Skip to main content

అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

ఐక్యరాజ్యసమితి (యుఎన్), అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలు ఏటా డిసెంబర్ 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని జరుపుకుంటాయి.

 పర్వత ప్రాంతాలను రక్షించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ప్రపంచ జనాభాలో పర్వత ప్రాంతాల్లోనే 15% ఉన్నారు. ప్రపంచంలోని జీవ వైవిధ్య హాట్‌స్పాట్లలో సగానికి పైగా అక్కడే ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 15లో పర్వతాల రక్షణ కూడా ఒక ముఖ్య భాగం. ఈ సంవత్సరం, "పర్వత జీవవైవిధ్యం" అనే థీమ్‌తో అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని నిర్వహించారు.

ముఖ్య విష‌యాలు:

  • మొట్టమొదటి అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని 2003లో జరుపుకున్నారు. పర్వత ప్రాంతాలు, వాటి రక్షణ చర్యలు పెర‌గ‌వ‌ల‌సిన ఆవ‌శ్యక‌త, 2002లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్వత ప్రాంతాలు దినోత్సవాన్ని ప్రక‌టించేలా చేసింది.
  • 1992లో ఐక్యరాజ్యసమితి "మేనేజింగ్ ఫ్రాగిల్ ఎకోసిస్టమ్స్: సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్‌మెంట్‌"ను స్వీకరించింది. పర్యావరణం, అభివృద్ధిపై సమావేశం "అజెండా 21" కార్యాచరణ ప్రణాళికలో ఇది భాగం.
  • ఎస్‌డీజీ 15 గోల్‌ 4 పర్వత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి అంకితం చేశారు. అలాగే 2021 నుంచి 2030 వరకు దశాబ్దం పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం ఐక్యరాజ్యసమితి దశాబ్దంగా ప్రకటించబడింది. ఇందులో పర్వత పర్యావరణ వ్యవస్థలు కూడా ఉన్నాయి.
  • బయోలాజికల్ డైవర్సిటీ కన్వెన్షన్ (సిఓపి 15) కు సంబంధించి జ‌రిగిన పదిహేనో సమావేశంలో నిర్ణయించిన ప్రకారం 2020 తరువాత ప్రపంచ జీవవైవిధ్యానికి సంబంధించి ప్రభుత్వాలు ఫ్రేమ్ వ‌ర్క్‌కు సిద్ధం కావాల్సి ఉంది. ఈ చర్యలు పర్వతాలను రక్షించడంలో సహాయపడతాయి.
  • ఐక్యరాజ్యసమితి ప్రకారం, ప్రపంచంలోని 80% ఆహారాన్ని అందించే 20 పంటలలో, ఆరు పర్వత ప్రాంతాలలో ఉన్నాయి. అవి బంగాళాదుంపలు, బార్లీ, టమోటాలు, బార్లీ, జొన్న మరియు ఆపిల్‌.
  • మానవులలో సగానికి పైగా పర్వతాల నుంచి వ‌చ్చే మంచినీటిపైనే ఆధారపడతారు. ప్రపంచంలోని కీలకమైన జీవ వైవిధ్య ప్రాంతాల్లో 30% పైగా పర్వత ప్రాంతాలలో ఉన్నాయి. వాతావరణ మార్పు, అధిక అభివృద్ధి కారణంగా పర్వత ప్రాంతాలకు ఎక్కువగా ముప్పు పొంచి ఉన్నాయి.
  • ఆల్పైన్, హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయి. అందువల్ల కార్బన్ ఉద్గారాల‌ను తగ్గించడం, ఈ పర్వతాలు, వాటి జీవవైవిధ్యాన్ని రక్షించడం చాలా కీలకంగా మారింది.
Published date : 23 Dec 2020 04:59PM

Photo Stories