Skip to main content

ఏప్రిల్ 29న అత‌ర్జాతీయ నృత్య దినోత్సవం

ప్ర‌తి ఏడాది ఏ్రప్రిల్ 29న అత‌ర్జాతీయ నృత్య దినోత్సవం జ‌రుపుకుంటారు.
1982లో క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు భాగ‌స్వామి అయిన ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ), సాంస్కృతిక సంస్థ(యునెస్కో), అంత‌ర్జాతీయ‌ థియేట‌ర్ ఇన్‌స్టిట్యూట్ కి చెందిన నృత్య క‌మిటీ ఈ అంత‌ర్జాతీయ నృత్య దినోత్సవాన్ని సృష్టించింది.

ప్రాముఖ్య‌త‌:
నృత్యానికి త‌గిన ప్రోత్సాహం, గుర్తింపు రావ‌డం కోసం ఈ రోజును జ‌రుపుకుంటారు. మ‌న దేశ‌ఆర్థిక వృద్ధికి ఈ క‌ళలు ఏవిధంగా దోహ‌ద‌ప‌డ‌తాయో ప్ర‌భుత్వాలు, రాజ‌కీయ నాయ‌కులు, సంస్థలు , స‌మాజం వాటి సామ‌ర్థ్యాన్ని గుర్తించేలా చేయ‌మే ఈ దినోత్స‌వం ముఖ్యోద్దేశం. ప్ర‌తి ఏడాది నృత్యకారులు మరియు నాట్య సంఘాలు ఈ దినోత్స‌వంను ఘ‌నంగా జ‌రుపుకుంటారు. క‌ళ‌లకు ప్రోత్స‌హం ల‌భించేలా ప్ర‌పంచ దృష్టిని ఆకర్షించ‌డానికి నాట్య సంఘాల‌కు ఇది చాలా ముఖ్య‌మైన రోజు.

ల‌క్ష్యాలు:
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వివిధ నృత్యాల‌ను ప్రోత్స‌హించ‌డానికి వాటికి త‌గిన గుర్తిం పు ల‌భించేలా చూడ‌డం. ప్ర‌భుత్వాలు, రాజ‌కీయ‌నాయ‌కుల దృష్టికి తీసుకోవ‌చ్చేలా చేయ‌డమే కాక ప్ర‌జ‌లు, స‌మాజం నృత్య క‌ళ‌ల‌ను ప్రోత్స‌హించేలా చేయ‌డం. ఈ ఏడాది 2020 అంత‌ర్జాతీయ నృత్య దినోత్సవాన్ని కోవిడ్ -19 లాక్‌డౌన్ కార‌ణంగా బ‌య‌ట‌కి వెళ్ల‌వ‌ద్దు, ఇంట్లో సుర‌క్షితంగా ఉండండి అంటూ నాట్యకారులు వివిధ నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగిస్తోన్నారు. అంతేకాదు ఈ ఏడాది అంత‌ర్జాతీయ నృత్య దినోత్స‌వాన్ని త‌మ కుటుంబ స‌భ్యుల‌తో , స్నేహితుల‌తో ఆనందంగా జ‌రుపుకోండి అని పిలుపునిస్తున్నారు.
Published date : 29 Apr 2020 07:53PM

Photo Stories