Skip to main content

మిస్ వరల్డ్-2019

జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ మిస్ వరల్డ్-2019 కిరీటం దక్కించుకున్నారు.
లండన్‌లోని ఎక్సెల్ లండన్ కన్వెన్షన్ సెంటర్‌లో 2019, డిసెంబర్ 14న జరిగిన కార్యక్రమంలో ఆమెను ఈ కిరీటం వరించింది. మిస్ వరల్డ్-2018 వనెస్సా పొన్స్ డి లియోన్(మెక్సికో).. టోనీ-ఆన్ సింగ్ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు. జమైకా నుంచి మిస్ వరల్డ్ గెలుచుకున్న నాలుగో మహిళగా టోనీ-ఆన్ చరిత్ర సృష్టించారు. తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లి, ఫ్లోరిడాలో స్థిరపడింది.

మిస్ వరల్డ్-2019 పోటీల్లో మొదటి రన్నరప్‌గా ఒఫ్లి మెజినో(ఫ్రాన్స్), రెండో రన్నరప్‌గా సుమన్ రావ్(భారత్) నిలిచారు. నవంబర్ 20నుంచి మొదలైన 69వ మిస్ వరల్డ్-2019 పోటీలో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. తుదిపోరుకు చేరిన ఐదుగురికి న్యాయనిర్ణేతల బృందం పలు ప్రశ్నలు సంధించింది. వారి సమాధానాల ఆధారంగా విజేతలను ఎంపిక చేసింది. తన సొంతూరుతోపాటు ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోసం పోరాడతానని ఈ సందర్భంగా భారత్‌కు చెందిన రన్నరప్ సుమన్ రావ్ అన్నారు.

సుమన్ రావ్
జననం:
1998 నవంబర్ 23
స్వస్థలం: రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ సమీపంలోని అయిదానా
తల్లి: సుశీలా కున్వర్ రావ్, గృహిణి
తండ్రి: రతన్ సింగ్, నగల వ్యాపారి
విద్య: నవీముంబైలోని మహాత్మా స్కూల్ ఆఫ్ అకాడెమిక్స్ అండ్ స్పోర్‌‌ట్సలో పాఠశాల విద్య పూర్తి చేశారు, ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో చార్టెర్డ్ అకౌంటెన్సీ చదువుతున్నారు.
భాషలు: ఇంగ్లిష్, హిందీతోపాటు మాతృభాష మేవారీ
వృత్తి: మోడల్, డ్యాన్సర్(కథక్)
2018లో మిస్ నవీముంబై పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచారు. అనంతరం రాజస్తాన్ తరఫున పాల్గొని ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ -2019ను, ఆ పోటీల్లోనే మిస్ ర్యాంప్‌వాక్ అవార్డు గెలుచుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మిస్ వరల్డ్-2019 విజేత
ఎప్పుడు : 2019, డిసెంబర్ 14
ఎవరు : టోనీ-ఆన్ సింగ్
ఎక్కడ : లండన్, బ్రిటన్
Published date : 17 Dec 2019 04:28PM

Photo Stories