Skip to main content

ఆగస్టు 21న అంతర్జాతీయ ఉగ్రవాద బాధితులకు స్మారక దినం

ఏటా ఉగ్రవాద బాధితులకు అంతర్జాతీయ స్మారక, నివాళి దినోత్స‌వం ఆగస్టు 21న జరుపుతారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రధాన లక్ష్యాల‌ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రోజును నిర్వ‌హిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, దేశాలను ప్రభావితం చేసే ప‌రిస్థితుల‌పై అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం.

చరిత్ర:

  1. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యుఎన్‌జిఎ) 72/165 (2017) తీర్మానాన్ని ఆమోదించి, ఆగస్టు 21ను అంతర్జాతీయ ఉగ్రవాద బాధితులకు నివాళిగా ఏర్పాటు చేసింది.
  2. ఉగ్రవాద బాధితులు, సర్వైవ‌ర్‌ల‌ను గౌరవించటానికి, వారికి మద్దతు ఇవ్వడానికి, వారి హక్కులు, స్వేచ్ఛను పొందేలా చూడ‌డానికి ఈ రోజును ఏర్పాటు చేశారు.
Published date : 08 Sep 2020 03:19PM

Photo Stories