Skip to main content

జాతీయ‌ సుపరిపాలన దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటారు. సుపరిపాలన దినోత్సవం 2014లో ఏర్పాటు చేశారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి (25 డిసెంబర్ 1924 - 16 ఆగస్టు 2018) భారత ప్రధానమంత్రిగా మూడు పర్యాయాలు పనిచేశారు. మొదట 1996లో 13 రోజుల కాలానికి, తరువాత 1998 నుండి 1999 వరకు 13 నెలల కాలానికి, తరువాత 1999 నుండి 2004 వరకు ఐదేళ్లు ప‌ని చేశారు.

ముఖ్య విష‌యాలు:

  • ఆయ‌న‌ కవిగా, రచయితగా కూడా ప్రసిద్ది చెందారు.
  • లోక్‌సభకు పదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికైన ఆయన ఐదు దశాబ్దాలుగా భారత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.
  • ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో 1998 లో భారతదేశం పోఖ్రాన్ -2 అణు పరీక్షలను నిర్వహించింది.
  • పాకిస్తాన్‌తో 1999 కార్గిల్ యుద్ధం తరువాత, అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌తో స‌మావేశం ఏర్పాటు చేసి స‌త్సంధాల నెర‌ప‌డానికి, ఆగ్రాలో జ‌రిగిన‌ ఒక శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించాడు.
  • 2015లో ఆయనకు భారత అత్యున్నత పౌర గౌరవం భారత్ రత్నను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు.
  • వయసు సంబంధిత అనారోగ్యంతో 16 ఆగస్టు 2018న మరణించారు.
Published date : 16 Jan 2021 04:31PM

Photo Stories