ఇత్తడి వ్యాకోచం ఇనుము కంటే ఎక్కువ..?
Sakshi Education
- వేడి గాజు పలకపై చల్లని ద్రవం పోస్తే గాజు పొరల మధ్య అసమాన సంకోచాల వల్ల అది పగిలిపోతుంది.
- గాజు పలకపై వేడి ద్రవాన్ని పోస్తే గాజు పొరల మధ్య అసమాన వ్యాకోచాల వల్ల అది పగిలిపోతుంది.
- కాంక్రీట్ రోడ్ వేసేటప్పుడు రాళ్ల మధ్యలో తగినంత ఖాళీ వదలడం వల్ల అవి స్వేచ్ఛగా సంకోచ, వ్యాకోచాలు చెందగలుగుతాయి.
- ఇన్వర్ స్టీల్‌ను వేడి చేసినా/చల్లబర్చినా సంకోచ, వ్యాకోచాలు పరిగణనలోకి తీసుకోలేనంత తక్కువగా ఉంటాయి. అందువల్ల దాన్ని శృతిదండాలు, మీటర్ స్కేల్, గోడ గడియారంలోని లోలకాల తయారీలో వాడతారు.
ద్వి లోహ ఫలక.. (బై మెటాలిక్ స్ట్రిప్ లేదా థర్మోస్టాట్)
- దీన్ని ఇనుము, ఇత్తడి ఫలకాలతో నిర్మిస్తారు.
- ఇత్తడి వ్యాకోచం ఇనుము కంటే ఎక్కువ. ఇది తన ఉష్ణోగ్రతను తానే నియంత్రించుకుంటుంది. అందువల్ల ద్విలోహ ఫలకాన్ని ఉష్ణతాపక నియంత్రక యంత్రం అని కూడా అంటారు.
- ఆటోమేటిక్ ఇస్త్రీ పెట్టెలో, ఒవెన్‌లో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి థర్మోస్టాట్‌ను ఉపయోగిస్తారు.
ద్రవ పదార్థాల వ్యాకోచం..
ద్రవాలను వేడిచేస్తే ఘనపరిమాణంలో వ్యాకోచిస్తాయి.
నీటి అసంగత వ్యాకోచం..
- నీటిని 0నిఇ నుంచి 4నిఇ వరకు వేడి చేస్తే వ్యాకోచానికి బదులు సంకోచిస్తుంది. 4నిఇ తర్వాత అన్ని ద్రవ పదార్థాల మాదిరిగా వ్యాకోచిస్తుంది. నీరు ప్రదర్శించే ఈ అసాధారణ ధర్మాన్ని అసంగత వ్యాకోచం అంటారు.
(లేదా)
4నిఇ వద్ద నీటిని వేడిచేసినా, చల్లార్చినా వ్యాకోచిస్తుంది. ఈ ధర్మాన్ని అసంగత వ్యాకోచం అంటారు.
- అసంగత వ్యాకోచం వల్ల 4నిఇ వద్ద నీటికి కనిష్ట ఘనపరిమాణం, గరిష్ట సాంద్రత ఉంటాయి.
- ఈ ధర్మం వల్ల మంచు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది.
- నీటి అసంగత వ్యాకోచాన్ని సంకోచించే ఘనపదార్థాల స్వభావంతో పోల్చవచ్చు. ఉదా: ప్లాస్టిక్ వస్తువులు, రబ్బర్, ఫ్యూజ్ తీగ
- ఒక పాత్రలో 0నిఇ వద్ద కొంత మట్టం వరకు నీటిని పోసి దానిపై ఒక చెక్క దిమ్మెను అమర్చారు. ఈ నీటిని వేడి చేస్తే 4నిఇ వరకు నీరు సంకోచించడం వల్ల దాని మట్టం తగ్గుతుంది. తద్వారా చెక్క దిమ్మె కింది వైపునకు స్థానభ్రంశం పొందుతుంది. 4నిఇ తర్వాత నీరు వ్యాకోచించడం వల్ల చెక్కదిమ్మె ఊర్ధ్వ దిశలో స్థానభ్రంశం చెందుతుంది.
- 4నిఇ ఉష్ణోగ్రత ఉన్న నీటిని సమాన ఘనపరిమాణాలు గల రెండు పాత్రల్లో దాదాపు నిండుగా నింపారు. ఈ రెండు పాత్రల్లో మొదటి పాత్రను వేడి చేసినా లేదా రెండో పాత్రను చల్లబర్చినా అసంగత వ్యాకోచం వల్ల నీరు వ్యాకోచించి బయటకు పొర్లిపోతుంది.
- నీటి అసంగత వ్యాకోచాన్ని ఈజీ ్చ్టౌఝ్ఛ్ట్ఛట అనే పరికరంతో కొలుస్తారు. నీటికి గల ఈ ధర్మాన్ని నిరూపించడానికి హోప్ పరికరాన్ని ఉపయోగిస్తారు.
అనువర్తనాలు:
- అతి శీతల ప్రాంతాల్లో జలచరాలు బతకడానికి కారణం నీటి అసంగత వ్యాకోచం. మంచు ఏర్పడిన చెరువు అడుగు భాగంలో కనీస ఉష్ణోగ్రత 4నిఇ. మంచు పొర కింద కనీస ఉష్ణోగ్రత 0నిఇ.
- చలికాలంలో వాహన రేడియేటర్లలోని నీరు అసంగత వ్యాకోచం వల్ల వ్యాకోచించి రేడియేటర్‌ను పగులగొట్టుకొని బయటకు వస్తుంది. అందువల్ల ఈ ధర్మాన్ని తగ్గించడానికి నీటిలో ఇథైల్ గ్లైకాల్ ద్రావణాన్ని నింపుతారు.
- చలి ప్రదేశాల్లోని భూగర్భ పైపులు నీటి అసంగత వ్యాకోచం వల్ల పగిలిపోతాయి. దీన్ని నివారించేందుకు పైపులకు నలుపు రంగు వేస్తారు. ఈ రంగు.. పరిసరాల్లోని ఉష్ణాన్ని గ్రహించి నీటి అసంగత వ్యాకోచాన్ని తగ్గిస్తుంది.
చలికాలంలో నల్లరేగడి నేలలు బీటలు వారడానికి కారణం నీటి అసంగత వ్యాకోచం.
ప్రకృతిలో శిలల శైథిల్యానికి గల అనేక కార ణాల్లో నీటి అసంగత వ్యాకోచం కూడా ఒకటి.
వాయువుల వ్యాకోచం:
- వాయువుల్లో అణువుల మధ్య బంధ దూరం అనంతం. అందువల్ల వీటిని వేడి చేసినప్పుడు ఘన, ద్రవ పదార్థాల కన్నా అనేక రెట్లు ఎక్కువ వ్యాకోచిస్తాయి. మనకు లభిస్తున్న అన్ని వాయువుల ఉష్ణవ్యాకోచం ఒకేలా అంటే సమానంగా ఉంటుంది.
ఉదా: వేసవిలో వాహనాల టైర్లలో గాలి వ్యాకోచించడం వల్ల అవి పగులుతాయి.
Published date : 04 Feb 2021 03:38PM