సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం
Sakshi Education
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరుపుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా కొబ్బరికాయ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ రోజు లక్ష్యం. ఈ రోజు ఆసియా, పసిఫిక్ కొబ్బరి సంఘం (ఎపీసీసీ) సభ్య దేశాల్లో కొబ్బరి పరిశ్రమలో పెట్టుబడులను పెరిగేలా చేసి అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. కొబ్బరికాయల ఉపయోగాలను ప్రచారం చేయడానికి ఈ రోజును పాటిస్తారు.
చరిత్ర:
- ఏపీసీసీ స్థాపించిన రోజుకు గుర్తుగా ఆ రోజును ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (UN-ESCAP) ఆధ్వర్యంలో ఈ సంఘం పనిచేస్తుంది.
- ఈ రంగంలో విధానాలను వివరించడానికి, కార్యాచరణ ప్రణాళికను వ్యక్తీకరించడానికి కొబ్బరి దినోత్సవం ప్రారంభించారు.
Published date : 17 Sep 2020 04:20PM