Skip to main content

జ్ఞానపీఠ్ పురస్కారం-2018

సాహిత్య రంగంలో విశేష కృషిచేసిన వారికి భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ.. ఏటా జ్ఞానపీఠ్ పురస్కారం ప్రదానం చేస్తోంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషల్లో, ఇంగ్లిష్‌లో రచనలు చేసిన భారతీయులకు దీన్ని ప్రకటిస్తారు.
అవార్డు గ్రహీతలకు రూ.11 లక్షల నగదు, సరస్వతీ దేవీ కాంస్య విగ్రహం ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు 59 మందికి జ్ఞానపీఠ్‌ను ప్రదానం చేయగా.. అందులో ఎనిమిది మంది మహిళా రచయిత్రులున్నారు. తొలి అవార్డు గ్రహీత మలయాళ రచయిత జి.శంకర్ కురుప్. ఆయనకు ఈ అవార్డు 1965లో ‘ఒదక్కుజల్’ అనే పుస్తకానికి లభించింది. తొలి మహిళా గ్రహీత బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి (1976). ఇప్పటివరకు ముగ్గురు తెలుగు రచయితలు జ్ఞానపీఠ్ అందుకున్నారు. వారు.. విశ్వనాథ సత్యనారాయణ (1970), సి.నారాయణ రెడ్డి(1988), రావూరి భరద్వాజ (2012).

2018 అమితావ్ ఘోష్
2018వ సంవత్సరానికి ప్రముఖ రచయిత అమితావ్ ఘోష్‌ను జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికచేసినట్లు ప్రముఖ రచయిత్రి ప్రతిభా రే సారథ్యంలోని జ్ఞానపీఠ్ ఎంపిక మండలి 2018, డిసెంబర్ 14న ప్రకటించింది. ఈ పురస్కారం గెలుచుకున్న తొలి ఆంగ్ల భాషా రచయిత అమితావ్ ఘోష్ కావడం విశేషం. ఆయన 54వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకోనున్నారు. 1956లో కోల్‌కతాలో జన్మించిన అమితావ్ ఘోష్ ప్రస్తుతం న్యూయార్క్‌లో నివశిస్తున్నారు. 1989లో ద షాడో లైన్స్ అనే పుస్తకానికి ఆయన సాహిత్య అకాడెమీ అవార్డు గెలుచుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.

అమితావ్ ఘోష్ ప్రముఖ రచనలు
1. ద సర్కిల్ ఆఫ్ రీజన్
2. ద గ్లాస్ ప్యాలెస్
3. ద హంగ్రీ టైడ్
4. సీ ఆఫ్ పాపీస్
5. రివర్ ఆఫ్ స్మోక్
6. ఫ్లడ్ ఆఫ్ ఫైర్
7. ద గ్రేట్ డిరేంజ్‌మెంట్: క్లైమేట్ ఛేంజ్ అండ్ ద అన్‌థింకబుల్
Published date : 16 Jan 2019 06:15PM

Photo Stories