Skip to main content

భారత నావికాదళ దినోత్సవం

భారత నావికాదళ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 4న త్రివిధ దళాధిపతులు ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులర్పించారు.
దేశ రక్షణలో నేవీ సిబ్బంది నిబద్ధత అద్భుతమైనది అని నౌకాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో నేవీ డే విన్యాసాలు ఈ ఏడాది నిరాడంబరంగా జరిగాయి. వేడుకలు, నేవీ విన్యాసాలు రద్దయ్యాయి. నేవీ డే సందర్భంగా విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం పలు సాహస విన్యాసాలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్‌గా అతుల్‌కుమార్ జైన్ ఉన్నారు.

నేవీ డే-2020 థీమ్: ‘ఇండియన్ నేవీ కంబాట్ రెడీ, క్రెడిబుల్ & కొహెసివ్’

నేవీ డే కథ...
బంగ్లాదేశ్ విమోచన అంశం ప్రధాన కారణంగా భారత్-పాక్ మధ్య 1971 డిసెంబర్ 3న మొదలైన యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో డిసెంబర్ 4న పాకిస్తాన్ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచీ నౌకా స్థావరాన్ని భారత పశ్చిమ నౌకాదళం ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో నాశనం చేసింది. ఈ అద్భుత విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న ‘భారత నౌకాదళ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. 17వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి, ఛత్రపతి శివాజీ భోంస్లేను ‘భారత నావికా పితామహుడి‘గా భావిస్తారు.

చదవండి: ప్రస్తుతం సైనిక దళాల ప్రధాన అధికారిగా ఎవరు ఉన్నారు? వైమానిక దళ అధిపతి ఎవరు?
Published date : 05 Dec 2020 06:00PM

Photo Stories