ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
Sakshi Education
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 27న పాటిస్తారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2020 ప్రపంచవ్యాప్తంగా పర్యాటక పాత్ర గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను ప్రోత్సహించడానికి కూడా హామీ ఇస్తుంది.
థీమ్:
ప్రపంచ పర్యాటక దినోత్సవం 2020 థీమ్ ‘పర్యాటక, గ్రామీణాభివృద్ధి’. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగంలో ఎక్కువ గ్రామాల్లో ఉపాధి, అవకాశాలను పెంపొందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. కోవిడ్ -19 మహమ్మారి వల్ల పర్యాటకం తీవ్రంగా దెబ్బతింది.
చరిత్ర:
- ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి 27 సెప్టెంబర్ 1980న నిర్ణయించింది. ప్రపంచ పర్యాటక సంస్థ రాజ్యాంగం 1970లో ఆమోదం పొందడం వల్ల ఈ రోజును ఎంపిక చేశారు.
- ప్రపంచ పర్యాటక దినోత్సవం 2020 థీమ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు, మహిళలకు అవకాశాలను పెంపొందిస్తుంది.
Published date : 17 Nov 2020 12:33PM