Skip to main content

ముగ్గురు పరిశోధకులకు భౌతిక శాస్త్ర నోబెల్

ముగ్గురు అంతరిక్ష పరిశోధకులు.. కెనడియెన్ అమెరికన్ జేమ్స్ పీబుల్స్, స్విట్జర్లాండ్‌కు చెందిన మైఖేల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌లకు 2019 సంవత్సరానికి భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది.
మొత్తం బహుమతిలో(9.14 లక్షల అమెరికన్ డాలర్లు) సగ భాగాన్ని పీబుల్స్... మిగిలిన సగాన్ని మేయర్, క్యులోజ్ సంయుక్తంగా గెల్చుకున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 8న ప్రకటించింది. ఈ ముగ్గురి పరిశోధనలు విశ్వంపై మన అవగాహనను మరింత పెంచాయని పేర్కొంది.

బిగ్ బ్యాంగ్ అనంతరం విశ్వం ఎలా రూపాంతీకరణ చెందినదనే విషయంపై జేమ్స్ పీబుల్స్ పరిశోధనలు చేశారు. విశ్వంలో మనకు తెలిసిన గ్రహాలు, నక్షత్రాలు, ఇతర వివరాలు కేవలం 5 శాతమేనని, మిగతా 95 శాతం మనకు తెలియని కృష్ణ పదార్థం(డార్క్ మాటర్), దాని శక్తేనని పీబుల్స్ పరిశోధనల వెల్లైడెందని రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో సైన్స్ బోధిస్తున్న పీబుల్.. ఎంతో ఆసక్తి ఉంటే తప్ప సైన్స్ వైపు రావద్దని విద్యార్థులకు సూచించారు.

యూనివర్సిటీ ఆఫ్ జెనీవాలో ప్రొఫెసర్లుగా ఉన్న మేయర్(77), క్యులోజ్(53)లు 1995 అక్టోబర్‌లో తొలిసారి మన గ్రహ వ్యవస్థకు ఆవల, సూర్యుని తరహా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఓ గ్రహాన్ని గుర్తించారు. సూర్యుడి నుంచి 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని ఫ్రాన్స్ లోని అబ్జర్వేటరీ నుంచి గుర్తించారు. గురు గ్రహ పరిమాణంలో ఉన్న ఈ గ్రహానికి ‘51 పెగాసస్ బీ’ అని నామకరణం చేశారు.
Published date : 10 Oct 2019 06:10PM

Photo Stories