YSR Rythu Bharosa Centres: రైతు భరోసా కేంద్రాలు..వీటి ఉపయోగాలు
Sakshi Education
రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా వ్యవసాయ సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
YSR Rythu Bharosa Centres
ఈ భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగులమందులు నుంచి పంట అమ్మకం వరకు సూచనలు, సలహాలు అందిస్తాయి. పంటరుణాలు, ఇన్య్సూరెన్స్, గిట్టుబాటు ధరలు కల్పించేలా పనిచేస్తాయి. రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీలలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వివిధ మేగజైన్లు, పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. వైఎస్సార్ రైతు భరోసా అనే మాస పత్రిక కూడా రైతులకు సహాయకారిగా ఉండేందుకు ప్రభుత్వం ప్రారంభించింది. దీనిలో భాగంగా ఆర్‌బీకే చానల్ కూడా రైతుల్లో సాగు నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రారంభించారు. దీనిలో ప్రసారమయ్యే కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా నేరుగా మొబైల్ ఫోన్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి.