ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
Sakshi Education
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని పాటిస్తారు.
గర్భనిరోధక పద్ధతులపై అవగాహన పెంచడం, పురుషులు, మహిళలు వారి లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం గురించి సరైన అవగాహన, సమాచారం పొందేలా చేయడానికి ఈ రోజు లక్ష్యంగా పెట్టుకుంది.
వివిధ గర్భనిరోధక పద్ధతులు..
- గర్భనిరోధకాన్ని సాధారణంగా జనన నియంత్రణ అంటారు. ఇది గర్భం రాకుండా ఉండటానికి అనుసరించే పద్ధతి లేదా ప్రక్రియ. పురుషులు, మహిళలకు అందుబాటులో ఉన్న గర్భనిరోధక పద్ధతులు ఇవి..
- కండోమ్స్
- గర్భనిరోధక ఇంజెక్షన్
- గర్భనిరోధక పాచ్
- జనన నియంత్రణ మాత్రలు
చరిత్ర:
ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని మొదటిసారిగా 26 సెప్టెంబర్ 2007న పాటించారు. లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం పట్ల ఆసక్తి ఉన్న 15 అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, శాస్త్రీయ, వైద్య సంఘాల సంకీర్ణానికి ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం మద్దతు ఇస్తుంది. దీనిని బేయర్ ఏజీ స్పాన్సర్ చేస్తుంది.
Published date : 23 Oct 2020 04:03PM