ఆగస్టు 12న ప్రపంచ ఏనుగు దినోత్సవం
Sakshi Education
ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని ఆగస్టు 12న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏనుగులను సంరక్షించడం గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలివైన, భారీ జంతువును అంతరించిపోకుండా కాపాడే ప్రాముఖ్యతను తెలుపుతుంది.
చరిత్ర:
- మొట్టమొదటి అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని 12 ఆగస్టు 2012న జరుపుకున్నారు. ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని ఎలిఫెంట్ రీ ఇంట్రోడక్షన్ ఫౌండేషన్, చిత్ర నిర్మాతలైన ప్యాట్రిసియా సిమ్స్, మైఖేల్ క్లార్క్ ప్రారంభించారు.
- ప్రపంచ ఏనుగుల సంరక్షణ, రక్షణ కోసం ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని అంకితం చేశారు.
- ప్రపంచ ఏనుగు దినోత్సవం ప్రధాన లక్ష్యం ఏనుగుల సంరక్షణపై అవగాహన కల్పించడం, అడవి ,బందీగా ఉన్న ఏనుగుల మెరుగైన రక్షణ, నిర్వహణ కోసం పరిష్కారాలను కనుగొనడం.
ఏనుగులు:
- ప్రపంచ ఏనుగు దినోత్సవం ఏనుగులు, ఇతర అడవి జంతువులకు మెరుగైన రక్షణ అవసరమని ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తుంది.
- ఏనుగులను బందిఖానాలో ఉంచడం, వేట, మానవ-ఏనుగుల సంఘర్షణ ఆవాసాలను కోల్పోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటాయి. ఏనుగులు ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ లో అంతరించే జాతుల్లో ఇచ్చారు.
- ఆసియా ఏనుగులు అంతరించిపోతున్న జాతులుగా జాబితాతో ఉన్నాయి.
- ఆఫ్రికన్ ఏనుగులు ప్రస్తుతం దుర్బల జాతులుగా జాబితాలో ఉన్నాయి.
Published date : 02 Sep 2020 04:41PM