పీఎస్‌ఎల్‌వీ–సీ51 ప్రయోగం విజయవంతం
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ–సీ51 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది.
18 ఉపగ్రహాలు ఇవే...
పీఎస్‌ఎల్‌వీ సీ51 ద్వారా మొత్తం 18 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపారు. అవి...
యూనిటీ శాట్...
యూనిటీ శాట్‌లో శ్రీపెరంబుదూర్‌లోని జెప్పియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జిట్‌శాట్ ఉంది. అలాగే నాగపూర్‌లోని జీహెచ్ రాయ్‌సోనీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జీహెచ్‌ఆర్‌సీఈశాట్ ఉంది. ఇంకా కోయంబత్తూరులోని శ్రీ శక్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తయారు చేసిన శ్రీ శక్తిశాట్ ఉంది.
ఉపగ్రహాల ప్రయోజనాలు..
పీఎస్‌ఎల్‌వీ–సీ51 విశేషాలు...
14 మిషన్ల ప్రయోగమే లక్ష్యం: శివన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎస్‌ఎల్‌వీ–సీ51 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)
ఎక్కడ : సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్, శ్రీహరికోట, సూళ్లూరుపేట మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఎందుకు : అమెజానియా–01 ఉపగ్రహం సహా మొత్తం 21 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపేందుకు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఫిబ్రవరి 28న ఈ ప్రయోగం నిర్వహించారు. నిప్పులు చిమ్ముతూ నింగి వైపు దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ–సీ51... 1.38 గంటల వ్యవధిలో 18 ఉపగ్రహాలను భూమికి 537 నుంచి 637 కిలో మీటర్లు పరిధిలోని వివిధ సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది.
మొట్టమొదటి మిషన్...
మొట్టమొదటి మిషన్...
- పీఎస్‌ఎల్‌వీ–సీ51 ప్రయోగం ద్వారా భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యునిటీశాట్ ఉపగ్రహాలతో పాటు మొత్తం 18 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపారు.
- ఇస్రో... భారత ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ఇదే తొలిసారి.
- వాణిజ్యపరంగా మొట్టమొదటిసారిగా ఇస్రో చేపట్టిన ప్రయోగం ఇదే.
- వాణిజ్యపరమైన కార్యకలపాల కోసం ‘‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’’ను ఇస్రో ఏర్పాటు చేసింది.
18 ఉపగ్రహాలు ఇవే...
పీఎస్‌ఎల్‌వీ సీ51 ద్వారా మొత్తం 18 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపారు. అవి...
- బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01 ఉపగ్రహం.
- అమెరికాకు చెందిన స్పేస్‌బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలతో పాటు.. సాయ్–1 కాంటాక్ట్–2 అనే మరో ఉపగ్రహం ఉంది.
- డీఆర్‌డీవో రూపొందించిన సింధునేత్ర.
- స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ రూపకల్పన చేసిన సతీష్ ధవన్ శాట్.
- మూడు కళాశాలల విద్యార్థులు సంయుక్తంగా రూపొందించిన మూడు ఉపగ్రహాల కలయిక యూనిటీ శాట్.
యూనిటీ శాట్...
యూనిటీ శాట్‌లో శ్రీపెరంబుదూర్‌లోని జెప్పియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జిట్‌శాట్ ఉంది. అలాగే నాగపూర్‌లోని జీహెచ్ రాయ్‌సోనీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జీహెచ్‌ఆర్‌సీఈశాట్ ఉంది. ఇంకా కోయంబత్తూరులోని శ్రీ శక్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తయారు చేసిన శ్రీ శక్తిశాట్ ఉంది.
సతీష్‌ధవన్ శాటిలైట్‌లో...
సతీష్‌ధవన్ శాటిలైట్ ద్వారా మోదీ పేరు, ఫొటో, ‘ఆత్మనిర్భర్ మిషన్’ పదాలు, భగవద్గీత పుస్తకం, 25 వేల మంది పౌరుల పేర్ల జాబితాను అంతరిక్షంలో పంపారు. ఈ 25 వేల పేర్లలో 1000 పేర్లు విదేశీయులవి ఉన్నాయి.
సతీష్‌ధవన్ శాటిలైట్ ద్వారా మోదీ పేరు, ఫొటో, ‘ఆత్మనిర్భర్ మిషన్’ పదాలు, భగవద్గీత పుస్తకం, 25 వేల మంది పౌరుల పేర్ల జాబితాను అంతరిక్షంలో పంపారు. ఈ 25 వేల పేర్లలో 1000 పేర్లు విదేశీయులవి ఉన్నాయి.
- బ్రెజిల్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహం అమెజానియా-1. ఇది అమెజాన్ ప్రాంతంలో అటవీ సంపదను పర్యవేక్షించడానికి, బ్రెజిలియన్ భూభాగం అంతటా వైవిధ్యభరితమైన వ్యవసాయ విశ్లేషణ కోసం రిమోట్ సెన్సింగ్ డేటాను అందిస్తుంది.
- అమెరికా పంపిన 13లో ఒకటి సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహం కాగా మరో రెండు ఉపగ్రహ సమాచార మార్పిడి, డేటా రిలే కోసం ఉన్నవి.
- సతీశ్ ధవన్ శాట్ రేడియేషన్ స్థాయి, అంతరిక్ష వాతావరణ అధ్యయనంతో పాటు సుదూర కమ్యూనికేషన్ టెక్నాలజీలకు ఉపయోగపడుతుంది.
- యూనిటీ శాట్ రేడియో రిలే సేవలు అందిస్తుంది.
- డీఆర్‌డీవో రూపొందించిన సింధునేత్ర ఉపగ్రహం హిందూ మహాసముద్ర ప్రాంతంలో సైనిక, మర్చంట్ నేవీ నౌకల కార్యకలాపాలపై నిఘా పెడుతుంది. ఇది భారతదేశ వ్యూహాత్మక, వాణిజ్య ప్రయోజనాలకు కీలకమైంది.
పీఎస్‌ఎల్‌వీ–సీ51 విశేషాలు...
- పీఎస్‌ఎల్‌వీ–సీ51 పొడవు 44.4 మీటర్లు.
- ఈ రాకెట్ ప్రయోగంలో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01 ఉపగ్రహం ప్రధానమైంది. 637 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని 17.23 నిమిషాల్లో సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు.
- ఈ మిషన్‌తో ఇస్రో ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించినట్లయింది.
- పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 53వ ప్రయోగంతో షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన 78వ ప్రయోగం ఇది.
- ఈ రాకెట్ ప్రయోగాన్ని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ కెసార్ పొంటీస్ ప్రత్యక్షంగా వీక్షించారు.
14 మిషన్ల ప్రయోగమే లక్ష్యం: శివన్
- 2021 ఏడాదిలో 14 మిషన్లు ప్రయోగించాలనే లక్ష్యంతో పని చేయాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు పిలుపునిచ్చారు.
- 14 మిషన్ల ప్రయోగంలో భాగంగా 7 లాంచింగ్ వెహికల్స్, ఆరు ఉపగ్రహాలు, ఒక మానవరహిత ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎస్‌ఎల్‌వీ–సీ51 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)
ఎక్కడ : సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్, శ్రీహరికోట, సూళ్లూరుపేట మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఎందుకు : అమెజానియా–01 ఉపగ్రహం సహా మొత్తం 21 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపేందుకు
Published date : 02 Mar 2021 12:00PM