సాయుధ దళాల జెండా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
Sakshi Education
సాయుధ దళాల జెండా దినోత్సవం లేదా భారత పతాక దినోత్సవం భారత సాయుధ దళాల సిబ్బంది సంక్షేమం కోసం ప్రజల నుంచి నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసిన రోజు ఇది.
సాయుధ దళాల జెండా దినోత్సవం, జెండాల పంపిణీ ద్వారా నిధుల సేకరణ. మిలటరీలో పనిచేసి రిటైర్ అయినవారు, ప్రస్తుతం సేవలందిస్తున్న, దేశానికి సేవలో మరణించిన వారిపై తమ అభిమానాన్ని చాటేందుకు వేదికగా ఈ రోజు ఉపయోగపడుతుంది.
ఈ దినోత్సవాన్ని 1949 నుంచి ఏటా డిసెంబర్ 7న నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా, ఈ రోజును భారత సైనికులు, నావికులు, ఎయిర్‌మెన్‌లను స్మరించుకోవడం కోసం గౌరవంగా ఏర్పాటు చేశారు.
జెండా దినోత్సవం ప్రధానంగా మూడు ప్రాథమిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది..
- యుద్ధ ప్రమాదాల పునరావాసం
- సేవలందించే సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమం.
- మాజీ సైనికులు, వారి కుటుంబాల పునరావాసం, సంక్షేమం.
సాయుధ దళాల జెండా దినోత్సవం, జెండాల పంపిణీ ద్వారా నిధుల సేకరణ. మిలటరీలో పనిచేసి రిటైర్ అయినవారు, ప్రస్తుతం సేవలందిస్తున్న, దేశానికి సేవలో మరణించిన వారిపై తమ అభిమానాన్ని చాటేందుకు వేదికగా ఈ రోజు ఉపయోగపడుతుంది.
Published date : 17 Dec 2020 02:47PM