశాలపై పట్టు ఉండటంతో ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేశాను. సొంతంగా ప్రిపరేషన్ కొనసాగించా. ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. మెయిన్స్‌కు దీపికా మేడమ్ మార్గనిర్దేశం చేశారు. వ్యాసాలు రాసి తనకు చూపించేవాడిని. ఆమె వాటిని సరిదిద్దేవారు. అవసరమైన సూచనలు చేసేవారు.

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

ఈ పుస్తకాలే ప్రామాణికంగా..
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే ప్రామాణికంగా ప్రిపరేషన్ సాగించాను. ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు చదివేవాడిని. ఇక తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్రకు తెలుగు అకాడమీ పుస్తకాలు సేకరించుకొని అధ్యయనం చేశాను.

సిలబస్‌లోని అంశాలకు..
ప్రిపరేషన్‌కు న్యూస్ పేపర్లను బాగా ఉపయోగించుకున్నాను. రోజువారీ పరిణామాలను పరిశీలిస్తూ, వాటిని సిలబస్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించా. చాలామంది అభ్యర్థులు న్యూస్ పేపర్‌ను కొద్దిసేపు చదివి వదిలేస్తారు. నేను అలా కాకుండా.. ముఖ్యమైన వార్తలను విశ్లేషిస్తూ, సొంతంగా నోట్స్‌ను తయారు చేసుకున్నా. దీనికి చాలా సమయం అవసరమయ్యేది. ఉదాహరణకు తాజాగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మెజర్‌మెంట్స్ మారాయి. పుస్తకాల్లో వేరే సమాచారం అందుబాటులో ఉంటుంది. దీనికి తాజా సమాచారాన్ని అనుసంధానించుకుంటూ చదవడం.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

సివిల్స్ మెయిన్స్ వదిలేసి గ్రూపు-1 మెయిన్స్‌కు చదివా... కానీ
ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన గ్రూప్-1 ప్రయాణంలో విజయం సాధించానంటే దానికి ముఖ్య కారణం.. అన్నయ్య గౌతమ్‌రెడ్డి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రతిసారీ అన్నయ్య చెప్పిన మాటలు ఆ అడ్డంకులను ఎదుర్కొని, ముందుకెళ్లేందుకు తోడ్పాటునందించాయి. ఉద్యోగాల భర్తీపై కేసులు, మెయిన్స్‌ను రద్దుచేసి, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం, రాష్ట్ర‌ విభజన పరిణామాలు.. ఇలా ‘గ్రూప్-1’ అగమ్యగోచరంగా మారడంతో సివిల్స్‌పై దృష్టిసారించాను. 2015లో మెయిన్స్ రాశా. 2016లోనూ మెయిన్స్‌కు అర్హత సాధించా. కానీ, గ్రూప్-1 మెయిన్స్ రీఎగ్జామ్ కూడా అదే సమయంలో ఉండటంతో సివిల్స్ మెయిన్స్ వదిలేసి గ్రూపు-1 మెయిన్స్‌కు చదివా.

TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు..

విజయం సాధించాలంటే అత్యంత కీలకం ఇవే..

Job


గ్రూప్-1లో విజయం సాధించాలంటే రైటింగ్ అత్యంత కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఔత్సాహికులు వేగంగా రాయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. అందుబాటులో ఉన్న సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా ప్రాక్టీస్ చేయాలి. మల్టీ డైమన్షనల్ అప్రోచ్‌ను అలవరచుకోవాలి. ఉదాహరణకు నోట్ల రద్దు అంశంపై ఎస్సే రాయాల్సి వస్తే, సమాజంలోని వివిధ వర్గాల వారిని ఈ నిర్ణయం ఎలా ప్రభావితం చేసిందనే దాన్ని వివరించగలగాలి. అందుకోసం విస్తృతంగా చదవడం, టీవీల్లో వచ్చే చర్చలను పరిశీలించడం ద్వారా భిన్న కోణాల్లో అంశాన్ని విశ్లేషిస్తూ మంచి ఎస్సే రాయొచ్చు.

TSPSC Groups Preparation Plan: ఎలాంటి ఒత్తిడి.. టెన్ష‌న్ లేకుండా.. గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవ్వండిలా..

త‌ప్పనిసరి కాదు..కానీ
సివిల్స్, గ్రూప్-1కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు కోచింగ్‌కు వెళ్లడం తప్పనిసరి కాదు. వారికి కావాల్సింది కేవలం సరైన గెడైన్స్. ఇప్పటికే విజేతలుగా నిలిచిన వారి సలహాలు తీసుకొని, విజయం సాధించేందుకు కృషిచేయాలి. ఇంటర్నెట్‌లో కావాల్సినంత మెటీరియల్ అందుబాటులో ఉంది. బేసిక్స్ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివి, కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధిస్తే ఎలాంటి శిక్షణ లేకుండానే విజయం సాధించొచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. వీడియో లెక్చర్స్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

నా ఇంటర్వ్యూలో అడిగిన‌ ప్రశ్నలు..
☛ మతం, ఆధ్యాత్మికతకు మధ్య తేడాలు ఏంటి?
☛ మీ స్నేహితుల మాదిరి మీరు కూడా అమెరికా ఎందుకు వెళ్లలేదు?
☛ డీఎస్పీ పోస్టే ఎందుకు?
వీటితో పాటు పరిస్థితులకు తగినట్లు తక్షణం స్పందించే సామర్థ్యాన్ని పరీక్షించేలా కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు.

అకడమిక్ ప్రొఫైల్..
☛ పదో తరగతి: 535 మార్కులు
☛ ఇంటర్: 850 మార్కులు
☛ఇంజనీరింగ్ (ఈసీఈ): 80 శాతం మార్కులు

Groups Books: గ్రూప్స్‌ పుస్తకాల ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..: ఎ.వెంకట రమణ, గ్రూప్‌–1 విజేత

Published date : 16 May 2022 06:37PM

Photo Stories