Skip to main content

ఏప్రిల్ 5న జాతీయ స‌ముద్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు

భార‌త‌దేశంలో ఏప్రిల్ 5న జాతీయ స‌ముద్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు. ఖండాంత‌ర వాణిజ్యం, ప్ర‌పంచ‌పు వాణిజ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేలా అవ‌గాహ‌న క‌ల్పించ‌ట‌మే ఈ దినోత్స‌వం ముఖ్యోద్దేశం. ప్ర‌పంచంలో ఒక ప్ర‌దేశం నుంచి మ‌రొక ప్ర‌దేశానికి ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌తిస్పంద‌న‌ల ఆధారంగా చేసే అత్యంత సుర‌క్షితమైన స‌ముద్ర ర‌వాణ వాణిజ్యం.

థీమ్‌: ఈ ఏడాది 57వ జాతీయ స‌ముద్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకున్నారు. "స్టిర‌మైన గ్ర‌హం కోసం సామ‌ర్థ్య‌వంత‌మైన ఓడ‌లు”, అనేది ఈ ఏడాది థీమ్‌. ఐక్య‌రాజ్య స‌మితి సుస్థిర లక్ష్యాలు సాధించ‌డ‌మే ఈ థీమ్ లక్ష్యం. అంత‌ర్జాతీయ మారిటైం ఆర్గ‌నైజేష‌న్, దాని సభ్య దేశాలు త‌మ ల‌క్ష్యాల‌ను సాధించ‌డానికి ఎటువంటి చ‌ర్యలు తీసుకోవాలో ఈ థీమ్ వివ‌రిస్తోంది.

చ‌రిత్ర‌: 1964వ సంవ‌త్స‌రం నుంచి జాతీయ స‌ముద్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న‌ట్లు గుర్తించారు. ఏప్రిల్ 5, 1919వ స‌వ‌త్స‌రం నుంచి భార‌త‌దేశంలో నావిగేష‌న్ చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది. థి సింధియా స్టీమ్ నావిగేష‌న్ కంపెనీ లిమిటెడ్‌కి చెందిన మొదటి ఎస్ఎస్ లాయ‌ల్టీ ఓడ ముంబై నుండి యూనైటెడ్ కింగ్‌డ‌మ్‌కి ప్ర‌యాణించింది. అదే స‌మ‌యంలో స‌ముద్ర మార్గాల‌న్ని బ్రిటిష్ వారి నియంత్ర‌ణ‌లో ఉన్నాయి. అందువ‌ల్ల ఈ ఓడ ప్ర‌యాణం భార‌త‌దేశ షిప్పింగ్ చ‌రిత్ర‌లో ఎర్ర అక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ రోజు. అందువ‌ల్ల ఈ రోజును ఖండాంత‌ర వాణిజ్యన్ని మ‌రింత బ‌లోపేతం చేసి, ప్ర‌పంచ ఆర్థికవ్య‌వ‌స్థ‌కు మ‌ద్ద‌తు ఇచ్చేలా అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం ఈ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు.
Published date : 17 Apr 2020 05:01PM

Photo Stories