Skip to main content

మరాఠీ రచయిత నెమడేకు జ్ఞాన్‌పీఠ్ పురస్కారం

న్యూఢిల్లీ: ప్రఖ్యాత మరాఠీ రచయిత బాలచంద్ర నెమడే 2014 సంవత్సరానికిగాను సాహిత్యంలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. రచయిత నమ్వర్‌సింగ్ నేతృత్వంలోని జ్ఞానపీఠ్ బోర్డు సెలక్షన్ కమిటీ నెమడేను ఎంపికచేస్తూ నిర్ణయుం తీసుకుంది.
1938లో జన్మించిన నెమడే మరాఠా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 1963లో ప్రచురితమైన ‘కోసాలా ’రచనతో గుర్తింపు తెచ్చుకున్న నెమడే, ఇప్పుడు అదే నవలతో జ్ఞానపీఠ్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ పురస్కారాన్ని వచ్చే ఏప్రిల్‌లో అందజేస్తామని భారతీయు జ్ఞానపీఠ్ పురస్కార కమిటీ డెరైక్టర్ లీలాధర్ మండ్లోయి తెలిపారు.

జ్ఞానపీఠ్ అవార్డు ప్రారంభం : 1961
ప్రదానం చేసేవి: వాగ్దేవి కాంస్య ప్రతిమ, రూ. 11లక్షల నగదు
అర్హత: భారతీయులు అయి ఉండాలి. దేశంలో గుర్తింపుపొందిన భాషల్లో రచనలు ఉండాలి
తొలి పురస్కారం: జి. శంకర కురూప, మలయూళ రచయిత (1965)
తెలుగులో తొలిసారి: విశ్వనాథ సత్యనారాయుణ, రామాయణ కల్పవృక్షం (1970)
రెండోసారి: డాక్టర్ సి.నారాయుణ రెడ్డి, విశ్వంభర (1988)
మూడోసారి: రావూరి భరద్వాజ, పాకుడురాళ్లు (2012)
Published date : 09 Feb 2015 03:01PM

Photo Stories