Skip to main content

సరస్వతి సమ్మాన్

సరస్వతి సమ్మాన్.. భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇది. భారతీయ భాషల్లో (రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో సూచించిన భాషలు) గద్య, పద్య విభాగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ బహుమతికి ఎంపిక చేస్తారు. ఈ బహుమతి కింద రూ.7.5 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందిస్తారు. కె.కె.బిర్లా ఫౌండేషన్ అధ్వర్యంలో 1991 నుంచి ఏటా ఈ బహుమతిని ఇస్తున్నారు.

బహుమతి గ్రహీతలు

సంవత్సరం గ్రహీత రచన భాష
1991 హరివంశ్‌రాయ్ బచ్చన్ ఆత్మకథ హిందీ
1992 రమాకాంత్ రథ్ శ్రీ రాధ ఒడియా
1993 విజయ్ టెండూల్కర్ కన్యాదాన్ మరాఠీ
1994 హర్బజన్ సింగ్ రుక్ తే రుషీ పంజాబీ
1995 బాలమణి అమ్మ నివేద్యం మలయాళం
1996 షంసూర్ రహ్మాన్ షేర్ ఎ షోర్ అంగేజ్ ఉర్దూ
1997 మనుభాయ్ పంచోలి కురుక్షేత్ర గుజరాతీ
1998 శంఖా ఘోష్ గంధర్బ కవిత గుచ్చా బెంగాలీ
1999 ఇందిరా పార్థసారథి రామానుజార్ తమిళం
2000 మనోజ్ దాస్ అమృత ఫల ఒడియా
2001 దలీప్ కౌర్ తివానా కథా కహో ఊర్వశి పంజాబీ
2002 మహేష్ ఎల్కంచ్వార్ యుగాంత్ మరాఠీ
2003 గోవింద చంద్ర పాండే భాగీరథీ సంస్కృతం
2004 సునీల్ గంగోపాధ్యాయ్ ప్రథమ్ అలో బెంగాలీ
2005 కె.అయ్యప్ప పణికర్ అయ్యప్ప పణికారుదే కృతికల్ మలయాళం
2006 జగన్నాథ్ ప్రసాద్ దాస్ పరిక్రమ ఒడియా
2007 నాయర్ మసూద్ తావుస్ చామన్ కీ మైనా ఉర్దూ
2008 లక్ష్మీ నందన్ బోరా కాయకల్ప అస్సామీ
2009 సుర్జీత్ పాతర్ లఫ్జాన్ ది దర్గా పంజాబీ
2010 ఎస్.ఎల్.బైరప్ప మంద్ర కన్నడ
2011 ఎ.ఎ. మానవలన్ ఇరమ కతయ్యం ఇరమాయ కాలం తమిళం
2012 సుగతా కుమారి మానేలేళుత్తు మలయాళం
2013 గోవింద్ మిశ్రా ధూల్ పాదో పర్ హిందీ
2014 వీరప్పా మొయిలీ రామాయణ మహాన్వేషణం కన్నడ
2015 పద్మా సచ్ దేవ్ చిత్ చేతే డోగ్రీ
2016 మహాబలేశ్వర్‌ సెయిల్ హతన్ కొంకణి
2017 సితాన్షు యషశ్చంద్ర వఖర్ గుజరాతీ
Published date : 07 Jul 2012 12:53PM

Photo Stories