Skip to main content

క్విట్ ఇండియా దినోత్సవాన్ని ఎప్పుడు జ‌రుపుకుంటారు?

ప్రతి సంవత్సరం ఆగస్టు 9న క్విట్ ఇండియా దినోత్సవం జరుపుకుంటారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్యమైన ఉద్యమాన్ని ఈ రోజు గుర్తు చేస్తుంది. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించే రోజును జరుపుకుంటారు.

క్విట్ ఇండియా ఉద్యమం:

  1.  క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఇండియా ఆగస్టు ఉద్యమం లేదా భారత్ చోడో ఆందోళ‌న్ అని కూడా పిలుస్తారు. రెండో ప్రపంచ యుద్ధం స‌మ‌యంలో 1942 ఆగస్టు 8న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసీసీ) బొంబాయి సమావేశంలో మహాత్మా గాంధీ దీన్ని ప్రారంభించారు.
  2.  ఈ ఉద్యమం భారతదేశం నుండి "యాన్ ఆర్డర్లీ బ్రిటిష్ ఉపసంహరణ"ను డిమాండ్ చేసింది. ఈ ఉద్యమం ఆగస్టులో జర‌గడం వ‌ల్ల దీన్ని ఆగస్టు క్రాంతి లేదా ఆగస్టు ఉద్యమం అని కూడా పిలుస్తారు.
  3. ఉద్యమంలో పాల్గొన్నందుకు 1,00,000పైగా మందిని అరెస్టు చేశారు. ఈ ఆందోళనను అణిచివేసేందుకు ప్రభుత్వం హింసను ప్రేరేపించింది.
  4.     1944లో బ్రిటిష్ వారు వెంటనే స్వాతంత్ర్యం ఇవ్వడానికి నిరాకరించి ఉద్యమాన్ని అణిచివేశారు. క్విట్ ఇండియా ఉద్యమం తరువాత, వ‌ర‌ల్డ్ వార్ ముగిసిన తర్వాతే స్వాతంత్ర్యం లభిస్తుందని తెలిపారు.
Published date : 28 Aug 2020 02:58PM

Photo Stories