Skip to main content

జూలై 23 న జాతీయ ప్రసార దినోత్సవం

భారతదేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారం 23 జూలై 1927న బొంబాయి స్టేషన్ నుంచి జ‌రిగింది. అప్పటి ప్రైవేట్ సంస్థ అయిన ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (ఐబీసీ) ఈ ప్రసారం చేసింది. అందుకే జూలై 23ను జాతీయ ప్ర‌సార దినోత్సవంగా జ‌రుపుకుంటారు.

రేడియో ప్రసారం:
  • రేడియో ప్రసారం 1923 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది రేడియో క్లబ్ ఆఫ్ బాంబే కింద ఉండేది. ఆల్ ఇండియా రేడియోను అధికారికంగా 1956 నుంచి ఆకాశ్వాని అని పిలుస్తున్నారు. ఇది ప్రసార‌ భారతి సంబంధించిన ఒక విభాగం.
  • దీన్ని 1930 సంవత్సరంలో స్థాపించారు. జూన్ 8, 1936న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ (ISBS) ఆల్ ఇండియా రేడియో (AIR)గా మారింది. ప్రస్తుతం, AIR ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ప్రసార సంస్థలలో ఒకటి.
ప్రసార భారతి:
ప్రసార భారతి భారతదేశపు అతిపెద్ద ప్రజా ప్రసార సంస్థ. ఇది పార్లమెంటు ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్త సంస్థ. ఇది దూరదర్శన్ టెలివిజన్ నెట్‌వర్క్‌, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా యూనిట్లను స‌మ‌న్వయం చేస్తుంది.
Published date : 06 Aug 2020 03:07PM

Photo Stories