ఆగస్టు 1న ముస్లిం మహిళా హక్కుల దినోత్సవం
Sakshi Education

ఇటీవలే, ఆగస్టు 1న ముస్లిం మహిళల చట్టం, 2019 ఆమోదించిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆ రోజును “ముస్లిం మహిళా హక్కుల దినోత్సవం” (వివాహంపై హక్కుల పరిరక్షణ)గా గుర్తించారు. ఈ చట్టం ట్రిపుల్ తలాక్‌ను క్రిమినల్ నేరంగా మార్చింది.
ప్రధానాంశాలు..
- ముస్లిం మహిళల నిబంధనలు (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019
- ఈ చట్టం ప్రకారం వ్రాతపూర్వక లేదా ఎలక్ట్రానిక్ ఏ రూపంలో తలాక్ చెప్పిన చట్టవిరుద్ధం.
- ఇది తలాక్ ను నేరంగా గుర్తించింది (మహిళ ఈ విషయమై సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే). వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
- ఈ చట్టం ప్రకారం పోలీసు అధికారి వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్టు చేయవచ్చు.
- నిందితులకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయవచ్చు. మహిళ వాదన విన్న తర్వాత మాత్రమే బెయిల్ మంజూరు చేయవచ్చు ( బాధిత మహిళ). అలాగే బెయిల్ మంజూరు చేయడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ సంతృప్తి చెందితే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.
- మహిళ అభ్యర్థన మేరకు మేజిస్ట్రేట్ ఎదుట నిందితుడు, బాధితురాలు రాజీ చేసుకోవచ్చు.
- తలాక్ పొందిన ముస్లిం మహిళ, ఆమె కోసం, ఆమెపై ఆధారపడిన పిల్లల కోసం తన భర్త నుండి జీవనాధార భత్యం పొందటానికి అర్హురాలు.
Published date : 17 Aug 2020 02:58PM