Skip to main content

ఈసీజీ ఆఫ్‌ ఇండియన్‌ ఓషన్‌ అని  ఏ యుద్ధనౌకను పిలుస్తారు

అధునాతన సాంకేతికత కలిగిన సముద్ర నిఘా గూఢచారి యుద్ధనౌక ‘‘ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌’’ త్వరలో భారత నావికాదళంలో చేరనుంది.రూ.1,500 కోట్ల వ్యయంతో <strong>విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌ యార్డు (హెచ్‌ఎస్‌ఎల్‌)లో</strong> ఈ నౌకను అభివృద్ధి చేశారు.
విభిన్న సాంకేతికతతో అత్యంత రహస్యంగా రూపొందించిన ధ్రువ్ అత్యంత కచ్చితత్వంతో శత్రు క్షిపణుల్ని గుర్తించగలదు. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు, ఇండియన్‌ నేవీ ఇంజినీర్లు, నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీఆర్‌వో) శాస్త్రవేత్తలు, హిందుస్థాన్‌ షిప్‌యార్డు (హెచ్‌ఎస్‌ఎల్‌) నిపుణులు ఈ నౌక నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు.

ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌ గురించి..
.
  • అనేక మిషన్లను ఒంటిచేత్తో పూర్తి చేయగల సామర్థ్యం ధ్రువ్‌ దీని సొంతం.
  • భారత్ తన శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్‌తో పాటు ఇతర భూభాగాల నుంచి మిసైల్స్‌ ప్రయోగిస్తే.. వాటిని ధ్రువ్‌ ద్వారా ట్రాక్‌ చేయవచ్చు.
  • ట్రాక్ చేసిన మిసైల్స్‌ను ఏ ప్రాంతంలో ధ్వంసం చేస్తే.. దేశానికి మేలు జరుగుతుందన్న విస్తృత సమాచారాన్ని రక్షణ శాఖకు అందించగలదు.
  • సాధారణ మిసైల్స్‌తో పాటు న్యూక్లియర్‌ మిసైల్స్‌ జాడల్ని కూడా సులభంగా గుర్తించే సాంకేతికతను కలిగి ఉంది.
  • దేశం మొత్తం ఎప్పటికప్పుడు నిశిత పరిశీలన చేసే శాటిలైట్‌ మోనిటర్లను ఇందులో ఏర్పాటు చేశారు.
  • ఈ నౌక నిర్మాణంతో అత్యాధునిక అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న పీ–5 దేశాల సరసన భారత్‌ చేరింది. ఇప్పటివరకూ ఈ తరహా టెక్నాలజీ నౌకలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ దేశాలకు మాత్రమే ఉన్నాయి.
  • ఈ యుద్ధనౌకను ఈసీజీ ఆఫ్‌ ఇండియన్‌ ఓషన్‌అని పిలుస్తున్నారు.
  • దీని తయారీని 2015లో ప్రారంభించారు. 2020 అక్టోబర్‌లో నౌక నిర్మాణం పూర్తయింది.
  • హిందుస్థాన్‌ షిప్‌యార్డులో నిర్మితమైన అతి భారీ నౌక ఇదే. అత్యంత రహస్యంగా దీని నిర్మాణం పూర్తి చేశారు.ఇప్పటివరకు వీసీ–11184 పేరుతో ఈ నౌకను పిలిచారు.
  • ఇందులో సెన్సార్లతో కూడిన ‘త్రీ డోమ్‌ షేప్‌డ్‌ సర్వైవలెన్స్‌ సిస్టమ్‌’ ఏర్పాటు చేశారు.
  • నౌకలో ఎలక్ట్రానికల్లీస్కాన్డ్‌ ఎరే రాడార్స్‌ టెక్నాలజీ వినియోగించారు. దీని ద్వారా 14 మెగావాట్ల విద్యుత్‌ను సైతం ఉత్పత్తి చేయొచ్చు.

ధ్రువ్‌ స్వరూపమిదీ..
 

నౌక పొడవు

175 మీటర్లు (570 అడుగులు)

బీమ్‌

22 మీటర్లు

డెప్త్‌

6 మీటర్లు

గరిష్ట వేగం

21 నాటికల్‌ మైళ్లు

ఇంజిన్‌ పవర్‌

9 వేల కిలోవాట్లు

మొత్తం ఇంజిన్లు

02

ఆక్సిలరీ జనరేటర్లు

03 (ఒక్కొక్కటీ 1200కిలోవాట్ల సామర్థ్యం)

నౌక నిర్మాణానికి వినియోగించిన ఉక్కు

10 వేల టన్నులు

షిప్‌ బరువు

15 వేల టన్నులు

ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్లు

1 హెలికాప్టర్‌


క్విక్‌ రివ్యూ :
ఏమిటి : త్వరలో భారత నావికాదళంలో చేరనున్న అధునాతనయుధ్ధనౌక
ఎప్పుడు : ఏప్రిల్‌ 26
ఎవరు : ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌’
ఎక్కడ : విశాఖపట్నం
ఎందుకు:శత్రుదేశాల క్షిపణుల్నిఅత్యంత కచ్చితత్వంతో గుర్తించేందుకు...
Published date : 27 Apr 2021 05:54PM

Photo Stories