Skip to main content

మూర్తిదేవి అవార్డు

ప్రముఖ బెంగాళీ రచయిత జాయ్‌ గోస్వామి 2017 సంవత్సరానికి గాను 31వ మూర్తిదేవి అవార్డుకు ఎంపికయ్యాడు. ఆయన రాసిన ‘Du Dondo Phowara Matro’ రచనకు ఈ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ‘మూర్తి అవార్డు’ గురించి తెలుసుకుందాం..
మూర్తిదేవి అవార్డు
భారతీయ జ్ఞాన్‌పీఠ్ సంస్థ ప్రతి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. సంస్థ వ్యవస్థాపకులైన సాహు శాంతి ప్రసాద్ జైన్ తమ మాతృమూర్తి మూర్తిదేవి జ్ఞాపకార్థం ఈ అవార్డును అందజేస్తున్నారు. 1983లో మూర్తిదేవి అవార్డును ప్రారంభించారు. మానవ విలువలు, భావనలు నేపథ్యంలో భారత తత్వశాస్త్రం, సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పే రచనలకు మూర్తిదేవి అవార్డును అందజేస్తారు. అవార్డు కింద రూ. నాలుగు లక్షల నగదు బహుమతి, సరస్వతి ప్రతిమ అందజేస్తారు.

ఎంపిక
రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన భారతీయ భాషలు, ఆంగ్ల రచనలకు ఈ అవార్డు అందజేస్తారు. అవార్డు ప్రకటించే ఏడాది లేదా అంతకు పదేళ్ల మునుపు ప్రచురించిన పుస్తకాలను మాత్రమే ఎంపిక కమిటీ పరిశీలనలోకి తీసుకుంటుంది.

విశ్వనాథ్ త్రిపాఠి
విశ్వనాథ్ త్రిపాఠి 1931 ఫిబ్రవరి 16న ఉత్తర్‌ప్రదేశ్ లో జన్మించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు. ‘లోక్‌వాణి తులసీదాస్’, ‘మీరా కా కావ్య’, ‘దేశ్ కే ఈజ్ దౌర్ మైన్’, ‘కుచ్ కహనియాన్ కుచ్ విచార్’ వంటి రచనలు చేశారు. ఆయన రచించిన ‘వ్యోమ్‌కేశ్ దర్వేశ్’ రచన ప్రముఖ విమర్శకులు హజారీప్రసాద్ ద్వివేది కాల్పనిక జీవిత చరిత్ర.

తొలి అవార్డు
మూర్తిదేవి అవార్డు అందుకున్న తొలి రచ యిత సి.కె. నాగరాజ రావు(కన్నడ). తొలి మహిళా రచయిత ప్రతిభా రాయ్(ఒడియా) (1991లో). ఇప్పటివరకూ 28 మందికి ఈ అవార్డును ప్రదానం చేశారు. 2013 గ్రహీత సి. రాధాక్రిష్ణన్. మలయాళంలో ఆయన రచించిన ‘తీక్కాదల్ కతాన్హు తిరుమధుమ్’ రచనకు అవార్డు లభించింది.
Published date : 29 Jun 2015 02:27PM

Photo Stories