భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షులు ఆరుగురే..!
Sakshi Education
ఢిల్లీలో జరగబోయే గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వస్తున్న సంగతి తెలిసిందే.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లవుతున్నా ఇంతవరకూ కేవలం ఆరుగురు అమెరికా అధ్యక్షులే భారత్‌ను సందర్శించారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. స్వాతంత్య్రం తరువాత పాకిస్తాన్ అమెరికా కూటమిలో చేరడం, 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం, ఇందిరాగాంధీ హయాంలో అణుపరీక్షలు జరపడం అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించాయి. క్రమంగా అమెరికాతో సంబంధాలు బలపడ్డాయి. 2008లో ఇరుదేశాల మధ్యకుదిరిన అణుఒప్పందం సంబంధాలను శిఖరాగ్రస్థాయికి చేర్చింది. ఆసియాలో చైనాను నిలువరించడంలో భాగంగా అమెరికా వ్యూహాత్మకంగా భారత్‌తో చెలిమికి ప్రాధాన్యం ఇస్తోంది. ఒబామా భారత్‌కు రానుండటం ఇది రెండోసారి కావడం విశేషం.
Published date : 22 Jan 2015 03:30PM