సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడటాన్నిఏమని పిలుస్తారు?
Sakshi Education
ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది.
ప్రచండ భానుడి చుట్టూ సప్తవర్ణశోభితమైన సుందర వలయం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడి చుట్టూ రంగురంగుల ఇంద్ర ధనుస్సు(సన్‌హాలో) మే 2న మధ్యాహ్నం సుమారు గంట పాటు కనువిందు చేసింది. ఇలా సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడటాన్ని‘సన్ హాలో’లేదా ‘22 డిగ్రీ హాలో’అని పిలుస్తారు. వాతావరణంలో ఉండే లక్షలాది షట్భుజాకారపు మంచు స్ఫటికాల గుండా కాంతి ప్రయాణించినప్పుడు వక్రీభవనం చెందడం వల్ల ఈ వలయాలు ఏర్పడతాయి. సూర్యుడి చుట్టూ దాదాపు 22 డిగ్రీల వ్యాసార్థంతో వలయం ఏర్పడుతుంది కాబట్టి దీనికి ‘22 డిగ్రీ హాలో’అని పేరు. ఆకాశంలో సిర్రస్ రకం మేఘాలు ఉన్నప్పుడు సన్‌హాలో ఏర్పడే అవకాశాలు ఎక్కువ. సన్‌హాలోను ప్రజలు ‘వరదగూడు’ అని పిలుచుకుంటారు. హాలోలు ఏర్పడటం సూర్యుడికి మాత్రమే పరిమితం కాదు. రాత్రివేళల్లో జాబిల్లికీ ఏర్పడుతుంటాయి.
Published date : 04 Jun 2021 02:23PM