మే 07న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం
Sakshi Education
ప్రతి ఏడాది మే 07 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం జరుపుకుంటారు.

ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్) ప్రవేశపెట్టింది. దీన్ని ఐఏఏఎఫ్ సామాజిక బాధ్యతయుతమైన ప్రాజెక్ట్ గా తీసుకుంది. అథ్లెటిక్స్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ అనేది ఐఏఏఎఫ్ నినాదం.
ప్రస్తతం యువతలో ఊబకాయానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువ అవ్వడం, శ్రామిక శ్రమ లేకపోవటంతో ప్రజలకు, యువతకు ఫిట్‌నెస్‌పై అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవాన్ని ఐఏఏఎఫ్ ఏర్పాటు చేసింది.
ఆగ్యకరమైన జీవనశైలిపై, శారీరక దృఢత్వం పై అవగాహన కలిగించడమే ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం. ఈ దినోత్సవం రోజున అథ్లెటిక్స్ పోటీలు, ట్రాక్ అండ్ ఫీల్డ్, రోడ్ రన్నింగ్, రేస్ వాకింగ్, క్రాస్ కంట్రీ రన్నింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
చరిత్ర:
1996లో మొట్టమొదటి ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్) అధ్యక్షుడు ప్రిమో నెబియో ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది, స్పాన్సర్ చేసేది కూడా ఐఏఏఎఫ్. 1992 జూలై 17న స్టాక్‌హోమ్ (స్వీడన్)లో ఐఏఏఎఫ్ ని స్థాపించారు. ప్రజలకు, యువతకు అథ్లెటిక్స్‌పై అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రోజును ప్రవేశ పెట్టారు.
ఆవశక్యత:
మొదట ఐఏఏఎఫ్ సమాఖ్యలకు అనుబంధంగా ఉన్న క్లబ్‌లలో సభ్యులుగా ఉన్న పిల్లలను లక్ష్యంగా ఈ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించింది. తదుపరి పాఠశాల పిల్లలను పాల్గోనేలా ప్రాజెక్ట్ పరిధిని విస్తరించింది. యువతకు క్రీడల పట్ట ఆసక్తి కలిగేలా ప్రోత్సహించడం, పాఠశాల స్థాయిలోనూ, వివిధ సంస్థల్లోనూ అథ్లెటిక్స్ క్రీడలను ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల్లో అథ్లెటిక్స్‌కి ప్రాముఖ్యతనిచ్చే క్రీడగా ఉండేలా చేయడం వంటివి ఈ దినోత్సవ లక్ష్యాలు. ఇప్పటి వరకు ఐఏఏఎఫ్ అథ్లెటిక్స్ దినోత్సవ లక్ష్యాలు విజయవంతమయ్యాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో కూడా చాలా వరకు సఫలమైంది. ప్రస్తుతం ఈ అథ్లెటిక్స్ క్రీడల్లో 100కు పైగా దేశాలు పాల్గొంటున్నాయి.

Published date : 06 May 2020 06:44PM